వన్డే ప్రపంచకప్-2023లో న్యూజిలాండ్‌కు పాకిస్తాన్ ఊహించని షాక్ తగిలింది. ఈ మెగా టోర్నీలో భాగంగా బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్‌లో కివీస్‌పై 21 పరుగుల తేడాతో పాకిస్తాన్ విజయం సాధించింది. వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్‌లో డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం పాకిస్తాన్ గెలుపొందింది.
ఈ విజయంతో పాకిస్తాన్ తమ సెమీస్ అవకాశాలను సజీవంగా నిలుపుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 401 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అనంతరం లక్ష్య ఛేదనలో పాకిస్తాన్ ఇన్నింగ్స్ 21. 3 ఓవర్లలో వికెట్ నష్టానికి 160/1 వద్ద ఆటకు వర్షం అంతరాయం కలిగించింది.
అయితే వర్షం తగ్గముఖం పట్టడంతో మ్యాచ్‌ను 41 ఓవర్లకు కుదించారు. డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం పాకిస్తాన్ టార్గెట్‌ను 342 పరుగులు కుదించారు. మ్యాచ్ తిరిగి ప్రారంభమయ్యే సమయానికి పాకిస్తాన్‌కు 19. 3 ఓవర్లలో 182 పరుగులు అవసరమయ్యాయి. అయితే మ్యాచ్ ఆరంభమైన కొద్దిసేపిటికే మళ్లీ వరుణుడు రీ ఎంట్రీ ఇచ్చాడు.
రెండో సారి ఆట నిలిచిపోయే సమయానికి పాకిస్తాన్ 179 పరుగులు చేసింది. అప్పటికే న్యూజిలాండ్ డీఎల్‌ఎస్ ప్రకారం.. 21 పరుగుల ముందంజలో ఉంది. ఈ క్రమంలో వర్షం తగ్గుముఖం పట్టే సూచనలు కన్పించకపోవడంతో పాకిస్తాన్‌ను డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం విజేతగా నిర్ణయించారు.
జమాన్ సూపర్ ఇన్నింగ్స్..
కాగా పాకిస్తాన్ విజయంలో ఆ జట్టు ఓపెనర్ ఫఖార్ జమాన్ కీలక పాత్ర పోషించాడు. జమాన్ అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. భారీ లక్ష్య ఛేదనలో కివీస్ బౌలర్లను ఊచకోత కోశాడు. కేవలం 63 బంతుల్లోనే తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా 81 బంతుల్లో 8 ఫోర్లు ,11 సిక్స్‌లతో 126 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు కెప్టెన్ బాబర్ ఆజం(66 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
చదవండి: WC 2023 NZ Vs PAK: చరిత్ర సృష్టించిన పాకిస్తాన్ ఓపెనర్.. వరల్డ్‌కప్ చరిత్రలోనే
Comments
Please login to add a commentAdd a comment