వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా ధర్మశాల వేదికగా నెదర్లాండ్స్-దక్షిణాఫ్రికా జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో నెదర్లాండ్స్ ఇన్నింగ్స్ సందర్భంగా ఫన్నీ సంఘటన చోటు చేసుకుంది. దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ గెరాల్డ్ కోయెట్జీ ఓ విచిత్రమైన బంతితో అందరని ఆశ్చర్యపరిచాడు. నెదర్లాండ్స్ ఇన్నింగ్స్ 11 ఓవర్ వేసేందుకు దక్షిణాఫ్రికా కెప్టెన్ బావుమా కోయెట్జీ చేతికి బంతి ఇచ్చాడు.
అయితే తన మొదటి ఓవర్‌లో తొలి రెండు బంతులను వేసేందుకు కోయెట్జీ చాలా కష్టపడ్డాడు. మొదటి బంతిని వైడ్‌గా సంధించిన కోయెట్జీ.. రెండో బంతిని అయితే మరి విచిత్రంగా వేశాడు. అతడు వేసిన బంతి బ్యాటర్‌కు, వికెట్ కీపర్‌కు కాకుండా.. మొదటి స్లిప్‌లో ఉన్న క్లాసన్ చేతికి వెళ్లింది.
ఒక్కసారిగా చూసిన వారంతా స్లిప్ క్యాచ్ అనుకున్నారు. కానీ అది వైడ్‌బాల్ అని తెలుసుకున్నాక అంతా నవ్వుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఇదేమి బాల్‌రా బాబు.. బ్యాటర్‌కు కాకుండా స్లిప్ ఫీల్డర్‌కు వేశావు అంటూ కామెంట్లు చేస్తున్నారు.
చదవండి: సరికొత్త చరిత్ర.. విధ్వంసకర ఇన్నింగ్స్‌తో 11 బంతుల్లోనే.. యువీ రికార్డు బద్దలు
Comments
Please login to add a commentAdd a comment