
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్లో దుబాయ్ వేదికగా భారత్-న్యూజిలాండ్ జట్లు తలపడేందుకు సిద్దమైంది. ఈ ఫైనల్ పోరుకు ముందు కివీస్‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలే సూచనలు కన్పిస్తున్నాయి. ఆ జట్టు స్టార్ పేసర్ మాట్ హెన్రీ గాయం కారణంగా ఫైనల్ మ్యాచ్‌కు దూరమయ్యే అవకాశముంది.
హెన్రీ ప్రస్తుతం భుజం గాయంతో బాధపడుతున్నాడు. సౌతాఫ్రికాతో జరిగిన సెమీస్‌లో గాయపడ్డ ఈ కివీ స్పీడ్ స్టార్ ఇంకా కోలుకోపోయినట్లు తెలుస్తోంది. అతడు భుజం నొప్పి కారణంగా అతడు ఎక్కువగా ప్రాక్టీస్‌లో కూడా పాల్గోకపోయినట్లు సమాచారం.
నెట్ ప్రాక్టీస్‌లో హెన్రీ కేవలం ఏడు బంతులు మాత్రమే సంధించినట్లు రేవ్‌స్పోర్ట్స్ జర్నలిస్ట్ రోహిత్ జుగ్లాన్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశాడు. హెన్రీ అందుబాటుపై ఇప్పటివరకు న్యూజిలాండ్ జట్టు మెనెజ్‌మెంట్ ఎటువంటి ప్రకటన చేయలేదు. ప్రస్తుత పరిస్థితుల బట్టి అతడు మ్యాచ్‌లో ఆడే సూచనలు కన్పించడం లేదు.
ఒకవేళ హెన్రీ ఫైనల్‌కు దూరమైతే కివీస్‌కు గట్టి ఎదురుదెబ్బే అనే చెప్పాలి. అతడు ప్రస్తుతం అద్బుతమైన ఫామ్‌లో ఉన్నాడు. భారత్‌తో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో హెన్రీ 5 వికెట్లతో సత్తాచాటాడు. ముఖ్యంగా భారత్‌పై మంచి రికార్డు అతడికి ఉంది. భారత్‌పై 11 మ్యాచ్‌లు ఆడిన ఈ కివీ స్పీడ్ స్టార్.. 4.48 ఎకానమీతో 21 వికెట్లు పడగొట్టాడు. హెన్రీ మ్యాచ్‌కు దూరమైతే అతడి స్ధానంలో జాకబ్ డఫీ తుది జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది.
తుది జట్ల వివరాలు (అంచనా)
భారత్: రోహిత్ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, పాండ్యా, జడేజా, అక్షర్ పటేల్, మహ్మద్ షమీ, కుల్దీప్, వరుణ్.
న్యూజిలాండ్: సాంట్నర్ (కెప్టెన్), యంగ్, రచిన్, విలియమ్సన్, మిచెల్, లాథమ్, ఫిలిప్స్, బ్రేస్‌వెల్, జేమీసన్, రూర్కే, హెన్రీ/ డఫీ.
చదవండి: IML 2025: యువరాజ్, రాయుడు విధ్వంసం..సెమీస్‌కు చేరిన టీమిండియా
Comments
Please login to add a commentAdd a comment