ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 ఫైనల్ చేరడమే లక్ష్యంగా టీమిండియా మరో సిరీస్‌కు సిద్ధమైంది. సొంతగడ్డపై బంగ్లాదేశ్‌ను 2-0తో క్లీన్‌స్వీప్ చేసిన రోహిత్ సేన.. తదుపరి న్యూజిలాండ్‌తో పోరులోనూ ఇదే తరహా ఫలితాన్ని పునరావృతం చేయాలని పట్టుదలగా ఉంది. ఇందుకోసం ఇప్పటికే భారత జట్టు ప్రాక్టీస్‌లో తలమునకలైంది.
ఇక స్వదేశంలో ఈ టెస్టు సిరీస్ జరుగనుండటం టీమిండియాకు సానుకూలాంశం. మరోవైపు.. శ్రీలంక గడ్డపై టెస్టుల్లో 0-2తో వైట్‌వాష్ అయిన కివీస్ జట్టు.. భారత్‌లోనైనా సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది. ఇక డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో రోహిత్ సేన ప్రస్తుతం అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. కివీస్ ఆరో స్థానంలో ఉంది.
మరి ఇరుజట్లకు కీలకమైన ఈ మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ షెడ్యూల్, వేదికలు, మ్యాచ్ ఆరంభ సమయం, లైవ్ స్ట్రీమింగ్, ఇరు జట్లు తదితర వివరాల గురించి తెలుసుకుందామా?!
టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ 2024 టెస్టు సిరీస్
👉తొలి టెస్టు: అక్టోబరు 16(బుధవారం)- అక్టోబరు 20(ఆదివారం), ఎం.చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు
👉రెండో టెస్టు: అక్టోబరు 24(గురువారం)- అక్టోబరు 28(సోమవారం), మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, పుణె
👉మూడో టెస్టు: నవంబరు 1(శుక్రవారం)- నవంబరు 5(మంగళవారం), వాంఖడే స్టేడియం, ముంబై.
మ్యాచ్ సమయం: భారత కాలమానం ప్రకారం.. మూడు టెస్టులు ఉదయం 9.30 - సాయంత్రం 5 గంటల వరకు.
ఎక్కడ చూడవచ్చు?
👉టీవీ: స్పోర్ట్స్ 18లో లైవ్ టెలికాస్ట్
👉డిజిటల్ మీడియా: జియో సినిమా, వెబ్‌సైట్‌లో ప్రత్యక్ష ప్రసారం.
న్యూజిలాండ్‌తో టెస్టులకు భారత జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), జస్‌ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్.
రిజర్వ్ ఆటగాళ్లు: హర్షిత్ రాణా, నితీశ్ కుమార్ రెడ్డి, మయాంక్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ.
భారత్‌తో టెస్టు సిరీస్‌కు న్యూజిలాండ్ టీమ్
డెవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్, మార్క్ చాప్‌మన్, విల్ యంగ్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్(కెప్టెన్), గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రాస్‌వెల్, మిచెల్ సాంట్నర్, రచిన్ రవీంద్ర, టామ్ బ్లండెల్, అజాజ్ పటేల్, బెన్ సియర్స్, మాట్ హెన్రీ, టిమ్ సౌథీ, విలియం ఓ రూర్కే.
చదవండి: W T20 WC: కథ మళ్లీ మొదటికి...
𝗜𝗻𝗱𝗶𝗮 𝘃𝘀 𝗡𝗲𝘄 𝗭𝗲𝗮𝗹𝗮𝗻𝗱
𝘛𝘩𝘦 𝘗𝘳𝘦𝘭𝘶𝘥𝘦 𝘣𝘺 𝘙 𝘈𝘴𝘩𝘸𝘪𝘯#TeamIndia 🇮🇳 is back in whites 🤍
One sleep away from Test No.1#INDvNZ | @IDFCFIRSTBank | @ashwinravi99 pic.twitter.com/lzVQCrtaLh— BCCI (@BCCI) October 15, 2024
Comments
Please login to add a commentAdd a comment