CT 2025: బ్యాటింగ్‌లో రచిన్‌.. బౌలింగ్‌లో హెన్రీ | Champions Trophy 2025 Stats | Sakshi
Sakshi News home page

CT 2025: బ్యాటింగ్‌లో రచిన్‌.. బౌలింగ్‌లో హెన్రీ

Published Mon, Mar 10 2025 6:11 PM | Last Updated on Mon, Mar 10 2025 6:34 PM

Champions Trophy 2025 Stats

ఛాంపియన్స్‌ ట్రోఫీ-2025 విజేతగా టీమిండియా అవతరించిన విషయం తెలిసిందే. దుబాయ్‌ వేదికగా నిన్న (మార్చి 9) జరిగిన ఫైనల్లో భారత్‌ న్యూజిలాండ్‌పై 4 వికెట్ల తేడాతో గెలుపొంది, మూడోసారి (2002, 2013, 2025) ఛాంపియన్స్‌ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ టోర్నీలో మొత్తం 8 జట్లు  పాల్గొనగా.. భారత్‌, న్యూజిలాండ్‌ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చి ఫైనల్‌కు చేరాయి. ఉత్కంఠగా సాగిన ఫైనల్లో భారత్‌ న్యూజిలాండ్‌పై పైచేయి సాధించింది. టీమిండియా ఈ టోర్నీలో గ్రూప్‌ దశలోనూ కివీస్‌పై విజయం సాధించింది.

ఈ టోర్నీలో భారత్‌ విజేతగా నిలిచినప్పటికీ.. గణాంకాలలో న్యూజిలాండ్‌ ఆటగాళ్లే టాప్‌లో  ఉన్నారు. బ్యాటింగ్‌లో రచిన్‌ రవీంద్ర.. బౌలింగ్‌లో మ్యాట్‌ హెన్రీ టోర్నీ టాపర్లుగా నిలిచారు. ఈ టోర్నీలో తొలి మ్యాచ్‌ నుంచే అదరగొట్టిన రచిన్‌.. 4 మ్యాచ్‌ల్లో 65.75 సగటున, 106.48 స్ట్రయిక్‌రేట్‌తో 263 పరుగులు (2 సెంచరీలు) చేసి లీడింగ్‌ రన్‌ స్కోరర్‌గా నిలిచాడు. తద్వారా ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నీ అవార్డును కూడా గెలుచుకున్నాడు.  బౌలింగ్‌ విషయానికొస్తే.. ఈ టోర్నీలో మ్యాట్‌ హెన్రీ 4 మ్యాచ్‌ల్లో 10 వికెట్లు తీసి లీడింగ్‌ వికెట్‌ టేకర్‌గా నిలిచాడు. గాయం కారణంగా కీలకమైన ఫైనల్లో హెన్రీ ఆడకపోవడం న్యూజిలాండ్‌ విజయావకాశాలను ప్రభావితం చేసింది.

ఈ టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో హెన్రీ తర్వాతి స్థానాల్లో భారత మిస్టరీ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి, న్యూజిలాండ్‌ కెప్టెన్‌ మిచెల్‌ సాంట్నర్‌, టీమిండియా పేసర్‌ మహ్మద్‌ షమీ ఉన్నారు. వీరు ముగ్గురు తలో 9 వికెట్లు తీశారు. సాంట్నర్‌ షమీ తలో ఐదు మ్యాచ్‌లు ఆడగా.. వరుణ్‌ కేవలం 3 మ్యాచ్‌ల్లోనే 9 వికెట్లు పడగొట్టాడు. ఈ టోర్నీ టాప్‌-5 లీడింగ్‌ వికెట్‌ టేకర్లు భారత్‌, న్యూజిలాండ్‌ వారే కావడం​ విశేషం.

ఛాంపియన్స్‌ ట్రోఫీ-2025లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు
మ్యాట్‌ హెన్రీ- 10
వరుణ్‌ చక్రవర్తి- 9
మిచెల్‌ సాంట్నర్‌- 9
మహ్మద్‌ షమీ- 9
మైఖేల్‌ బ్రేస్‌వెల్‌- 8
కుల్దీప్‌ యాదవ్‌- 7

ఛాంపియన్స్‌ ట్రోఫీ-2025లో ఐదు వికెట్ల ప్రదర్శనలు
మ్యాట్‌ హెన్రీ- భారత్‌పై
వరుణ్‌ చక్రవర్తి- న్యూజిలాండ్‌పై
మహ్మద్‌ షమీ- బంగ్లాదేశ్‌పై
అజ్మతుల్లా ఒమర్‌జాయ్‌- ఇంగ్లండ్‌పై

ఛాంపియన్స్‌ ట్రోఫీ-2025లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు
రచిన్‌ రవీంద్ర- 263
శ్రేయస్‌ అయ్యర్‌- 243
బెన్‌ డకెట్‌- 227
జో రూట్‌- 225
విరాట్‌ కోహ్లి- 218

ఛాంపియన్స్‌ ట్రోఫీ-2025లో సెంచరీలు చేసిన ఆటగాళ్లు
రచిన్‌ రవీంద్ర-2
బెన్‌ డకెట్‌
జో రూట్‌
విరాట్‌ కోహ్లి
ఇబ్రహీం జద్రాన్‌
టామ్‌ లాథమ్‌
కేన్‌ విలియమ్సన్‌
శుభ్‌మన్‌ గిల్‌
విల్‌ యంగ్‌
ర్యాన్‌ రికెల్టన్‌
జోస్‌ ఇంగ్లిస్‌
డేవిడ్‌ మిల్లర్‌
తౌహిద్‌ హృదయ్‌

ఛాంపియన్స్‌ ట్రోఫీ-2025లో టీమిండియా ఆటగాళ్ల ‍ప్రదర్శనలు
అయ్యర్ - 243 పరుగులు 
కోహ్లి - 218 పరుగులు 
గిల్ - 188 పరుగులు 
రోహిత్ - 180 పరుగులు 
రాహుల్ - 140 పరుగులు 
అక్షర్ - 109 పరుగులు + 5 వికెట్లు 
హార్దిక్ - 99 పరుగులు + 4 వికెట్లు 
జడేజా - 27 పరుగులు + 5 వికెట్లు 
షమీ - 9 వికెట్లు 
వరుణ్ - 9 వికెట్లు 
కుల్దీప్ - 7 వికెట్లు 
హర్షిత్ - 4 వికెట్లు

ఛాంపియన్స్‌ ట్రోఫీ-2025 ఫైనల్‌ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేయగా.. భారత్‌ 49 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

 

 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement