ICC Mens T20 World Cup 2022 - New Zealand vs Pakistan: టీ20 ప్రపంచకప్-2022 తొలి సెమీ ఫైనల్లో పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో న్యూజిలాండ్ గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. సిడ్నీ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కివీస్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, పాక్ స్టార్ పేసర్ తొలి ఓవర్లోనే బ్లాక్ క్యాప్స్‌కు షాకిచ్చాడు. మూడో బంతికే ఓపెనర్ ఫిన్ అలెన్‌ను పెవిలియన్‌కు పంపాడు.
ఆదిలోనే షాక్
వికెట్ల ముందు అతడిని దొరకబచ్చుకున్న ఆఫ్రిది తొలి వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. 4 పరుగులు మాత్రమే చేసిన అలెన్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరగడంతో ఆరంభంలోనే కివీస్ వికెట్ కోల్పోయింది. ఈ క్రమంలో మరో ఓపెనర్ డెవాన్ కాన్వే, వన్‌డౌన్ బ్యాటర్, కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు.
కాన్వే 21 పరుగులతో నిలకడగా ఆడుతున్నట్లు కనిపించగా.. షాదాబ్ ఖాన్ అతడిని రనౌట్ చేయడంతో కివీస్ రెండో వికెట్ కోల్పోయింది. ఇక 42 బంతుల్లో 46 పరుగులు చేసిన విలియమ్సన్‌ను షాహిన్ ఆఫ్రిది అవుట్ చేశాడు.
వాళ్లిద్దరు రాణించారు కాబట్టే
గ్లెన్ ఫిలిప్స్ 6 పరుగులకే పెవిలియన్ చేరగా.. ఐదో స్థానంలో వచ్చిన డారిల్ మిచెల్ 35 బంతుల్లో 53 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. మరో ఎండ్‌లో అతడికి సహకరించిన జేమ్స్ నీషమ్ 12 బంతుల్లో 16 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. విలియమ్సన్, మిచెల్ ఇన్నింగ్స్‌తో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి న్యూజిలాండ్ 152 పరుగులు చేయగలిగింది. దీంతో నెటిజన్లు.. ‘‘మిచెల్, విలియమ్సన్ రాణించారు కాబట్టి సరిపోయింది. లేదంటే కివీస్ పరిస్థితి మరింత ఘోరంగా తయారయ్యేది’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
కివీస్ స్కోరు: 152-4
టాప్ స్కోరర్: డారిల్ మిచెల్ (35 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 53 పరుగులు)
చదవండి: .. ఒక్క రనౌట్‌తో
Comments
Please login to add a commentAdd a comment