రాంచీ వేదికగా టీమిండియాతో జరుగుతున్న తొలి టి20లో న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. డారిల్ మిచెల్(30 బంతుల్లో 59,3 ఫోర్లు, 5 సిక్సర్లు) ఆఖర్లో మెరుపులు మెరిపించగా.. కాన్వే(52 పరుగులు) రాణించాడు. టీమిండియా బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ 2 వికెట్లు పడగొట్టగా.. అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, శివమ్ మావిలు తలా ఒక వికెట్ తీశారు.
అయితే ఆరంభంలో టీమిండియా బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేయడంతో కివీస్ బ్యాటర్లు పరుగులు రాబట్టలేకపోయారు. అయితే 10 ఓవర్లు ముగిసిన తర్వాత న్యూజిలాండ్ బ్యాటింగ్ గాడిలో పడింది. కాన్వే అర్థశతకంతో రాణించగా.. అతనికి అండగా గ్లెన్ పిలిప్స్(17) నిలిచాడు. ఇక ఇన్నింగ్స్ చివరి ఓవర్ అర్ష్‌దీప్ వేయగా.. డారిల్ మిచెల్ 27 పరుగులు పిండుకున్నాడు. ఓవర్‌లో మూడు సిక్సర్లు, ఒక ఫోర్ వచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment