సీరియస్ లుక్ ఇచ్చిన బాబర్ ఆజం (PC: PCB Twitter)
Pakistan vs New Zealand, 1st Test- Babar Azam: పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం ఆటతో పాటు విలేకరుల సమావేశంలో తన ప్రవర్తనతో ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు. ఇంగ్లండ్ చేతిలో సొంతగడ్డపై టెస్టు సిరీస్‌లో వైట్‌వాష్ తర్వాత అతడిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో ఇంగ్లండ్ మాదిరి పాక్ కూడా దూకుడైన ఆట విధానం ఆరంభించాలని తాను బాబర్‌కు చెప్పినట్లు అప్పటి పీసీబీ చైర్మన్ రమీజ్ రాజా వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.
ఈ నేపథ్యంలో ఆఖరిదైన మూడో టెస్టులో ఓటమి తర్వాత ఈ విషయం గురించి విలేకరులు ప్రస్తావించగా బాబర్ అసహనం వ్యక్తం చేశాడు. మ్యాచ్ ఫలితాన్ని బట్టే ఎదుటి వాళ్ల ప్రవర్తన ఉంటుందంటూ పరోక్షంగా రమీజ్‌కు చురకలు అంటించాడు. అందరికీ సంతృప్తి కలిగేలా ఆడలేమంటూ తనను విమర్శిస్తూ ప్రశ్నలు అడిగిన వారికి బదులిచ్చాడు.
తాజాగా న్యూజిలాండ్‌తో పాక్ మొదటి టెస్టు డ్రా అయిన నేపథ్యంలో ప్రెస్ మీట్‌లో బాబర్‌కు మరోసారి చేదు అనుభవం ఎదురైంది. మ్యాచ్ గురించి మాట్లాడిన తర్వాత వెళ్లిపోయేందుకు బాబర్ సిద్ధం కాగా.. ఓ జర్నలిస్టు తీవ్రంగా స్పందించారు. ‘‘ఇది సరైన పద్ధతి కాదు. ఇక్కడున్న వారు మిమ్మల్ని మరికొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నారు’’ అని పాక్ సారథి తీరుపై అసహనం ప్రదర్శించారు.
ఒక్క విజయం కూడా లేకుండానే
దీంతో బాబర్‌కు కోపమొచ్చింది. సీరియస్ అటువైపుగా ఓ లుక్కు ఇచ్చాడు. ఇంతలో మీడియా మేనేజర్ జోక్యం చేసుకుని మైక్రోఫోన్ ఆఫ్ చేసి మీటింగ్ ముగించాడు. కాగా న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో పాక్ డ్రాతో గట్టెక్కింది. ఇక ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం సెంచరీ(161)తో మెరవగా.. కివీస్ సారథి కేన్ విలియమ్సన్ ద్విశతకం సాధించాడు. ఈ మ్యాచ్ డ్రా కావడంతో సొంతగడ్డపై ఒక్క టెస్టు విజయం కూడా లేకుండానే బాబర్ ఈ ఏడాది ముగించాడు. ఓవరాల్‌గా తొమ్మిదింట ఒక టెస్టు గెలిచాడు.
చదవండి: ఘనంగా షాహిద్ ఆఫ్రిది కుమార్తె వివాహం.. హాజరైన షాహిన్ ఆఫ్రిది
Pele: అటకెక్కిన అంతర్యుద్దం.. అట్లుంటది పీలేతోని! కానీ.. ఎంత ఎదిగినా... ఆయనకూ తప్పలేదు
Pakistan captain Babar Azam's press conference at the end of the first Test.#PAKvNZ | #TayyariKiwiHai https://t.co/clFdocY85Z
— Pakistan Cricket (@TheRealPCB) December 30, 2022
Comments
Please login to add a commentAdd a comment