
PC: BCCI/IPL.com
ఐపీఎల్-2025ను చెన్నై సూపర్ కింగ్స్ అద్బుతమైన విజయంతో ఆరంభించింది. చెపాక్ వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. 156 పరుగుల లక్ష్యాన్ని సీఎస్‌కే 6 వికెట్లు కోల్పోయి 19.1 ఓవర్లలో చేధించింది. చెన్నై బ్యాటర్లలో రచిన్ రవీంద్ర(65 నాటౌట్), రుతురాజ్ గైక్వాడ్(53) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఓ దశలో వరుస క్రమంలో వికెట్లు కోల్పోయినప్పటికి.. రవీంద్ర మాత్రం ఆచితూచి ఆడుతూ మ్యాచ్‌ను ముగించాడు.
ముంబై బౌలర్లలో విఘ్నేష్ మూడు వికెట్లు పడగొట్టగా.. దీపక్ చాహర్, జాక్స్ తలా వికెట్ సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. ముంబై బ్యాటర్లలో తిలక్ వర్మ(31) టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఆఖరిలో దీపక్ చాహర్(28) కీలక ఇన్నింగ్స్ ఆడారు. రోహిత్ శర్మ(0) ఈ మ్యాచ్‌లో నిరాశపరిచాడు. ఇక సీఎస్‌కే బౌలర్లలో నూర్ అహ్మద్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. ఖాలీల్ అహ్మద్ మూడు వికెట్లు సాధించాడు.
చదవండి: IPL 2025: వారెవ్వా ధోని.. కేవలం 0.12 సెకన్లలోనే! వీడియో వైరల్