Trent bridge
-
అదేం బ్యాటింగ్ సామీ!.. ఊచకోతే.. రోహిత్ రికార్డు బద్దలు
పరిమిత ఓవర్ల క్రికెట్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ ట్రవిస్ హెడ్. విధ్వంసకర బ్యాటింగ్‌తో బౌలర్లకు చుక్కలు చూపిస్తూ తనకు తానే సాటి అన్నట్లుగా ముందుకు సాగుతున్నాడు. ఇప్పటికే టీ20 ఫార్మాట్లో పవర్ ప్లేలో అత్యధిక స్ట్రయిక్‌రేటుతో అత్యధిక పరుగులు రాబట్టిన క్రికెటర్‌గా కొనసాగుతున్న హెడ్.. వన్డేల్లోనూ హవా కొనసాగిస్తున్నాడు.ఆరోజు టీమిండియాపైటీమిండియాతో వన్డే వరల్డ్‌కప్-2023 ఫైనల్లో ఈ లెఫ్టాండర్ బ్యాటర్ సృష్టించిన పరుగుల సునామీని ఎవరూ అంత తేలికగా మర్చిపోలేరు. నీలిసంద్రమైన అహ్మదాబాద్ స్టేడియంలో.. అశేష టీమిండియా అభిమానుల నడుమ.. 137 పరుగులతో హెడ్ చెలరేగాడు. బౌండరీల వర్షం కురిపిస్తూ చేతికే బ్యాట్ మొలిచిందా అన్నట్లు పరుగుల వరద పారించాడు. 120 బంతుల్లో 15 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో అద్భుత శతకం సాధించి.. రోహిత్ సేనకు పీడకలను మిగిల్చాడు. తాజాగా.. ట్రవిస్ హెడ్ మరోసారి అదే తరహా సునామీ ఇన్నింగ్స్‌తో ప్రేక్షకులను అలరించాడు. అతడి పరుగుల దాహానికి ఇంగ్లండ్ బౌలర్లు బలిఈసారి అతడి పరుగుల దాహానికి ఇంగ్లండ్ బౌలర్లు బలయ్యారు. నాటింగ్‌హామ్‌లోని ట్రెంట్‌బ్రిడ్జ్ వేదికగా గురువారం జరిగిన వన్డేలో హెడ్ పరుగుల సునామీ సృష్టించాడు. 129 బంతులు ఎదుర్కొన్న అతడు ఇంగ్లండ్ బౌలింగ్‌ను చీల్చి చెండాడుతూ.. ఏకంగా 20 ఫోర్లు, 5 సిక్స్‌లు బాదాడు.రికార్డులు సాధించిన హెడ్మొత్తంగా 154 పరుగులతో అజేయంగా నిలిచి ఇంగ్లండ్‌పై ఆస్ట్రేలియాకు విజయాన్ని అందించాడు. ఈ క్రమంలో పలు రికార్డులను ట్రవిస్ హెడ్ తన ఖాతాలో జమచేసుకున్నాడు. ఆస్ట్రేలియా తరఫున ఇంగ్లండ్‌పై వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన రెండో ప్లేయర్‌గా నిలిచాడు. అంతకు ముందు షేన్ వాట్సన్ 2011లో 161 పరుగులతో అజేయంగా నిలిచాడు.ఇక ఆస్ట్రేలియా తరఫున వన్డే ఇన్నింగ్స్‌లో అత్యధిక ఫోర్లు(20) బాదిన మూడో క్రికెటర్‌గానూ హెడ్ మరో రికార్డు సాధించాడు. ఈ జాబితాలో డేవిడ్ వార్నర్(24), గ్లెన్ మాక్స్వెల్(21) హెడ్ కంటే ముందున్నారు. అయితే, ఈ రెండు ఘనతలతో పాటు మరో అరుదైన ఫీట్‌ను కూడా ఈ లెఫ్టాండర్ బ్యాటర్ అందుకున్నాడు. రోహిత్ శర్మ పేరిట ఉన్న రికార్డు బద్దలుట్రెంట్బ్రిడ్జి స్టేడియంలో వన్డే లక్ష్య ఛేదనలో విజయవంతమైన జట్టు తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన క్రికెటర్‌గా హెడ్ చరిత్రకెక్కాడు. తద్వారా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పేరిట ఉన్న రికార్డును బద్దలుకొట్టాడు. 2018లో రోహిత్ ఇదే స్టేడియంలో 114 బంతుల్లో 137 పరుగులు చేసి భారత్‌ను గెలిపించాడు.ఇదిలా ఉంటే.. ఇప్పటికే రోహిత్ శర్మ సృష్టించిన ఓ అరుదైన రికార్డును హెడ్ బ్రేక్ చేసిన విషయం తెలిసిందే. వన్డే ప్రపంచకప్-2023 సందర్భంగా.. న్యూజిలాండ్‌పై హెడ్ 59 బంతుల్లోనే శతకం పూర్తి చేసుకున్నాడు. తద్వారా వన్డే వరల్డ్‌కప్ చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన తొలి ఓపెనర్‌గా హెడ్ నిలిచాడు. అంతకుముందు ఈ రికార్డు రోహిత్ పేరిట ఉండేది.ఇదే ఎడిషన్‌లో అఫ్గనిస్తాన్‌తో మ్యాచ్‌లో రోహిత్ 63 బంతుల్లోనే సెంచరీ మార్కు అందుకున్నాడు. ఇలా రోహిత్ సాధించిన రెండు అరుదైన రికార్డులను బద్దలు కొట్టాడు హెడ్. అత్యంత దురదృష్టవంతుడైన వ్యక్తిఇక వరల్డ్‌కప్ ఫైనల్లో టీమిండియాపై ఆసీస్ విజయం తర్వాత హెడ్ మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అత్యంత దురదృష్టవంతుడైన వ్యక్తి బహుశా రోహితే అయ్యుంటాడని పేర్కొన్న విషయం తెలిసిందే. అద్భుత ఫామ్‌లో ఉన్నా జట్టుకు ట్రోఫీ అందించలేకపోయాడనే ఉద్దేశంతో హెడ్ అలా వ్యాఖ్యానించాడు.చదవండి: Eng Vs Aus: లబుషేన్ ప్రపంచ రికార్డు.. వన్డే చరిత్రలోనే తొలి క్రికెటర్‌గాThe perfect 𝐇𝐄𝐀𝐃 start for the Aussies in the ODI series 💯 🇦🇺#SonySportsNetwork #ENGvAUS #TravisHead | @travishead34 pic.twitter.com/PBItCBhPKE— Sony Sports Network (@SonySportsNetwk) September 20, 2024 -
డారిల్ మిచెల్ భారీ సిక్సర్.. అభిమాని బీర్ గ్లాస్లో పడ్డ బంతి.. వీడియో వైరల్!
ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య జరుగుతోన్న రెండో టెస్టులో ఓ ఆశ్చర్యకర సంఘటన చోటు చేసుకుంది. న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచిల్ కొట్టిన ఓ భారీ సిక్సర్‌కు స్టాండ్స్‌లో ఉన్న ఓ మహిళ చేతిలోని బీర్ గ్లాస్ పగిలిపోయింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 56 ఓవర్ వేసిన జాక్ లీచ్ బౌలింగ్‌లో మిచెల్ స్ట్రైట్‌గా భారీ సిక్సర్ బాదాడు. అయితే బంతి నేరుగా గ్యాలరీలో కూర్చోని మ్యాచ్ వీక్షిస్తున్న ఓ అభిమాని బీర్ గ్లాస్లో పడింది. దీంతో గ్లాస్ పగిలిపోయి బీర్ అంతా కిందపడిపోయింది. కాగా బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న ఇంగ్లండ్ ఆటగాడు మాథ్యూ పాట్స్ తన సహచరులకు ఏమి జరిగిందో సైగలు చేస్తూ చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ సంఘటన గురించి తెలుసుకున్న న్యూజిలాండ్ జట్టు ఆ ఆభిమానికి మరో కొత్త బీర్‌ను అందజేసింది. ఈ విషయాన్ని ఇంగ్లండ్ బార్మీ ఆర్మీ ట్విటర్లో షేర్ చేసింది. చదవండి: T20 WC 2022: 'అతడు టీ20 ప్రపంచకప్‌లో టీమిండియాకు బెస్ట్ ఫినిషర్ అవుతాడు' What a shot from Daryl Mitchell - hopefully he'll get the guy another pint...#ENGvsNZ pic.twitter.com/uDm7cu3RrN — Ian McDougall (@IanMcDougall1) June 10, 2022 Susan - the lady earlier who Daryl Mitchell’s pint hit - has been given a replacement by the Kiwi team 👏👏👏#ENGvNZ pic.twitter.com/53ig2R5cML — England’s Barmy Army (@TheBarmyArmy) June 10, 2022 -
IND Vs ENG: 40 ఏళ్లుగా ఒక్క మ్యాచ్ మిస్ కాలేదు; స్నేహితుని గుర్తుగా
నాటింగ్హమ్: భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో తొలిరోజే ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. అయితే అది ఆటలో అనుకుంటే పొరపాటే. విషయంలోకి వెళితే.. భారత్, ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌కు ప్రేక్షకులను అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. మ్యాచ్ జరగుతున్న సమయంలో కెమెరాను స్టాండ్స్‌లోకి తిప్పగా .. ఒక వరుసలో కొంతమంది కూర్చొని ఉన్నారు. అయితే ఆ బృందంలో ఒక సీటును మాత్రం ఖాళీగా ఉంచారు. అదేంటా అని ఆరా తీస్తే ఒక విషాదకర విషయం తెలిసింది. జాన్ క్లార్క్ అనే వ్యక్తి ట్రెంట్‌బ్రిడ్జ్ మైదానంలో జరిగే ప్రతీ మ్యాచ్‌కు హజరయ్యేవాడు. గత 40 ఏళ్లలో జాన్ ఏనాడు మ్యాచ్‌ను మిస్ కాలేదు. అయితే నేడు ఇంగ్లండ్, భారత్ మధ్య జరుగుతున్న తొలి టెస్టుకు జాన్ క్లార్క్ రాలేదు.. కారణం.. కొంతకాలం కిందట ఆయన చనిపోయారు. అయితే ట్రెంట్‌బిడ్జ్ మైదానంతో జాన్‌కున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్న అతని మిత్రులు ఒక గొప్ప ఆలోచనతో అతన్ని గౌరవించుకున్నారు. బౌతికంగా జాన్ క్లార్క్ లేకపోయినా అతని కోసం ఒక టికెట్‌ను కొనడమే గాక.. అతని సీటును ఖాళీగా ఉంచి తమ స్నేహ బందాన్ని గొప్పగా చాటుకుంది ఆ మిత్రుల బృందం. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. పరుగలు ఖాతా తెరవకుండానే ఓపెనర్ రోరీ బర్న్స్ బుమ్రా బౌలింగ్‌లో డకౌట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత సిబ్లీ, జాక క్రాలీలు ఇన్నింగ్స్‌ను నడిపించే ప్రయత్నం చేశారు. అయితే జట్టు స్కోరు 45 పరుగుల వద్ద ఉన్నప్పుడు 27 పరుగులు చేసిన క్రాలీ సిరాజ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. లంచ్ విరామం అనంతరం 2 వికెట్ల నష్టానికి 66 పరుగులతో ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్‌ను ఈసారి షమీ దెబ్బతీశాడు. 18 పరుగులు చేసిన సిబ్లీ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం 47 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. కెప్టెన్ జో రూట్ 45, జానీ బెయిర్ స్టో 26 పరుగులతో క్రీజులో ఉన్నారు. -
ట్రెంట్ బ్రిడ్జ్ పిచ్ నాసిరకం
తేల్చిన మ్యాచ్ రిఫరీ బూన్ దుబాయ్: భారత్, ఇంగ్లండ్‌ల మధ్య తొలి టెస్టుకు ఆతిథ్యమిచ్చిన ట్రెంట్ బ్రిడ్జ్ పిచ్ నాసిరకమైనదని ఐసీసీ మ్యాచ్ రిఫరీ డేవిడ్ బూన్ తేల్చారు. పూర్తి స్థాయి విచారణ తర్వాత ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ)పై జరిమానా విధించే అవకాశాలున్నాయి. ఐసీసీ పిచ్ నియమావళిలోని క్లాజ్-3 ప్రకారం పిచ్‌ను పరిశీలించిన బూన్.. తన నివేదికను ఐసీసీకి అందజేశారు. దీన్ని ఈసీబీకి పంపి 14 రోజుల్లో స్పందనను తెలియజేయాలని క్రికెట్ మండలి కోరింది. ఈసీబీ నివేదిక తర్వాత ఐసీసీ జనరల్ మేనేజర్ క్రికెట్ జెఫ్ అల్లార్డిక్, చీఫ్ మ్యాచ్ రిఫరీ రంజన్ మదుగలేలు మరోసారి వీడియో ఫుటేజ్‌లను పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటారు. మరోవైపు భారత్‌కు సరిపోయే విధంగా వికెట్‌ను తయారు చేసినందుకు నాటింగ్‌హామ్ చీఫ్ గ్రౌండ్స్‌మన్ స్టీవ్ బ్రిక్స్ క్షమాపణలు చెప్పారు. -
బౌలర్లు రాణించినా... ‘రూట్’ దొరకలేదు
-
బౌలర్లు రాణించినా... ‘రూట్’ దొరకలేదు
తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 352/9 భువనేశ్వర్‌కు 4, ఇషాంత్‌కు 3 వికెట్లు భారత టెయిలెండర్లను చూసి ఇంగ్లండ్ కూడా స్ఫూర్తి పొందింది. మిడిలార్డర్ తడబడినా... చివరి వరుస బ్యాట్స్‌మెన్ తలా కొన్ని పరుగులు జత చేయడంతో తొలి టెస్టులో ఇంగ్లండ్ పుంజుకుంది. ఓ ఎండ్‌లో రూట్ గోడలా నిలబడటంతో... భారత పేసర్లు రాణించినా పెద్దగా ప్రయోజనం లేకపోయింది. నాటింగ్‌హామ్: నిర్జీవమైన పిచ్‌పై భారత బౌలర్లు రాణించినా... ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ జోయ్ రూట్ (158 బంతుల్లో 78 బ్యాటింగ్; 8 ఫోర్లు) మాత్రం కొరకరాని కొయ్యగా మారాడు. మూడో రోజే ఇంగ్లండ్‌ను ఆలౌట్ చేద్దామనుకున్న టీమిండియా ఆశలపై నీళ్లు చల్లాడు. మూడు కీలక భాగస్వామ్యాలు నమోదు చేసి ఆతిథ్య జట్టు కోలుకునేలా చేశాడు. ఫలితంగా ట్రెంట్ బ్రిడ్జ్ మైదానంలో జరుగుతున్న తొలి టెస్టులో... శుక్రవారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 106 ఓవర్లలో 9 వికెట్లకు 352 పరుగులు చేసింది. రూట్‌తో పాటు అండర్సన్ (23 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. వీరిద్దరు పదో వికెట్‌కు అజేయంగా 54 పరుగులు జోడించారు. ప్రస్తుతం కుక్‌సేన ఇంకా 105 పరుగులు వెనుకబడి ఉంది. భువనేశ్వర్ 4, ఇషాంత్ 3, షమీ 2 వికెట్లు తీశారు. అంతకుముందు 43/1 ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు ఆట కొనసాగించిన ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ రాబ్సన్ (142 బంతుల్లో 59; 8 ఫోర్లు), బాలెన్సీ (167 బంతుల్లో 71; 9 ఫోర్లు) లంచ్ వరకు 88 పరుగులు జోడించారు. ఇషాంత్ జోరు... ఓ దశలో 134/1 స్కోరుతో పటిష్ట స్థితిలో ఉన్న ఇంగ్లండ్‌ను లంచ్ తర్వాత ఇషాంత్.. రాబ్సన్, బాలెన్సీని ఎల్బీగా వెనక్కి పంపాడు. వీరిద్దరు రెండో వికెట్‌కు 125 పరుగులు జోడించారు. తర్వాత బెల్ (25), రూట్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేసినా ఇన్నింగ్స్ 60వ ఓవర్లో మళ్లీ ఇషాంతే విడదీశాడు. ఓ చక్కని షార్ట్ బంతితో బెల్‌ను అవుట్ చేసి ఈ సెషన్లో మూడో వికెట్ చేజిక్కించుకున్నాడు. అలీ (14), ప్రయర్ (5), స్టోక్స్ (0) వెంటవెంటనే అవుట్ కావడంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ తడబడింది. ఈ సెషన్లో కుక్‌సేన 74 పరుగులు జోడించి 6 వికెట్లు చేజార్చుకుంది. టీ తర్వాత బ్రాడ్ సాయంతో రూట్ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. 8వ వికెట్‌కు 78 పరుగులు జోడించిన తర్వాత బ్రాడ్‌ను భువనేశ్వర్ అవుట్ చేశాడు. ఆ వెంటనే ప్లంకెట్ (7) కూడా వెనుదిరగడంతో ఇంగ్లండ్ 298 పరుగులకు 9 వికెట్లు కోల్పోయింది. చివర్లో అండర్సన్ బ్యాట్ అడ్డేశాడు. రూట్‌కు చక్కని సహకారం అందిస్తూ జాగ్రత్తగా రోజు ముగించాడు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 457 ఆలౌట్ ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: కుక్ (బి) షమీ 5; రాబ్సన్ ఎల్బీడబ్ల్యు (బి) ఇషాంత్ 59; బాలెన్సీ ఎల్బీడబ్ల్యు (బి) ఇషాంత్ 71; బెల్ (సి) ధోని (బి) ఇషాంత్ 25; రూట్ 78 బ్యాటింగ్; అలీ (సి) ధావన్ (బి) షమీ 14; ప్రయర్ (సి) ధోని (బి) భువనేశ్వర్ 5; స్టోక్స్ (సి) ధోని (బి) భువనేశ్వర్ 0; బ్రాడ్ ఎల్బీడబ్ల్యు (బి) భువనేశ్వర్ 47; ప్లంకెట్ (బి) భువనేశ్వర్ 7; అండర్సన్ 23 బ్యాటింగ్; ఎక్స్‌ట్రాలు: 18; మొత్తం: (106 ఓవర్లలో 9 వికెట్లకు) 352. వికెట్ల పతనం: 1-9; 2-134; 3-154; 4-172; 5-197; 6-202; 7-202; 8-280; 9-298 బౌలింగ్: భువనేశ్వర్ 25-8-61-4; షమీ 24-3-98-2; ఇషాంత్ 27-3-109-3; జడేజా 24-4-56-0; బిన్నీ 6-0-22-0. -
విజయ్ 122, ధోని 50, భారత్ 259/4
నాటింగహమ్: పటౌడీ ట్రోఫిలో భాగంగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న తొలి టెస్ట్ లో మురళీ విజయ్ రాణించడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు 4 వికెట్లు కోల్పోయి 259 పరుగులు చేసింది. సెంచరీతో ఆకట్టుకున్న భారత ఓపెనర్ మురళీ విజయ్ 122 పరుగులతో, కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని 50 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత జట్టు లో ధావన్ 12, పుజారా 38, కోహ్లీ 1, రహానే 32 పరుగులు చేసి అవుటయ్యారు. ఇంగ్లాండ్ బౌలర్లలో అండర్సన్ కు 2 వికెట్లు, బ్రాడ్, ప్లంకెట్ కు చెరో వికెట్ దక్కింది. నాటింగహమ్, ట్రెంట్ బ్రిడ్జ్ లో జరుగుతున్న తొలి టెస్ట్ లో భారత జట్టు టాస్ గెలిచి బ్యాంటింగ్ ఎంచుకుంది. -
మురళీ విజయ్ సెంచరీ, భారత్ 211/4
నాటింగహమ్: పటౌడీ ట్రోఫిలో భాగంగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న తొలి టెస్ట్ లో మురళీ విజయ్ రాణించడంతో భారత జట్టు 4 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. భారత ఓపెనర్ మురళీ విజయ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. డ్రింక్స్ సమయానికి మురళీ విజయ్ 102, ధోని 23 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత జట్టు లో ధావన్ 12, పుజారా 38, కోహ్లీ 1, రహానే 32 పరుగులు చేసి అవుటయ్యారు. ఇంగ్లాండ్ బౌలర్లలో అండర్సన్ కు 2 వికెట్లు, బ్రాడ్, ప్లంకెట్ కు చెరో వికెట్ దక్కింది. నాటింగహమ్, ట్రెంట్ బ్రిడ్జ్ లో జరుగుతున్న తొలి టెస్ట్ లో భారత జట్టు టాస్ గెలిచి బ్యాంటింగ్ ఎంచుకుంది.