Daryl Mitchell Six Lands Inside Fans Beer Glass - Sakshi
Sakshi News home page

ENG vs NZ: డారిల్ మిచెల్ భారీ సిక్సర్.. అభిమాని బీర్‌ గ్లాస్‌లో పడ్డ బంతి.. వీడియో వైరల్‌!

Published Sat, Jun 11 2022 11:54 AM | Last Updated on Sat, Jun 11 2022 12:55 PM

 Daryl Mitchells six lands inside fans beer glass - Sakshi

ట్రెంట్‌ బ్రిడ్జ్‌ వేదికగా ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌ మధ్య జరుగుతోన్న రెండో టెస్టులో ఓ ఆశ్చర్యకర సంఘటన చోటు చేసుకుంది. న్యూజిలాండ్‌ బ్యాటర్‌ డారిల్‌ మిచిల్‌ కొట్టిన ఓ భారీ సిక్సర్‌కు స్టాండ్స్‌లో ఉన్న ఓ మహిళ చేతిలోని బీర్‌ గ్లాస్‌ పగిలిపోయింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌ 56 ఓవర్‌ వేసిన జాక్ లీచ్ బౌలింగ్‌లో మిచెల్‌ స్ట్రైట్‌గా భారీ సిక్సర్‌ బాదాడు. అయితే బంతి నేరుగా గ్యాలరీలో కూర్చోని మ్యాచ్‌ వీక్షిస్తున్న ఓ అభిమాని బీర్‌ గ్లాస్‌లో పడింది.

దీంతో గ్లాస్‌ పగిలిపోయి బీర్‌ అంతా కిందపడిపోయింది. కాగా బౌండరీ లైన్‌ వద్ద ఫీల్డింగ్‌ చేస్తున్న ఇంగ్లండ్‌ ఆటగాడు మాథ్యూ పాట్స్ తన సహచరులకు ఏమి జరిగిందో సైగలు చేస్తూ చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ సంఘటన గురించి తెలుసుకున్న న్యూజిలాండ్‌ జట్టు ఆ ఆభిమానికి మరో కొత్త బీర్‌ను  అందజేసింది. ఈ విషయాన్ని ఇంగ్లండ్‌ బార్మీ ఆర్మీ ట్విటర్‌లో షేర్‌ చేసింది.
చదవండిT20 WC 2022: 'అతడు టీ20 ప్రపంచకప్‌లో టీమిండియాకు బెస్ట్‌ ఫినిషర్‌ అవుతాడు'

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement