డారిల్‌ మిచెల్‌ ఫిప్టీ; అప్పుడు గెలిపించాడు.. మరి ఇప్పుడు! | Daryl Mitchell 2nd Half Century T20 WC Semi-Finals Might Help NZ Win | Sakshi
Sakshi News home page

Daryl Mitchell: డారిల్‌ మిచెల్‌ ఫిప్టీ; అప్పుడు గెలిపించాడు.. మరి ఇప్పుడు!

Published Wed, Nov 9 2022 3:45 PM | Last Updated on Wed, Nov 9 2022 3:52 PM

Daryl Mitchell 2nd Half Century T20 WC Semi-Finals Might Help NZ Win  - Sakshi

టి20 ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో సెమీఫైనల్‌ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ బ్యాటర్‌ డారిల్‌ మిచెల్‌ అర్థశతకంతో మెరిశాడు. డారిల్‌ మిచెల్‌ అర్థశతకంతో మెరిశాడు అంటే న్యూజిలాండ్‌​ కచ్చితంగా ఫైనల్‌ వెళుతుంది అని అభిమానులు పేర్కొంటున్నారు. మిచెల్‌ సెమీస్‌లో అర్థసెంచరీ వెనుక ఒక చిన్న కథ దాగుంది.

అదేంటంటే గతేడాది జరిగిన టి20 ప్రపంచకప్‌లోనూ ఇంగ్లండ్‌తో ఆడిన సెమీఫైనల్లో డారిల్‌ మిచెల్‌ అర్థశతకంతో మెరిశాడు. ఆ మ్యాచ్‌లో 72 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన మిచెల్‌ కివీస్‌ను దగ్గరుండి గెలిపించాడు. దీంతో కివీస్‌ ఫైనల్లో అడుగుపెట్టింది. ఇప్పుడు కూడా మిచెల్‌ అర్థసెంచరీ చేశాడు. దీంతో అదే సెంటిమెంట్‌ రిపీట్‌ అవుతుందని కొందరు ఫ్యాన్స్‌ పేర్కొన్నారు. 

ఈ విషయం పక్కనబెడితే.. డారిల్‌ మిచెల్‌ మాత్రం టి20 ప్రపంచకప్‌లో ఒక అరుదైన రికార్డు అందుకున్నాడు. టి20 ప్రపంచకప్‌ సెమీఫైనల్స్‌లో రెండు అర్థసెంచరీలు సాధించిన మూడో బ్యాటర్‌గా మిచెల్‌ నిలిచాడు. గతేడాది టి20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌పై 72 పరుగులు నాటౌట్‌.. తాజా వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్‌తో సెమీస్‌లో 53 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఇంతకముందు టీమిండియా నుంచి విరాట్‌ కోహ్లి 2014లో సౌతాఫ్రికాతో జరిగిన సెమీస్‌లో 72 నాటౌట్‌, ఆ తర్వాత 2016 టి20 వరల్డ్‌కప్‌లో వెస్టిండీస్‌పై 89 నాటౌట్‌ చేశాడు. ఇక క్రిస్‌ గేల్‌ 2009లో శ్రీలంకతో సెమీస్‌లో 63 నాటౌట్‌, 2012లో ఆస్ట్రేలియాపై 75 నాటౌట్‌ రెండు అర్థసెంచరీలు సాధించాడు.

చదవండి: ఐదు మ్యాచ్‌లుగా ఒక్క వికెట్‌ లేదు.. ఒక్క రనౌట్‌తో

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement