2023 జులై నెలకు గాను ఐసీసీ ఇవాళ (ఆగస్ట్ 7) ప్లేయర్ ఆఫ్ ద మంత్ నామినీస్‌ను ప్రకటించింది. ఈ జాబితాలో ఒక్కరు మినహా మొత్తం యాషెస్ 2023 స్టార్లే ఉండటం విశేషం. పురుషుల విభాగంలో ఇంగ్లండ్ ఆటగాళ్లు జాక్ క్రాలే, క్రిస్ వోక్స్‌లతో పాటు నెదర్లాండ్స్ ఆల్‌రౌండర్ బాస్ డి లీడ్ నామినేట్ కాగా.. మహిళల విభాగంలో ఆసీస్ ప్లేయర్స్ ఆష్లే గార్డ్‌నర్, ఎల్లిస్ పెర్రీతో పాటు ఇంగ్లండ్ నాట్ సీవర్ బ్రంట్ నామినేట్ అయ్యింది.
పై పేర్కొన్న జాబితాలో నెదర్లాండ్స్ బాస్ డి లీడ్ వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ అదరగొట్టగా.. మిగతా ఐదుగురు పురుషులు, మహిళల యాషెస్‌లో ఇరగదీసారు. శ్రీలంకలో జరిగిన వన్డే వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్‌లో స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో కనబర్చిన అత్యుత్తమ ఆల్‌రౌండ్ ప్రదర్శనకు (5/52, 123 (92)) గాను లీడ్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుకు నామినేట్ అయ్యాడు.
క్రిస్ వోక్స్ (ఇంగ్లండ్)..
యాషెస్ సిరీస్‌లో తొలి రెండు టెస్ట్‌లు మిస్ అయ్యి, మూడో టెస్ట్ నుంచి బరిలోకి దిగిన వోక్స్.. జులై నెలలో జరిగిన 3,4,5 యాషెస్ టెస్ట్‌ల్లో అద్భుతంగా రాణించి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు సైతం దక్కించుకున్నాడు. వోక్స్ జులైలో ఆడిన 3 మ్యాచ్‌ల్లో 18.15 సగటున 19 వికెట్లు పడగొట్టాడు.
జాక్ క్రాలే (ఇంగ్లండ్)..
జులైలో జరిగిన 2, 3, 4, 5 యాషెస్ టెస్ట్‌ల్లో ఆకాశమే హద్దుగా చెలరేగిన క్రాలే.. ఈ నాలుగు టెస్ట్‌ల్లో 58.85 సగటున 412 పరుగులు చేశాడు. ఇందులో మాంచెస్టర్ టెస్ట్‌లో అతను చేసిన 189 పరుగుల ఇన్నింగ్స్, నిర్ణయాత్మక ఐదో టెస్ట్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో చేసిన 73 పరుగుల ఇన్నింగ్స్‌లు హైలైట్‌గా నిలిచాయి.
ఆష్లే గార్డ్‌నర్ (ఆసీస్)..
జూన్ నెల మహిళల ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు విన్నర్ అయిన ఆష్లే గార్డ్‌నర్ జులైలో జరిగిన మ్యాచ్‌ల్లో 232 పరుగులతో పాటు 15 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుకు వరుసగా రెండో నెల కూడా నామినేట్ అయ్యింది.
ఎల్లిస్ పెర్రీ (ఆసీస్)..
పెర్రీ.. జులై నెలలో ఇంగ్లండ్, ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌ల్లో బ్యాట్‌తో అద్భుతంగా రాణించి (4 మ్యాచ్‌ల్లో 276 పరుగులు) తొలిసారి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుకు నామినేట్ అయ్యింది.
నాట్ సీవర్ బ్రంట్ (ఇంగ్లండ్)..
మహిళల యాషెస్ సిరీస్‌లో భాగంగా జరిగిన 3 వన్డేల సిరీస్‌లో బ్రంట్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది. ఈ సిరీస్‌లో భాగంగా జులై నెలలో జరిగిన ఆఖరి 2 మ్యాచ్‌ల్లో ఈమె రెండు సెంచరీలు (111 నాటౌట్, 129) సాధించింది. ఫలితంగా ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుకు నామినేట్ అయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment