Pak Vs NZ: బాబర్‌ ఆజం అజేయ శతకం, సత్తా చాటిన సర్ఫరాజ్‌ | Pak Vs NZ 1st Test Day 1 Score: Babar Century Sarfaraz Fifty Puts Top | Sakshi
Sakshi News home page

Pak Vs NZ: బాబర్‌ ఆజం అజేయ శతకం, సత్తా చాటిన సర్ఫరాజ్‌

Published Tue, Dec 27 2022 7:31 AM | Last Updated on Tue, Dec 27 2022 7:45 AM

Pak Vs NZ 1st Test Day 1 Score: Babar Century Sarfaraz Fifty Puts Top - Sakshi

సత్తా చాటిన బాబర్‌, సర్ఫరాజ్‌ (PC: PCB)

Pakistan vs New Zealand, 1st Test Day 1: సొంతగడ్డపై ఇటీవలే ఇంగ్లండ్‌ చేతిలో చిత్తుగా ఓడిన పాకిస్తాన్‌ జట్టుకు న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో మెరుగైన ఆరంభం లభించింది. సోమవారం ప్రారంభమైన తొలి టెస్టులో ఆట ముగిసే సమయానికి మొదటి ఇన్నింగ్స్‌లో పాక్‌ 5 వికెట్ల నష్టానికి 317 పరుగులు చేసింది.

కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ (277 బంతుల్లో 161 నాటౌట్‌; 15 ఫోర్లు, 1 సిక్స్‌) అజేయ శతకం సాధించగా, దాదాపు నాలుగేళ్ల తర్వాత టెస్టు మ్యాచ్‌ ఆడిన వికెట్‌ కీపర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ (153 బంతుల్లో ) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. బాబర్‌కు టెస్టుల్లో ఇది 9వ సెంచరీ. ఒక దశలో పాకిస్తాన్‌ స్కోరు 110/4 కాగా...ఐదో వికెట్‌కు 196 పరుగులు జోడించి బాబర్, సర్ఫరాజ్‌ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. కివీస్‌ బౌలర్లలో బ్రేస్‌వెల్, ఎజాజ్‌ పటేల్‌ చెరో 2 వికెట్లు తీశారు.

కాగా వైస్‌ కెప్టెన్‌ రిజ్వాన్‌ను కాదని సర్ఫరాజ్‌ అహ్మద్‌కు తుది జట్టులో చోటు ఇవ్వడంపై చీఫ్‌ సెలక్టర్‌ షాహిద్‌ ఆఫ్రిదిపై విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అతడు ఈ మేరకు విలువైన ఇన్నింగ్స్‌ ఆడి సత్తా చాటడం విశేషం.   

చదవండి: IPL 2023: అన్న త్యాగం వల్లే ఇలా కోటీశ్వరుడిగా.. నాన్నను మిస్‌ అవుతున్నా! వాళ్లతో కలిసి ఆడతా 
Suryakumar Yadav: సీక్రెట్‌ రివీల్‌ చేసిన సూర్యకుమార్‌.. వాళ్ల వల్లే ఇలా! కేకేఆర్‌ నుంచి మారిన తర్వాతే
Pak VS NZ: కివీస్‌తో పాక్‌ మ్యాచ్‌.. 145 ఏళ్ల టెస్టు క్రికెట్‌ చరిత్రలో ఇదే తొలిసారి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement