
గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ అదరగొడుతోంది. రెండో రోజు ఆటముగిసే సమయానికి కివీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. ప్రస్తుతం న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో లంక కంటే ఇంకా 50 పరుగులు వెనకంజలో ఉంది.
క్రీజులో డార్లీ మిచెల్(41), బ్లాండెల్(18) పరుగులతో ఉన్నారు. కివీస్ బ్యాటర్లలో ఓపెనర్ టామ్ లాథమ్(70), కేన్ విలియమ్స్(55) హాఫ్ సెంచరీలతో రాణించారు. శ్రీలంక బౌలర్లలో దనుంజయ డి సిల్వా 2 వికెట్లు పడగొట్టగా.. మెండిస్, జయసూర్య తలా వికెట్ సాధించారు. ఇక అంతకుముందు ఓవర్‌నైట్ స్కోర్ 302/7 వద్ద రెండో రోజు ఆటను ప్రారంభించిన శ్రీలంక.. మరో మూడు పరుగులు మాత్రమే జోడించి 305 పరుగులకు ఆలౌటైంది.
లంక తొలి ఇన్నింగ్స్‌లో కమిందు మెండిస్ (114) అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. బ్లాక్ క్యాప్స్ బౌలర్లలో విలియమ్ ఓరూర్కీ 5 వికెట్లు పడగొట్టగా.. అజాజ్ పటేల్, గ్లెన్ ఫిలిప్స్ తలో రెండు, సౌథీ ఓ వికెట్ పడగొట్టారు.
చదవండి: IND vs BAN: చెపాక్‌లో చితక్కొట్టుడు.. అశ్విన్ సూపర్ సెంచరీ
Comments
Please login to add a commentAdd a comment