
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 తుది అంకానికి చేరుకుంది. ఆదివారం(మార్చి 9) దుబాయ్ వేదికగా జరగనున్న ఫైనల్ పోరులో భారత్-న్యూజిలాండ్(IND vs NZ) అమీతుమీ తెల్చుకోనున్నాయి. తొలి సెమీస్‌లో ఆసీస్‌ను చిత్తు చేసి టీమిండియా ఫైనల్లో అడుగుపెట్టగా.. రెండో సెమీస్‌లో సౌతాఫ్రికాను ఓడించి ఫైనల్‌కు చేరింది కివీస్.
అయితే ఈ తుదిపోరుకు ముందు న్యూజిలాండ్‌కు భారీ షాక్ తగిలే సూచనలు కన్పిస్తున్నాయి. ఆ జట్టు స్టార్ పేసర్ మాట్ హెన్రీ(Matt Henry) గాయం బారిన పడ్డాడు. లహోర్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన సెమీఫైనల్లో హెన్రిస్ క్లాసెన్ క్యాచ్‌ను అందుకునే క్రమంలో హెన్రీ భుజానికి గాయమైంది. దీంతో అతడు నొప్పితో విల్లవిల్లాడు.
వెంటనే ఫిజియో సాయంతో మైదానాన్ని వీడాడు. ఆ తర్వాత మళ్లీ మైదానంలో వచ్చినప్పటికి తన సెకెండ్ స్పెల్‌లో కేవలం రెండు ఓవర్లు బౌలింగ్ మాత్రమే వేశాడు. ఈ మ్యాచ్‌లో 7 ఓవర్లు బౌలింగ్ చేసిన హెన్రీ.. 43 పరుగులిచ్చి రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. అయితే మ్యాచ్ అనంతరం హెన్రీ గాయంపై కివీస్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ సైతం కాస్త ఆందోళన వ్యక్తం చేశాడు.
"హెన్రీ భుజం నొప్పితో బాధపడుతున్నాడు. అయితే ఫైనల్ మ్యాచ్‌కు ఇంకా సమయం ఉంది కాబట్టి, అతడి గాయం తీవ్రత ఎలా ఉంటుందో చూడాలి అన్నట్లు శాంట్నర్ చెప్పుకొచ్చాడు. ఒకవేళ హెన్రీ ఫైనల్‌కు దూరమైతే కివీస్‌కు గట్టి ఎదురుదెబ్బే అనే చెప్పాలి.
అతడు ప్రస్తుతం అద్బుతమైన ఫామ్‌లో ఉన్నాడు. భారత్‌తో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో హెన్రీ 5 వికెట్లతో సత్తాచాటాడు. ముఖ్యంగా భారత్‌పై మంచి రికార్డు అతడికి ఉంది. భారత్‌పై 11 మ్యాచ్‌లు ఆడిన ఈ కివీ స్పీడ్ స్టార్.. 4.48 ఎకానమీతో 21 వికెట్లు పడగొట్టాడు.
చదవండి: Steve Smith: కోహ్లికి ముందే తెలుసు!
Comments
Please login to add a commentAdd a comment