అక్టోబర్‌లో జరగనున్న వన్డే వరల్డ్‌కప్‌కు నెదర్లాండ్స్ అర్హత సాధించింది. స్కాట్లాండ్‌తో జరిగిన వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ సూపర్ సిక్స్ మ్యాచ్‌లో డచ్ జట్టు నాలుగు వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో(బౌలింగ్‌లో ఐదు వికెట్లు, బ్యాటింగ్‌లో సెంచరీ) మెరిసిన బాస్ డీ లీడే హైలెట్‌గా నిలిచాడు.
దీంతో క్వాలిఫయర్-2 హోదాలో నెదర్లాండ్స్ వరల్డ్‌కప్‌కు పదో జట్టుగా అర్హత సాధించింది. ఇక క్వాలిఫయర్-1గా శ్రీలంక ఇప్పటికే వన్డే వరల్డ్‌కప్‌కు అర్హత సాధించగా.. తాజాగా డచ్ జట్టు క్వాలిఫయర్-2 హోదాలో వన్డే వరల్డ్‌కప్‌కు వెళ్లనుంది. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ జరగనుంది. భారత్ గడ్డపై ఈ మెగా సంగ్రామం జరగనుంది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. బ్రాండన్ మెక్‌ముల్లన్ 110 బంతుల్లో 106 పరుగులు సెంచరీ చేయగా.. కెప్టెన్ రిచీ బెరింగ్‌టన్ 64, థామస్ మెకింటోష్ 38 పరుగులు చేశారు. నెదర్లాండ్స్ బౌలర్లలో బాస్ డీ లీడే ఐదు వికెట్లు తీయగా.. రెయాన్ క్లీన్ రెండు, వాన్‌బీక్ ఒక వికెట్ పడగొట్టాడు.
అనంతరం 278 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ 42.5 ఓవర్లలోనే ఆరు వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను అందుకుంది. నెదర్లాండ్స్ మిడిలార్డర్ బ్యాటర్ బాస్ డీ లీడే(92 బంతుల్లో 123 పరుగులు) సంచలన శతకంతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఓపెనర్ విక్రమ్‌జిత్ సింగ్ 40 పరుగులు, ఆఖర్లో సకీబ్ జుల్పికర్ 33 నాటౌట్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. బౌలిగ్‌లో ఐదు వికెట్లు తీయడంతో పాటు వీరోచిత శతకంతో మెరిసిన బాస్ డీ లీడేను 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు వరించింది.
90 (82) 👉 123 (92)
— ICC Cricket World Cup (@cricketworldcup) July 6, 2023
Bas de Leede went berserk in the last 10 balls he faced to seal Netherlands' #CWC23 qualification 💪#SCOvNED pic.twitter.com/gJMrkhm3aU
A stunning heist! 😱
— ICC Cricket World Cup (@cricketworldcup) July 6, 2023
Netherlands have booked their #CWC23 tickets 🎫✈#SCOvNED pic.twitter.com/HtdyRvTWo0
చదవండి: #MitchellMarsh: నాలుగేళ్ల తర్వాత రీఎంట్రీ.. వన్డే తరహాలో రెచ్చిపోయి సెంచరీ
#MarkWood: యాషెస్ చరిత్రలో రెండో ఫాస్టెస్ట్ బంతి.. ఖవాజాకు మైండ్ బ్లాక్
Comments
Please login to add a commentAdd a comment