టి20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్ మూడోసారి ఫైనల్లో అడుగుపెట్టింది. తాజాగా బుధవారం న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో పాక్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లో సమిష్టిగా రాణించి ఫైనల్‌కు చేరుకున్న పాకిస్తాన్ రెండోసారి టైటిల్ కొట్టాలనే దృడ సంకల్పంతో ఉంది. ఇక ఫైనల్‌కు చేరుకున్న పాకిస్తాన్ పలు రికార్డులను బద్దలు కొట్టింది. అవేంటో ఒకసారి పరిశీలిద్దాం.
► టి20 క్రికెట్‌లో ఒకే జట్టుపై అత్యధిక విజయాలు సాధించిన జాబితాలో పాకిస్తాన్ అగ్రస్థానం దక్కించుకుంది. ఇప్పటివరకు కివీస్‌ను పాకిస్తాన్ 18 సార్లు(తాజా మ్యాచ్‌తో కలిపి) ఓడించింది. ఆ తర్వాత వరుసగా ఇండియా వెస్టిండీస్‌ను 17సార్లు, ఇండియా శ్రీలంకను 17 సార్లు, ఇంగ్లండ్ పాకిస్తాన్‌ను 17సార్లు మట్టికరిపించాయి.
► 2009 నుంచి టి20 వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్‌కు సెమీఫైనల్లో ఇదే తొలి విజయం. ఓవరాల్‌గా మూడోసారి(ఇంతకముందు 2007, 2009) కాగా.. 13 ఏళ్ల తర్వాత పాకిస్తాన్ మళ్లీ ఫైనల్లో అడుగుపెట్టడం విశేషం.
► ఐసీసీ వరల్డ్‌కప్ టోర్నీల్లో న్యూజిలాండ్‌ను పాకిస్తాన్ సెమీస్‌లో ఓడించడం ఇది నాలుగోసారి. ఇంతకముందు 1992, 1999 వన్డే వరల్డ్‌కప్‌లతో పాటు 2007, 2022 టి20 ప్రపంచకప్‌లలోనూ కివీస్‌ను సెమీస్‌లో ఓడించింది.
► 2021 వరల్డ్‌కప్ తర్వాత ఆడిన టి20 మ్యాచ్‌ల్లో సౌథీ వికెట్ తీయకపోవడం ఇది రెండో సారి మాత్రమే.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి కివీస్ 152 పరుగులు చేసింది. డారిల్ మిచెల్ హాఫ్ సెంచరీ చేయగా.. కేన్ విలియమ్సన్ 46 పరుగులు చేశాడు. లక్ష్య ఛేదనకు దిగిన పాకిస్తాన్ 19.1 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను అందుకుంది. పాక్‌కు ఓపెనర్లు మహ్మద్ రిజ్వాన్, బాబర్ ఆజం అదిరిపోయే ఆరంభం అందించారు. బాబర్ ఆజం 42 బంతుల్లో 7 ఫోర్ల సాయంతో 53 పరుగులు చేశాడు. ఇక రిజ్వాన్ 57 పరుగులతో అదరగొట్టాడు. మహ్మద్ హారీస్ 30 పరుగులతో రాణించాడు.
చదవండి: NZ Vs PAK: ఆడింది కివీసేనా.. పేలవ ఫీల్డింగ్, నాసిరకం బ్యాటింగ్
Comments
Please login to add a commentAdd a comment