"Results don't matter" - Shaheen Afridi's makes bold statement: పాకిస్తాన్ క్రికెట్ జట్టు వైఫల్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. భారత్ వేదికగా వన్డే వరల్డ్‌కప్-2023లో చెత్త ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకున్న బాబర్ ఆజం బృందం సెమీస్ కూడా చేరకుండానే నిష్క్రమించింది.
ఈ నేపథ్యంలో చేపట్టిన ప్రక్షాళన చర్యల్లో భాగంగా బాబర్ అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీకి రాజీనామా చేశాడు. అతడి స్థానంలో టెస్టులకు షాన్ మసూద్.. టీ20లకు షాహిన్ ఆఫ్రిది సారథులుగా నియమితులయ్యారు. ఇక మాజీ క్రికెటర్ మహ్మద్ హఫీజ్ టీమ్ డైరెక్టర్ కమ్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించి తనదైన మార్కు చూపేందుకు విఫలయత్నాలు చేస్తున్నాడు.
ఇందులో భాగంగా హఫీజ్ మార్గదర్శనంలో మసూద్ నేతృత్వంలో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన పాకిస్తాన్ టెస్టుల్లో 0-3తో వైట్‌వాష్‌కు గురైంది. ఈ ఘోర అవమానం నుంచి కోలుకోకముందే న్యూజిలాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 0-3తో కోల్పోయింది.
డునెడిన్ వేదికగా కివీస్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో 45 పరుగుల తేడాతో ఓడిపోయి ఈ పరాభవాన్ని మూటగట్టుకుంది. ఈ నేపథ్యంలో పాక్ టీ20 జట్టు కెప్టెన్ షాహిన్ ఆఫ్రిది ఓటమిపై స్పందిస్తూ.. ఫలితాలతో మాకు సంబంధం లేదంటూ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Shaheen Afridi says result doesn't matter, effort of players matters 🤯
— Farid Khan (@_FaridKhan) January 17, 2024
Do you agree with this statement? #NZvsPAK
pic.twitter.com/Y69482v7ih
ఈ మేరకు..‘‘ మ్యాచ్ ఫలితాలతో మాకు పట్టింపు లేదు. మా ఆటగాళ్లు విజయం కోసం తగినంత ఎఫర్ట్ పెడుతున్నారా లేదా అన్నదే ముఖ్యం. నాకు తెలిసి మా జట్టులోని ప్రతి ప్లేయర్ పూర్తి నిబద్ధతతో ఆడుతున్నారు.
మెరుగైన ప్రదర్శన ఇచ్చేందుకు కృషి చేస్తున్నారు. ముందు నుంచి చెప్తున్నట్లుగానే బాబర్ ఫామ్‌లేమితో సతమతం కావడం లేదు. ఈ సిరీస్‌లో అతడు మూడు మెరుగైన ఇన్నింగ్స్ ఆడాడు.
అయితే, జట్టుకు ప్రయోజనం చేకూర్చే విధంగా ఇన్నింగ్స్ ఫినిష్ చేయలేకపోయాడు. అతడికి తోడుగా కనీసం ఒక్క బ్యాటర్ అయినా పట్టుదలగా నిలబడి ఉంటే బాగుండేది.
ఈరోజు కూడా అలాగే జరిగింది. బాబర్‌తో పాటు ఇంకొక్కరు రాణించినా ఫలితం వేరేలా ఉండేది’’ అని షాహిన్ ఆఫ్రిది పేర్కొన్నాడు. కాగా న్యూజిలాండ్‌తో సిరీస్‌లో బాబర్ ఆజం ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లలో కలిపి 181 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. రెగ్యులర్ ఓపెనర్‌గా కాకుండా వన్‌డౌన్‌లో బరిలోకి దిగి ఈ మేరకు పరుగులు రాబట్టాడు.
చదవండి: IPL 2024: హార్దిక్ వెళ్లినా నష్టం లేదు.. గిల్ కూడా వెళ్లిపోతాడు: షమీ కీలక వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment