
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 సన్నాహాకాలను న్యూజిలాండ్ ఘనంగా ఆరంభించింది. ఈ టోర్నీకి ముందు న్యూజిలాండ్-పాకిస్తాన్-దక్షిణాఫ్రికా జట్లు ట్రైసిరీస్‌లో తలపడుతున్నాయి. ఈ సిరీస్‌లో భాగంగా లహోర్ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కివీస్ బ్యాటర్లు జూలు విధిల్చారు. ముఖ్యంగా న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ గ్లెన్ ఫిలిప్స్ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు.
ఆరో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ఫిలిప్స్.. పాక్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. పాక్ స్పీడ్ స్టార్ షాహీన్ అఫ్రిదినైతే ఫిలిప్స్ ఓ ఆట ఆడేసికున్నాడు. బ్లాక్ క్యాప్స్ ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ వేసిన అఫ్రిది బౌలింగ్‌లో ఈ కీవీ స్టార్.. రెండు సిక్స్‌లు, రెండు ఫోర్ల సాయం(Wd Wd 4 6 6 2 4 1) సాయంతో ఏకంగా 29 పరుగులు పిండుకున్నాడు.
ఈ క్రమంలో కేవలం 72 బంతుల్లోనే తొలి వన్డే సెంచరీని ఫిలిప్స్ అందుకున్నాడు. ఆఖరి వరకు అతడిని ఆపడం ప్రత్యర్ధి బౌలర్ల తరం కాలేదు. ఓవరాల్‌గా 74 బంతులు ఎదుర్కొన్న ఫిలిప్స్.. 6 ఫోర్లు, 7 సిక్స్‌లతో 106 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు డార్లీ మిచెల్(81), కేన్ విలియమ్సన్(81) హాఫ్ సెంచరీలతో రాణించారు.
దీంతో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 330 పరుగుల భారీ స్కోర్ సాధించారు. పాక్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది మూడు వికెట్లు పడగొట్టగా.. అర్బర్ ఆహ్మద్ రెండు, రౌఫ్ ఒక్క వికెట్ సాధించారు.
తుది జట్లు
పాకిస్తాన్: ఫఖర్ జమాన్, బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్ (కెప్టెన్ అండ్ వికెట్ కీపర్), ఖుష్దిల్ షా, కమ్రాన్ గులాం, సల్మాన్ అఘా, తయ్యబ్ తాహిర్, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, హరీస్ రవూఫ్, అబ్రార్ అహ్మద్
న్యూజిలాండ్: రచిన్ రవీంద్ర, విల్ యంగ్, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్ (వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), మాట్ హెన్రీ, బెన్ సియర్స్, విలియం ఒరోర్కే
చదవండి: ఛాంపియన్స్ ట్రోఫీ గెలిస్తే సరిపోదు.. టీమిండియాను ఓడించాలి: పాక్ ప్రధాని
GLENN PHILIPS SHOW AT LAHORE....!!
- Philips smashed Hundred from just 72 balls against Pakistan in Pakistan 🔥⚡ pic.twitter.com/YnGqsULtsL— Johns. (@CricCrazyJohns) February 8, 2025