ఫామ్ కోల్పోయి నానా తంటాలు పడుతున్న పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం టి20 ప్రపంచకప్‌లో తొలిసారి మెరిశాడు. కీలకమైన సెమీస్ పోరులో బాబర్ అర్థసెంచరీతో రాణించాడు. ఈ ప్రపంచకప్‌లో బాబర్ తాను ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో వరుసగా 0, 4, 4, 6, 25 పరుగులు చేశాడు. అలాంటి బాబర్ చేత ఫిఫ్టీ కొట్టించిన ఘనత న్యూజిలాండ్‌కే దక్కుతుంది. ఓవరాల్‌గా 42 బంతుల్లో ఏడు ఫోర్ల సాయంతో 53 పరుగులు చేసి ఔటయ్యాడు. కీలకమైన ఫైనల్ మ్యాచ్‌కు ముందు బాబర్ ఆజం ఫామ్‌లోకి రావడం ఆ జట్టుకు పెద్ద బలం అని చెప్పొచ్చు.
ఇక న్యూజిలాండ్‌కు బ్లాక్‌క్యాప్స్ అనే ముద్ర ఊరికే రాలేదన్న అంశాన్ని తాజా మ్యాచ్‌తో మరోసారి నిరూపించారు. లీగ్ దశలో టాప్ ప్రదర్శన కనబరిచే కివీస్‌ది మళ్లీ అదే పాత కథ. నాకౌట్ మ్యాచ్‌ల్లో చతికిలపడుతుందనే అపవాదును న్యూజిలాండ్ మరోసారి నిజం చేసింది. తాజాగా బుధవారం పాకిస్తాన్‌తో జరుగుతున్న సెమీఫైనల్లో న్యూజిలాండ్ నిరాశజనక ఆటతీరును ప్రదర్శించింది.
బ్యాటింగ్‌లో ఓ మెస్తరు స్కోరు సాధించిన కివీస్.. బౌలింగ్‌లో మాత్రం పూర్తిగా తేలిపోయింది. పాక్ ఓపెనర్లు బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్‌లు కివీస్ బౌలర్లను ఒక ఆట ఆడుకున్నారు. ఇద్దరి మధ్య వంద పరుగుల భాగస్వామ్యం నమోదు కావడంతో ఇద్దరే మ్యాచ్ గెలిపిస్తారా అన్న సందేహం కూడా కలింగింది. అయితే బాబర్ 53 పరుగులు చేసి ఔటైనప్పటికి అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
చదవండి: డారిల్ మిచెల్ ఫిప్టీ; అప్పుడు గెలిపించాడు.. మరి ఇప్పుడు!
Comments
Please login to add a commentAdd a comment