వరల్డ్‌కప్‌లో న్యూజిలాండ్‌కు భారీ షాక్‌.. | New Zealand Fast Bowler Matt Henry Ruled Out Of World Cup 2023, Jamieson Named Replacement - Sakshi
Sakshi News home page

World cup 2023: వరల్డ్‌కప్‌లో న్యూజిలాండ్‌కు భారీ షాక్‌..

Published Fri, Nov 3 2023 4:02 PM | Last Updated on Fri, Nov 3 2023 4:21 PM

Henry ruled out of World Cup, Jamieson named replacement - Sakshi

వన్డే ప్రపంచకప్‌-2023లో న్యూజిలాండ్‌కు బిగ్‌ షాక్‌ తగిలింది. ఆ జట్టు స్టార్‌ పేసర్‌ మాట్‌ హెన్రీ గాయం కారణంగా టోర్నీలో మిగిలిన మ్యాచ్‌లకు దూరమయ్యాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో హెన్రీ తొడ కండరాలు పట్టేశాయి. దీంతో ఆట మధ్యలోనే 5 ఓవర్లు బౌలింగ్‌ చేసి మైదానం వీడి వెళ్లాడు.

అతడి బౌలింగ్‌ కోటాను జెమ్మీ నీషమ్‌ పూర్తి చేశాడు. ఆ తర్వాత హెన్రీ బ్యాటింగ్‌కు వచ్చినప్పటికీ పరుగులు తీయడానికి చాలా ఇబ్బంది పడ్డాడు. అయితే అతడు తన గాయం నుంచి కోలుకోవడానికి దాదాపు మూడు నుంచి నాలుగు వారాల సమయం పట్టనున్నట్లు కివీస్‌ వైద్యబృందం వెల్లడించింది.

ఈ క్రమంలోనే అతడు టోర్నీలో మిగిలిన మ్యాచ్‌లకు దూరమయ్యాడు. హెన్రీ స్ధానాన్ని  కైల్‌ జేమీసన్‌తో న్యూజిలాండ్‌ క్రికెట్‌ భర్తీ చేసింది. జేమీసన్‌ ఇప్పటికే జట్టుతో చేరాడు. కాగా ఈ మెగా టోర్నీలో భాగంగా కివీస్‌ నవంబర్‌ 4న బెంగళూరు వేదికగా పాకిస్తాన్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి తమ సెమీస్‌ ఆశలను సజీవంగా నిలుపుకోవాలని న్యూజిలాండ్‌ భావిస్తోంది. కాగా ఈ మ్యాచ్‌కు కూడా కివీస్‌ రెగ్యూలర్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ దూరమయ్యే ఛాన్స్‌ ఉంది.
చదవండి: WC 2023: కపిల్‌ దేవ్‌, ధోనికి సాధ్యం కాలేదు! రోహిత్‌కు కలిసొచ్చింది.. అరుదైన రికార్డు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement