వన్డే వరల్డ్‌కప్-2023లో భారీ సిక్సర్ నమోదైంది. వాంఖడే వేదికగా టీమిండియాతో సెమీఫైనల్లో న్యూజిలాండ్ ఆటగాడు డార్లీ మిచెల్ ఓ భారీ సిక్సర్ కొట్టాడు. కివీస్ ఇన్నింగ్స్ 27 ఓవర్‌లో జడేజా వేసిన ఐదో బంతిని లాంగాన్ మీదగా భారీ సిక్సర్ బాదాడు. అతను కొట్టిన షాట్‌కి బంతి 107 మీటర్ల దూరం వెళ్లింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఇప్పటివరకు ఈ రికార్డు టీమిండియా ఆటగాడు శ్రేయస్ అయ్యర్ పేరిట ఉండేది.
ఈ టోర్నీలో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో అయ్యర్ 106 మీటర్ల సిక్స్ కొట్టాడు. తాజా మ్యాచ్‌తో శ్రేయస్ రికార్డును మిచెల్ బ్రేక్ చేశాడు. అదే విధంగా మరో అరుదైన రికార్డును కూడా మిచెల్ తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డే వరల్డ్‌కప్ సింగిల్ ఎడిషన్‌లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన న్యూజిలాండ్ ఆటగాడిగా మిచెల్ నిలిచాడు. మిచెల్ ఈ ఏడాది వరల్డ్‌కప్‌లో 18 సిక్స్‌లు కొట్టాడు. అంతకు ఈ రికార్డు కివీస్ మాజీ కెప్టెన్ బ్రాండెన్ మెకెల్లమ్(17) పేరిట ఉండేది.
చదవండి: CWC 2023: హృదయాన్ని తాకావు.. నా రికార్డు బ్రేక్ చేయడం సంతోషం: సచిన్ ట్వీట్ వైరల్
Comments
Please login to add a commentAdd a comment