టీ20 ప్రపంచకప్-2022కు ముందు న్యూజిలాండ్‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉంది. ఆ జట్టు స్టార్ ఆల్ రౌండర్ డార్లీ మిచెల్ చేతి వేలికి గాయమైంది. దీంతో పాకిస్తాన్, బంగ్లాదేశ్ ట్రై సిరీస్‌కు దూరమయ్యాడు. శనివారం పాకిస్తాన్‌తో జరగనున్న తొలి మ్యాచ్‌కు ముందు నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తుండగా మిచెల్ కుడి చేతి వేలి ఫ్రాక్చర్ అయింది.
అతడు గాయం నుంచి కోలుకోవడానికి దాదాపు రెండు నుంచి మూడు వారాల సమయం పట్టనున్నట్లు వైద్యులు తెలిపారు. ఈ క్రమంలో అతడు టీ20 ప్రపంచకప్‌లో కూడా పాల్గొనడం సందేహంగా మారింది. ఇక ఇదే విషయంపై న్యూజిలాండ్ హెడ్ కోచ్ గ్యారీ స్టెడ్ మాట్లాడుతూ.. "కీలకమైన ప్రపంచకప్‌కు ముందు మిచెల్ గాయపడడం మా దురదృష్టం.
మిచెల్ మా జట్టులో కీలక సభ్యుడుగా ఉన్నాడు. అతడు తన గాయం కారణంగా ట్రై సిరీస్ నుంచి తప్పుకున్నాడు. అయితే టీ20 ప్రపంచకప్‌కు మిచెల్ అందుబాటుపై ఇప్పుడే ఏమి చెప్పలేం. ఈ మెగా ఈవెంట్‌లో మా తొలి మ్యాచ్‌కు ఇంకా రెండు వారాల సమయం ఉంది. అతడి గాయం తీవ్రతను పరిగణనలోకి తీసుకుని త్వరలో ఓ నిర్ణయం తీసుకుంటాం" అని పేర్కొన్నాడు. కాగా గతేడాది టీ20 ప్రపంచకప్‌లో మిచెల్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఫైనల్‌కు కివీస్ చేరడంలో మిచెల్ కీలక పాత్ర పోషించాడు.
చదవండి: Womens Asia Cup 2022: చిరకాల ప్రత్యర్ధి పాక్‌తో భారత్ పోరు..
Comments
Please login to add a commentAdd a comment