దక్షిణాఫ్రికాతో రెండో టెస్టుకు ముందు న్యూజిలాండ్‌కు ఊహించని షాక్ తగిలింది. స్టార్ ఆల్‌రౌండర్ డార్లీ మిచెల్ గాయం కారణంగా సఫారీలతో రెండో టెస్టుకు దూరమయ్యాడు. ప్రాక్టీస్ సెషన్‌లో మిచెల్ కాలి బొటన వేలికి గాయమైంది. అయితే అతడి గాయం తీవ్రమైనది కావడంతో రెండో టెస్టుకు జట్టు మేనెజ్‌మెంట్ విశ్రాంతి ఇచ్చింది. ఈ క్రమంలో అతడి స్ధానాన్ని బౌలింగ్ ఆల్‌రౌండర్ విల్ ఓ'రూర్క్‌తో న్యూజిలాండ్ క్రికెట్ భర్తీ చేసింది.
కాగా మిచెల్ తన గాయం నుంచి కోలుకోవడానికి దాదాపు నాలుగు వారాల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో స్వదేశంలో ఆసీస్‌తో జరిగే టీ20 సిరీస్‌కు కూడా మిచెల్ దూరమయ్యే ఛాన్స్ ఉంది. ఇక ఇదే విషయంపై బ్లాక్ క్యాప్స్ హెడ్‌కోచ్ గ్యారీ స్టీడ్ మాట్లాడుతూ.. మిచెల్ మూడు ఫార్మాట్లలో మా జట్టు కీలక ఆటగాడు. అతడు గాయం పడటం మా దురదృష్టం.
అయితే రాబోయే సిరీస్‌లను దృష్టిలో పెట్టుకుని అతడిని రిహాబిలిటేషన్‌కు పంపించాం. తర్వాతి మ్యాచులకు అతడు పూర్తిగా కోలుకుంటాడని ఆశిస్తున్నామని పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్‌కు ముందు మిచెల్ గాయం చెన్నై సూపర్ కింగ్స్‌ను ఆందోళన కలిగిస్తోంది. గతేడాది జరిగిన ఐపీఎల్ మినీ వేలంలో మిచెల్‌ను రూ. 14 కోట్లకు సీఎస్‌కే కొనుగోలు చేసింది. అయితే ఐపీఎల్ సమయానికి మిచెల్ కోలుకునే ఛాన్స్ ఉంది.
చదవండి: SA20 2024: హెన్రిస్ క్లాసెన్ విధ్వంసం.. కేవలం 30 బంత్లులో! వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment