విజయ్ 122, ధోని 50, భారత్ 259/4
నాటింగహమ్: పటౌడీ ట్రోఫిలో భాగంగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న తొలి టెస్ట్ లో మురళీ విజయ్ రాణించడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు 4 వికెట్లు కోల్పోయి 259 పరుగులు చేసింది. సెంచరీతో ఆకట్టుకున్న భారత ఓపెనర్ మురళీ విజయ్ 122 పరుగులతో, కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని 50 పరుగులతో క్రీజులో ఉన్నారు.
భారత జట్టు లో ధావన్ 12, పుజారా 38, కోహ్లీ 1, రహానే 32 పరుగులు చేసి అవుటయ్యారు. ఇంగ్లాండ్ బౌలర్లలో అండర్సన్ కు 2 వికెట్లు, బ్రాడ్, ప్లంకెట్ కు చెరో వికెట్ దక్కింది. నాటింగహమ్, ట్రెంట్ బ్రిడ్జ్ లో జరుగుతున్న తొలి టెస్ట్ లో భారత జట్టు టాస్ గెలిచి బ్యాంటింగ్ ఎంచుకుంది.