Pak Vs Nz 1st Test Day 3 Highlights- కరాచీ: పాకిస్తాన్‌తో మొదటి టెస్టులో కెప్టెన్ కేన్ విలియమ్సన్ శతకం సాధించాడు. మూడో రోజు ఆట ముగిసే సరికి.. మొత్తంగా 222 బంతుల్లో 11 ఫోర్ల సాయంతో 105 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో కెరీర్‌లో 25వ సెంచరీ చేసిన విలియమ్సన్... 722 రోజుల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించాడు.
తొలి బ్యాటర్‌గా
అదే విధంగా అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, యూఏఈలలో శతకం సాధించిన తొలి ఆసియాయేతర బ్యాటర్‌గా ఘనత సాధించాడు. ఇక కేన్ మామతో పాటు.. టామ్ లాథమ్ (191 బంతుల్లో 113; 10 ఫోర్లు) కూడా సెంచరీ నమోదు చేయడంతో పాకిస్తాన్‌తో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ స్వల్ప ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
మ్యాచ్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి కివీస్ తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు కోల్పోయి 440 పరుగులు చేసింది. ఫలితంగా 2 పరుగుల ఆధిక్యం అందుకుంది. డెవాన్ కాన్వే (176 బంతుల్లో 92; 14 ఫోర్లు) శతకం చేజార్చుకోగా... బ్లన్‌డెల్ (47), మిచెల్ (42) రాణించారు. పాక్ బౌలర్లలో అబ్రార్‌కు 3 వికెట్లు దక్కాయి. ఆట ముగిసే సమయానికి విలియమ్సన్‌తో పాటు ఇష్ సోధి (1 నాటౌట్) క్రీజ్‌లో ఉన్నాడు.
చదవండి: Devon Conway: కాన్వే అరుదైన రికార్డు! తొలి కివీస్ బ్యాటర్‌గా.. కానీ అదొక్కటే మిస్!
IND v SL 2023: విరామం... విశ్రాంతి... వేటు..! బీసీసీఐకి ఇదేం కొత్త కాదు!
Kane Williamson brings up his 25th Test hundred 🏏#PAKvNZ | #TayyariKiwiHai pic.twitter.com/wwRMYLvt7u
— Pakistan Cricket (@TheRealPCB) December 28, 2022
Comments
Please login to add a commentAdd a comment