లక్నో సూపర్ జెయింట్స్ (PC: IPL)
పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌కు ముందు లక్నో సూపర్ జెయింట్స్ కీలక ప్రకటన చేసింది. డేవిడ్ విల్లే స్థానాన్ని న్యూజిలాండ్ సీమర్ మ్యాట్ హెన్రీతో భర్తీ చేస్తున్నట్లు శనివారం ప్రకటించింది. కాగా ఐపీఎల్-2024 వేలంలో ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ డేవిడ్ విల్లేను లక్నో.. రూ. 2 కోట్ల కనీస ధరకు కొనుగోలు చేసింది.
అయితే వ్యక్తిగత కారణాల దృష్ట్యా విల్లే.. ఐపీఎల్ తాజా ఎడిషన్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ ఫాస్ట్‌బౌలర్ మ్యాట్ హెన్రీని జట్టులోకి తీసుకువచ్చింది లక్నో సూపర్ జెయింట్స్. రూ. 1.25 కోట్ల కనీస ధరకు అతడిని సొంతం చేసుకుంది.
కాగా న్యూజిలాండ్ తరఫున 2014లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన మ్యాచ్ హెన్రీ.. ఇప్పటి వరకు 25 టెస్టులు, 82 వన్డేలు, 17 టీ20లు ఆడి.. ఆయా ఫార్మాట్లలో 95, 141, 20 వికెట్లు తీశాడు. 32 ఏళ్ల హెన్రీ రైటార్మ్ ఫాస్ట్ బౌలర్. గతంలో ఐపీఎల్ ఫ్రాంఛైజీ పంజాబ్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు.
ఇక ఓవరాల్‌గా పొట్టి ఫార్మాట్లో 131 మ్యాచ్‌లు ఆడిన మ్యాట్ హెన్రీ.. 151 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. అతడి రాకతో లక్నో సూపర్ జెయింట్స్ పేస్ దళం పటిష్టం అవుతుందని చెప్పవచ్చు. కాగా లక్నో శనివారం నాటి మ్యాచ్‌లో లక్నో వేదికగా పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది.
ఇక ఇప్పటి వరకు ఈ సీజన్‌లో ఒకే ఒక్క మ్యాచ్ ఆడిన లక్నో సూపర్ జెయింట్స్ ఓటమిపాలైంది. రాజస్తాన్ రాయల్స్‌తో గత ఆదివారం జరిగిన మ్యాచ్‌లో 20 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ అర్ధ శతకం(44 బంతుల్లో 58 రన్స్) వృథాగా పోయింది.
చదవండి: వాళ్లిద్దరికి ఆస్కార్ ఇవ్వాలి: టీమిండియా దిగ్గజం షాకింగ్ కామెంట్
Comments
Please login to add a commentAdd a comment