చెన్నై సూపర్ కింగ్స్‌పై ఆ జట్టు హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ప్రభావం భారీగా ఉన్నట్లు ఇవాళ జరిగిన ఐపీఎల్ వేలం తర్వాత స్పష్టంగా తెలుస్తుంది. న్యూజిలాండ్ మాజీ కెప్టెన్, కోచ్ అయిన ఫ్లెమింగ్ సీఎస్‌కే కోచింగ్ బాధ్యతలు చేపట్టాక ఆ జట్టుపై తన మార్కు ప్రభావం చూపిస్తున్నాడు.
ఇప్పటికే డెవాన్ కాన్వే (కోటి), మిచెల్ సాంట్నర్ (1.9 కోట్లు) లాంటి కివీస్ ఆటగాళ్లను పంచన చేర్చుకున్న ఫ్లెమింగ్.. ఇవాళ జరిగిన వేలంలో మరో ఇద్దరు కివీస్ ఆటగాళ్లను జట్టులో చేర్చుకుని సీఎస్‌కేపై బ్లాక్ క్యాప్స్ మార్కు స్పష్టంగా కనిపించేలా చేశాడు.
ఇవాళ జరిగిన వేలంలో సీఎస్‌కే మేనేజ్‌మెంట్ డారిల్ మిచెల్‌ను 14 కోట్ల రికార్డు ధరకు కొనుగోలు చేయగా.. వన్డే వరల్డ్‌కప్ హీరో రచిన్ రవీంద్రను 1.8 కోట్లకు సొంతం చేసుకుంది. ఈ ఇద్దరితో పాటు సీఎస్‌కే ఇవాల్టి వేలంలో మరో భారీ కొనుగోలు చేసింది. ఆ జట్టు యాజమాన్యం శార్దూల్ ఠాకూర్‌ను 4 కోట్లకు సొంతం చేసుకుంది.
చెన్నై సూపర్ కింగ్స్: ఎంఎస్ ధోని (కెప్టెన్), మొయిన్ అలీ, దీపక్ చాహర్, డెవాన్ కాన్వే, తుషార్ దేశ్‌పాండే, శివమ్ దూబే, రుతురాజ్ గైక్వాడ్, రాజవర్ధన్ హంగర్గేకర్, రవీంద్ర జడేజా, అజయ్ మండల్, ముఖేష్ చౌదరి, మతీషా పతిరణ, అజింక్య రహానే, షేక్ రషీద్, మిచెల్ సాంట్నర్, సిమర్జీత్ సింగ్, నిశాంత్ సింధు, ప్రశాంత్ సోలంకి, మహేశ్ తీక్షణ
ఐపీఎల్ 2024 వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు: డారిల్ మిచెల్ (14 కోట్లు), రచిన రవీంద్ర (1.8 కోట్లు), శార్దూల్ ఠాకూర్ (4 కోట్లు)
Comments
Please login to add a commentAdd a comment