ముంబై వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తీవ్ర నిరాశపరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో 18 పరుగులు మాత్రమే చేసిన హిట్‌మ్యాన్.. రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 11 పరుగులకే పెవిలియన్‌కు చేరాడు.
147 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు రోహిత్ శర్మ శుభారంభం అందిస్తాడని భావించారు. కానీ రోహిత్ అందరి ఆశలను అడియాశలు చేశాడు. కివీ పేసర్ మాట్ హెన్రీ బౌలింగ్‌లో నిర్లక్ష్యపు షాట్ ఆడి రోహిత్ తన వికెట్‌ను కోల్పోయాడు.
ట్రాప్‌లో చిక్కుకున్న హిట్‌మ్యాన్..
రోహిత్ శర్మ సెకెండ్ ఇన్నింగ్స్ ఆరంభం నుంచే తన ఫేవరేట్ ఫుల్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. తొలి ఓవర్ వేసిన మాట్ హెన్రీ బౌలింగ్‌లో రోహిత్ అద్బుతమైన బౌండరీ కూడా సాధించాడు. ఈ క్రమంలో భారత ఇన్నింగ్స్ మూడో ఓవర్ వేసేందుకు హెన్రీ మళ్లీ ఎటాక్‌లో వచ్చాడు.
అయితే సరిగ్గా ఇదే సమయంలో కివీస్ కెప్టెన్ టామ్ లాథమ్ తన కెప్టెన్సీ స్కిల్స్‌ను ప్రదర్శించాడు. లాథమ్ లాంగ్ ఆన్, మిడ్-ఆన్ మధ్యలో ఫీల్డర్‌ను ఉంచి రోహిత్‌కు పుల్ షాట్ ఆడేందుకు అవకాశమిచ్చాడు.
ఈ నేపథ్యంలో మూడో ఓవర్ ఆఖరి బంతిని హెన్రీ బ్యాక్‌ఆఫ్‌ది లెంగ్త్ బాల్‌గా హిట్‌మ్యాన్‌కు సంధించాడు. దీంతో ఆ బంతిని రోహిత్ ఫుల్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. షాట్ సరిగ్గా కనక్ట్‌కాకపోవడంతో బంతి గాల్లోకి లేచింది.
దీంతో మిడ్-వికెట్‌లో ఉన్న గ్లెన్ ఫిలిప్స్ ఈజీ క్యాచ్ అందుకున్నాడు. ఈ క్రమంలో రోహిత్ శర్మపై నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. అసలు ఆ షాట్ ఆడాల్సిన అవసరం ఏముందని పోస్టులు పెడుతున్నారు.
ఇక సెకెండ్ ఇన్నింగ్స్‌లో భారత్ 12 ఓవర్లు ముగిసే సరికి 5 వికెట్ల నష్టానికి 55 పరుగులు చేసింది. క్రీజులో రిషబ్ పంత్(23), జడేజా(5) ఉన్నారు. టీమిండియా విజయానికి ఇంకా 92 పరుగులు కావాలి.
— viratgoback (@viratgoback) November 3, 2024
Comments
Please login to add a commentAdd a comment