న్యూజిలాండ్‌ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాడికి చోటు | New Zealand Announce Squads For White-Ball Series Against Sri Lanka | Sakshi
Sakshi News home page

NZ vs SL: న్యూజిలాండ్‌ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాడికి చోటు

Published Mon, Dec 23 2024 3:22 PM | Last Updated on Mon, Dec 23 2024 3:44 PM

New Zealand Announce Squads For White-Ball Series Against Sri Lanka

స్వదేశంలో శ్రీలంకతో జరగనున్న వన్డే, టీ20 సిరీస్‌లకు తమ జట్టును న్యూజిలాండ్ క్రికెట్ ప్రకటించింది.  ఈ సిరీస్‌లకు రెండు వేర్వేరు జట్లను కివీస్ సెలక్టర్లు ఎంపిక చేశారు. ఐపీఎల్‌-2025 మెగా వేలంలో ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసిన బెవాన్‌ జాకబ్స్‌కు ఈ జట్టులో చోటు దక్కింది.

న్యూజిలాండ్ దేశీవాళీ క్రికెట్‌లో జాకబ్స్ గత కొంత కాలంగా అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఈ క్రమంలోనే బ్యాక్‌క్యాప్స్ సెలక్టర్లు అతడికి ఛాన్స్ ఇచ్చారు.ఈ రెండు సిరీస్‌లలో న్యూజిలాండ్ కెప్టెన్‌గా మిచెల్ శాంట్నర్ వ్యవహరించనున్నాడు. 

ఇటీవలే తమ వైట్ బాల్ జట్టు ఫుల్‌టైమ్ కెప్టెన్ శాంట్నర్‌ను కివీ క్రికెట్ బోర్డు నియమించింది. ఇక ఈ సిరీస్‌లకు కోసం న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్లు రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, మాట్ హెన్రీ తిరిగి జట్టులోకి వచ్చారు. ఈ ముగ్గురు గత నెలలో శ్రీలంకతో వైట్‌బాల్‌ సిరీస్‌లకు దూరమయ్యారు. మళ్లీ ఇప్పుడు అదే జట్టుపై పునరగామనం చేయననున్నారు. ఈ వైట్‌బాల్‌ సిరీస్‌లలో భాగంగా పర్యాటక శ్రీలంకతో న్యూజిలాండ్‌ మూడు టీ20లు ,మూడు వన్డేలు ఆడనుంది.

టీ20 జట్టు: మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), మైఖేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్‌మన్, జాకబ్ డఫీ, జాక్ ఫౌల్క్స్, మిచ్ హే, మాట్ హెన్రీ, బెవాన్ జాకబ్స్, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, టిమ్ రాబిన్సన్, నాథన్ స్మిత్

వన్డే జట్టు: మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), మైకేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్‌మన్, జాకబ్ డఫీ, మిచ్ హే, మాట్ హెన్రీ, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, విల్ ఓ'రూర్క్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, నాథన్ స్మిత్, విల్ యంగ్
చదవండి: సర్ఫరాజ్‌ కెప్టెన్సీలో కోహ్లి.. గెలిచింది మాత్రం వాళ్లే!.. వీడియో

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement