పాకిస్తాన్ స్టార్ పేసర్ షాహీన్ షా అఫ్రిది అత్యంత చెత్తరికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. వన్డే వరల్డ్‌కప్ ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు ఇచ్చిన పాకిస్తాన్ బౌలర్‌గా అఫ్రిది నిలిచాడు. వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా బెంగళూరు వేదికగా న్యూజిలాండ్‌తో జరగుతున్న మ్యాచ్‌లో అఫ్రిది తన 10 ఓవర్ల కోటాలో ఏకంగా 90 పరుగులు సమర్పించుకున్నాడు.
తద్వారా ఈ చెత్త రికార్డును అఫ్రిది తన ఖాతాలో వేసుకున్నాడు. 10 ఓవర్లు మొత్తం బౌలింగ్ చేసిన అఫ్రిది ఒక్క వికెట్ కూడా తీయకపోవడం గమనార్హం. కాగా ఇప్పటి వరకు ఈ చెత్త రికార్డు తన సహచర పేసర్ హసన్ అలీ పేరిట ఉండేది. 2019 వన్డే ప్రపంచకప్‌లో భారత్‌తో మ్యాచ్‌లో అలీ ఏకంగా 84 పరుగులు సమర్పించుకున్నాడు.
అయితే న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో హ్యారీస్ రవూఫ్ కూడా చెత్త బౌలింగ్ ప్రదర్శన కనబరిచాడు. తన 10 ఓవర్ల కోటాలో 85 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ పడగొట్టాడు. ఈ క్రమంలో రవూఫ్ కూడా హసన్ అలీని దాటేశాడు. ఈ చెత్త రికార్డు సాధించిన జాబితాలో అఫ్రిది తర్వాత రవూఫ్ ఉన్నాడు.
చెలరేగిన కివీస్ బ్యాటర్లు..
కాగా పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో కివీస్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి ఏకంగా 401 పరుగుల భారీ స్కోర్ చేసింది. కివీస్ బ్యాటర్లలో రచిన్ రవీంద్ర(108) సెంచరీతో చెలరేగగా.. కేన్ విలియమ్సన్(95), గ్లెన్ ఫిలిప్స్(41) పరుగులతో అద్బుతమైన ఇన్నింగ్స్‌లు ఆడారు.
చదవండి: WC 2023: సెంచరీతో చెలరేగిన రచిన్.. సచిన్ రికార్డు బద్దలు.. ప్రపంచంలోనే తొలి బ్యాటర్‌గా
Comments
Please login to add a commentAdd a comment