Netherlands team
-
నేపాల్‌ను చిత్తు చేసిన నెదర్లాండ్స్..
టీ20 వరల్డ్‌కప్-2024లో నెదర్లాండ్స్ బోణీ కొట్టింది. మంగళవారం డల్లాస్ వేదికగా నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో నెదర్లాండ్స్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్ 19.2 ఓవర్లలో కేవలం 106 పరుగులకే కుప్పకూలింది. డచ్ బౌలర్లు టామ్ ప్రింగల్, వాన్ బీక్ తలా మూడు వికెట్లతో నేపాల్ పతనాన్ని శాసించారు. వీరిద్దరితో పాటు వాన్‌మీకరన్, బాస్డీలీడ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. డచ్ బౌలర్లు నేపాల్‌ను ఏ దశలోనూ కోలుకునే ఛాన్స్ ఇవ్వలేదు. నెదర్లాండ్స్ బౌలర్ల దాటికి నేపాల్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. నేపాల్ బ్యాటర్లలో కెప్టెన్ రోహిత్ పాడౌల్(35) మినహా మిగితా బ్యాటర్లందరూ దారుణంగా విఫలమయ్యారు. అనంతరం 107 పరుగులతో లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ 18.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి చేధించింది. డచ్ బ్యాటర్లలో మాక్స్ ఔడౌడ్(54) పరుగులతో అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. నేపాల్ బౌలర్లలో సోమ్‌పాల్ కామి, దీపేంద్ర సింగ్, అబినాష్ బోహరా తలా మూడు వికెట్లు పడగొట్టారు. -
ఐదు వికెట్లు, వీరోచిత శతకం.. వన్డే వరల్డ్‌కప్‌కు నెదర్లాండ్స్ అర్హత
అక్టోబర్‌లో జరగనున్న వన్డే వరల్డ్‌కప్‌కు నెదర్లాండ్స్ అర్హత సాధించింది. స్కాట్లాండ్తో జరిగిన వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ సూపర్ సిక్స్ మ్యాచ్‌లో డచ్ జట్టు నాలుగు వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో(బౌలింగ్‌లో ఐదు వికెట్లు, బ్యాటింగ్‌లో సెంచరీ) మెరిసిన బాస్ డీ లీడే హైలెట్‌గా నిలిచాడు. దీంతో క్వాలిఫయర్-2 హోదాలో నెదర్లాండ్స్ వరల్డ్‌కప్‌కు పదో జట్టుగా అర్హత సాధించింది. ఇక క్వాలిఫయర్-1గా శ్రీలంక ఇప్పటికే వన్డే వరల్డ్‌కప్‌కు అర్హత సాధించగా.. తాజాగా డచ్ జట్టు క్వాలిఫయర్-2 హోదాలో వన్డే వరల్డ్‌కప్‌కు వెళ్లనుంది. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ జరగనుంది. భారత్ గడ్డపై ఈ మెగా సంగ్రామం జరగనుంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. బ్రాండన్ మెక్ముల్లన్ 110 బంతుల్లో 106 పరుగులు సెంచరీ చేయగా.. కెప్టెన్ రిచీ బెరింగ్టన్ 64, థామస్ మెకింటోష్ 38 పరుగులు చేశారు. నెదర్లాండ్స్ బౌలర్లలో బాస్ డీ లీడే ఐదు వికెట్లు తీయగా.. రెయాన్ క్లీన్ రెండు, వాన్‌బీక్ ఒక వికెట్ పడగొట్టాడు. అనంతరం 278 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ 42.5 ఓవర్లలోనే ఆరు వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను అందుకుంది. నెదర్లాండ్స్ మిడిలార్డర్ బ్యాటర్ బాస్ డీ లీడే(92 బంతుల్లో 123 పరుగులు) సంచలన శతకంతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఓపెనర్ విక్రమ్‌జిత్ సింగ్ 40 పరుగులు, ఆఖర్లో సకీబ్ జుల్పికర్ 33 నాటౌట్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. బౌలిగ్లో ఐదు వికెట్లు తీయడంతో పాటు వీరోచిత శతకంతో మెరిసిన బాస్ డీ లీడేను 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు వరించింది. 90 (82) 👉 123 (92) Bas de Leede went berserk in the last 10 balls he faced to seal Netherlands' #CWC23 qualification 💪#SCOvNED pic.twitter.com/gJMrkhm3aU — ICC Cricket World Cup (@cricketworldcup) July 6, 2023 A stunning heist! 😱 Netherlands have booked their #CWC23 tickets 🎫✈#SCOvNED pic.twitter.com/HtdyRvTWo0 — ICC Cricket World Cup (@cricketworldcup) July 6, 2023 చదవండి: #MitchellMarsh: నాలుగేళ్ల తర్వాత రీఎంట్రీ.. వన్డే తరహాలో రెచ్చిపోయి సెంచరీ #MarkWood: యాషెస్ చరిత్రలో రెండో ఫాస్టెస్ట్ బంతి.. ఖవాజాకు మైండ్ బ్లాక్ -
సౌతాఫ్రికాపై నెదర్లాండ్స్ సంచలన విజయం (ఫొటోలు)
-
T20 WC ZIM Vs NED: జింబాబ్వే వర్సెస్ నెదర్లాండ్స్.. తుది జట్లు ఇవే
టీ20 ప్రపంచకప్-2022లో భాగంగా నెదర్లాండ్స్‌తో కీలక మ్యాచ్‌లో జింబాబ్వే తలపడతోంది. ఆడిలైడ్ వేదికగా జరుగుతోన్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన జింబాబ్వే తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో నెదర్లాండ్స్ ఒకే ఒక మార్పుతో బరిలోకి దిగగా.. జింబాబ్వే కూడా ఓ మార్పుతో ఆడనుంది. ఇక వరుస ఓటములతో నెదర్లాండ్స్ ఇప్పటికే ఇంటిముఖం పట్టగా.. జింబాబ్వే మాత్రం సెమీస్ రేసులో ఉంది. జింబాబ్వే.. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి అనంతరం భారత్‌పై గెలిపొందితే నేరుగా సెమీస్‌లో అడుగు పెడుతోంది. తుది జట్లు: నెదర్లాండ్స్ : స్టీఫన్ మైబర్గ్, మాక్స్ ఓడౌడ్, టామ్ కూపర్, కోలిన్ అకెర్మాన్, బాస్ డి లీడే, స్కాట్ ఎడ్వర్డ్స్(వికెట్ కీపర్), రోలోఫ్ వాన్ డెర్ మెర్వే, లోగాన్ వాన్ బీక్, ఫ్రెడ్ క్లాసెన్, పాల్ వాన్ మీకెరెన్, బ్రాండన్ గ్లోవర్ జింబాబ్వే: వెస్లీ మాధేవెరే, క్రెయిగ్ ఎర్విన్ (కెప్టెన్), రెగిస్ చకబ్వా (వికెట్ కీపర్), సీన్ విలియమ్స్, సికందర్ రజా, మిల్టన్ శుంబా, ర్యాన్ బర్ల్, ల్యూక్ జోంగ్వే, టెండై చటారా, రిచర్డ్ నగరవ, బ్లెస్సింగ్ ముజారబానీ చదవండి: T20 WC 2022: బంగ్లాదేశ్‌తో కీలక మ్యాచ్.. టీమిండియా అభిమానులకు గుడ్ న్యూస్ -
T20 WC 2022: నెదర్లాండ్ పై భారత్ ఘన విజయం (ఫొటోలు)
-
నమీబియాకు షాకిచ్చిన యూఏఈ.. సూపర్-12కు నెదర్లాండ్స్
టీ20 ప్రపంచకప్-2022 క్వాలిఫియర్స్(గ్రూప్-ఎ)లో భాగంగా యూఏఈతో జరిగిన కీలక మ్యాచ్‌లో 7 పరుగుల తేడాతో నమీబియా పరాజయం పాలైంది. తద్వారా టీ20 ప్రపంచకప్-2022 నుంచి నమీబియా ఇంటిముఖం పట్టింది. ఈ మ్యాచ్‌లో నమీబియా ఓటమి పాలవ్వడంతో.. గ్రూప్-ఎ నుంచి నెదర్లాండ్స్ సూపర్-12లో అడుగుపెట్టింది. కాగా నమీబియా ఆల్‌రౌండర్ డేవిడ్ వీస్ అఖరి వరకు పోరాటం చేసినప్పటికీ జట్టును గెలిపించలేకపోయాడు. 149 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నమీబియా 13 ఓవర్లు ముగిసే సరికి 67 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన వీస్(36 బంతుల్లో 55 పరుగులు) అద్భుతమైన ఇన్నింగ్స్‌తో నమీబియా గెలుపు ఆశలను పెంచాడు. అయితే అఖరి ఓవర్లో నమీబియా విజయానికి 14 పరుగులు అవసరమైన క్రమంలో వీస్ ఔటయ్యాడు. దీంతో మ్యాచ్ యూఏఈ వైపు మలుపు తిరిగింది. అఖరి ఓవర్లో నమీబియా కేవలం 7 పరుగులు మాత్రమే చేసి టోర్నీ నుంచి నిష్క్రమించింది. యూఏఈ బౌలర్లలో హమిద్, జహూర్ ఖాన్ చెరో రెండు వికెట్లు సాధించగా.. వసీం, జునైద్ సిద్ధిక్, మెయ్యప్పన్ తలా వికెట్ సాధించారు. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 148 పరుగులు చేసింది. యూఏఈ బ్యాటర్లలో మహ్మద్ వసీం(50), రిజ్వాన్(43) పరుగులతో రాణించారు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1971406958.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); View this post on Instagram A post shared by ICC (@icc) చదవండి: Predicted Playing XI: పాక్‌తో తొలి మ్యాచ్.. తుది జట్టు ఇదే! పంత్, అశ్విన్, హుడాకు నో ఛాన్స్! -
వన్డేల్లో చరిత్ర సృష్టించిన జోస్ బట్లర్.. ధోని 17 ఏళ్ల రికార్డు బద్దలు!
ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు జోస్ బట్లర్ భీకర ఫామ్‌లో ఉన్నాడు. ఐపీఎల్లో అదరగొట్టిన బట్లర్ అదే జోరును నెదర్లాండ్స్‌తో జరిగిన వన్డే సిరీస్‌లోనూ కొనసాగించాడు. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను ఇంగ్లండ్ 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో బట్లర్ 248 పరుగులు సాధించాడు. అతడు ఇన్నింగ్స్‌లో ఇక భారీ సెంచరీ కూడా ఉంది. తొలి వన్డేలో కేవలం 70 బంతుల్లోనే 162 పరుగులు సాధించి విధ్వంసం సృష్టించాడు. ఇక ఈ వన్డే సిరీస్‌లో బట్లర్ ఏకంగా 19 సిక్స్‌లు బాదాడు. ఈ క్రమంలో వన్డే క్రికెట్లో జోస్ బట్లర్ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఒక వన్డే సిరీస్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన తొలి వికెట్ కీపర్‌గా జోస్ బట్లర్ రికార్డులకెక్కాడు. అంతకుమందు ఈ ఘనత భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని పేరిట ఉండేది. 2005లో శ్రీలంకతో జరగిన వన్డే సిరీస్‌లో ధోని 17 సిక్సర్లు బాదాడు. ఇక ఈ రికార్డు సాధించిన జాబితాలో దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ మూడో స్థానంలో ఉన్నాడు. చదవండి: India Vs Ireland T20I Series Details: ఐర్లాండ్‌తో భారత్ టీ 20 సిరీస్.. ఇరు జట్లు, షెడ్యూల్.. పూర్తి వివరాలు! Thank you 🙏🏼 @TheBarmyArmy for creating an unbelievable atmosphere across the 3 matches ❤️#SeeYouSoon #NEDvENG https://t.co/Z05OJ6Q3Ux — Cricket🏏Netherlands (@KNCBcricket) June 22, 2022 Thank you @KNCBcricket. Thank you @TheBarmyArmy. Thank you Amsterdam pic.twitter.com/L8tvoPx2ec — TheCricketMen (@thecricketmen) June 22, 2022 -
పాపం మంచి షాట్ ఆడాడు కానీ గెలిపించలేకపోయాడు
డుబ్లిన్: కవర్ డ్రైవ్, స్క్వేర్‌లెగ్, స్ట్రెయిట్ డ్రైవ్, మిడాన్, మిడాఫ్.. ఇలా చెప్పుకుంటే పోతే క్రికెట్లో చాలా షాట్లు ఉన్నాయి. సాధారణంగా క్రికెట్ పుట్టినప్పటి నుంచి ఇలాంటి షాట్లను వింటూనే ఉన్నాం. కానీ మోడ్రన్ క్రికెట్ యుగం ప్రారంభమయ్యాకా కొందరు బ్యాట్స్‌మెన్ ప్రత్యేక షాట్లతో తమకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. ఉదాహరణకు ధోని అంటే గుర్తుకువచ్చేది హెలికాప్టర్.. కెవిన్ పీటర్స్‌న్ అనగానే స్విచ్ హిట్.. ఏబీ డివిలియర్స్ ర్యాంప్ షాట్‌కు పెట్టింది పేరు. అయినా ఇప్పుడు ఈ విషయం గురించి ఎందుకు అనుకుంటున్నారా.. అక్కడికే వస్తున్నాం. తాజాగా ఐర్లాండ్ , నెదర్లాండ్స్ మధ్య బుధవారం జరిగిన వన్డే మ్యాచ్‌లో ఒక బౌలర్ ర్యాంప్ షాట్ ఆడడం ప్రత్యేకతను సంతరించుకుంది. ఐర్లాండ్ బౌలర్ జోషుహా లిటిల్ ముందు బౌలింగ్‌లో మూడు కీలక వికెట్లు తీశాడు.. ఆ తర్వాత బ్యాటింగ్ సందర్భంగా తన బౌండరీతో మ్యాచ్‌ను ఉత్కంఠగా మార్చాడు. అయితే ఈ మ్యాచ్‌లో నెదర్లాండ్స్ కేవలం ఒక్క పరుగు తేడాతో గెలవడం విశేషం. విషయంలోకి వెళితే.. ఐర్లాండ్ ఇన్నింగ్స్ సమయంలో చివరి ఓవర్‌కు పది పరుగులు అవసరం అయ్యాయి. ఓవర్ తొలి బంతికే క్రీజులో పాతుకుపోయిన సిమీ సింగ్ రనౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో ఐర్లాండ్ ఓటమి ఖాయమని అంతా భావించారు. అయితే క్రీజులోకి వచ్చిన జోషేహా లిటిల్ రెండో బంతికి పరుగు తీయలేదు. ఇప్పుడు నాలుగు బంతుల్లో 9 పరుగులు కావాలి. నెదర్లాండ్స్ బౌలర్ లోగన్ వాన్ బీక్ మూడో బంతిని ఆఫ్ప్టంప్ బయటకు వేశాడు. ఈ దశలో ఎవరు ఊహించని విధంగా జోషుహా షఫిల్ అయి ఫైన్ లెగ్ దిశగా బౌండరీ బాదాడు. అలా ఒక బౌలర్ ర్యాంప్ షాట్ ఆడడం చాలా అరుదు.. దీనిని చూసిన నెదర్లాండ్స్ ఆటగాళ్లు కాస్త ఆశ్చర్యానికి లోనయ్యారు. అయితే చివరి బంతికి 3 పరుగులు అవసరం కాగా.. జోషుహా మరోసారి అదే షాట్ ప్రయత్నించగా.. ఈసారి మాత్రం రెండు పరుగులు మాత్రమే వచ్చాయి. అలా నెదర్లాండ్స్ ఒక్క పరుగు తేడాతో గెలుపొందింది. అయితే జోషుహా షాట్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ 50 ఓవర్లలో 195 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఐర్లాండ్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. చదవండి: నీ పాటలో చాలా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది: మ్యాక్స్‌వెల్ What an incredible shot by Joshua Little!!! #NEDvIRE pic.twitter.com/xtb1Q6whnr — mubin (@Bringbackclt2O) June 2, 2021 -
‘ఆరెంజ్’ ఓ రేంజ్లో...
నెదర్లాండ్స్ సిక్సర్ల హోరు ఐర్లాండ్‌పై అద్వితీయ విజయం సూపర్-10కు అర్హత శుక్రవారం మరికొద్ది సేపట్లో వరల్డ్ కప్‌లో భారత్, పాకిస్థాన్ పోరు ప్రారంభం కానుంది. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులందరి దృష్టీ ఈ మ్యాచ్‌పైనే ఉంది. ఇలాంటి స్థితిలో మరో మ్యాచ్ ఏదైనా ఎవరూ పట్టించుకునే స్థితిలో లేరు. కానీ ఒక క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో కూడా అద్భుతాలు జరిగాయి. పసికూనల పోరు అంటే ఆషామాషీ కాదని ఐర్లాండ్, నెదర్లాండ్స్ నిరూపించాయి. మూడు పదుల సిక్సర్లతో మ్యాచ్‌లో విరుచుకుపడ్డాయి. అద్భుత ఆటతీరుతో నెదర్లాండ్స్ విజయం దక్కించుకోగా... ఐర్లాండ్ భారీ స్కోరూ చిన్నదైపోయింది. ఓవరాల్‌గా ఈ టి20 మ్యాచ్ పంచిన రికార్డు వినోదంతో సిల్హెట్ స్టేడియం దద్దరిల్లింది. సిల్హెట్: ఐర్లాండ్‌తో గ్రూప్ ‘బి’ మ్యాచ్... 14.2 ఓవర్లలో 190 పరుగుల విజయలక్ష్యం... ఓవర్‌కు దాదాపు 13.38 పరుగులు చేయాలి! ఇదీ నెదర్లాండ్స్ జట్టు సూపర్-10కు అర్హత సాధించాలంటే చేయాల్సిన పరుగుల స్థితి. సాధారణంగానే టి20ల్లో ఇది భారీ లక్ష్యం. ఇక 34 బంతులు మిగిలి ఉండగానే ఛేదించాలి అంటే ఎంత పెద్ద జట్టయినా మ్యాచ్‌కు ముందే ఒక రకమైన అపనమ్మకం. కానీ ‘ఆరెంజ్ సేన’ అలాంటి లక్ష్యాన్ని లెక్క చేయలేదు. ఏ దశలోనూ వెనుకంజ వేయకుండా ఆడి టి20 చరిత్రలోనే ఒక పెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ క్రమంలో అనేక రికార్డులు చెరిపేసింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ స్టెఫాన్ మైబర్గ్ (23 బంతుల్లో 63; 4 ఫోర్లు, 7 సిక్స్‌లు), టామ్ కూపర్ (15 బంతుల్లో 45; 1 ఫోర్, 6 సిక్స్‌లు), వెస్లీ బారెసి (22 బంతుల్లో 40 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), పీటర్ బోరెన్ (15 బంతుల్లో 31; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) బ్యాట్‌తో కదంతొక్కారు. ముందుగా బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 189 పరుగులు చేసింది. పాయింటర్ (38 బంతుల్లో 57; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు), పోర్టర్‌ఫీల్డ్ (32 బంతుల్లో 47; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), కెవిన్ ఓబ్రైన్ (16 బంతుల్లో 42 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు), జాయ్స్ (25 బంతుల్లో 28; 1 ఫోర్, 1 సిక్స్) ఐర్లాండ్ భారీ స్కోరుకు బాటలు పరిచారు. నెదర్లాండ్స్‌కు ఓపెనర్లు బోరెన్, మైబర్గ్ అద్భుత ఆరంభాన్ని ఇచ్చారు. ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే మైబర్గ్ 3, బోరెన్ 1 సిక్స్ బాదడంతో 25 పరుగులు వచ్చాయి. కుసాక్ వేసిన నాలుగో ఓవర్లో మైబర్గ్ మరో 3 సిక్సర్లు, 1 ఫోర్ కొట్టాడు. పవర్‌ప్లేలో కొత్త ప్రపంచ రికార్డు సృష్టిస్తూ వీరిద్దరూ 6 ఓవర్లలో 91 పరుగులు జోడించారు. 7.4 ఓవర్లలోనే జట్టు స్కోరు వంద పరుగులు దాటడం కూడా రికార్డే. ఈ దశలో 9 పరుగుల వ్యవధిలో 3 వికెట్లు కోల్పోవడంతో నెదర్లాండ్స్ కొంత వెనుకంజ వేసింది. ఆ వెంటనే ఒక పరుగు వద్ద టామ్ కూపర్ ఇచ్చిన అతి సునాయాస క్యాచ్‌ను జాయ్స్ వదిలేయడం ఐర్లాండ్‌ను ముంచింది. తర్వాత డాక్రెల్ ఓవర్లో వరుసగా నాలుగు సిక్సర్లతో విరుచుకుపడిన కూపర్ మ్యాచ్‌ను లాక్కున్నాడు. కూపర్ అవుటైనా, బారెసి తన జోరును కొనసాగించి 13.5 ఓవర్లలోనే జట్టును గెలిపించాడు. విన్నింగ్ షాట్‌గా బారెసి కొట్టిన సిక్సర్‌తో డచ్ సేన సూపర్-10కు అర్హత సాధించింది. నెదర్లాండ్స్ ఇన్నింగ్స్‌లో కొట్టిన 19 సిక్సర్లు కొత్త ప్రపంచ రికార్డు. 18 సిక్సర్లతో ఇప్పటివరకు ఈ రికార్డు ఆస్ట్రేలియా పేరిట ఉండేది. ఈ ఇన్నింగ్స్‌లో 162 పరుగులు ఫోర్లు, సిక్సర్ల ద్వారానే వచ్చాయి. గతంలో 13.2 ఓవర్లు ఆడినప్పుడు ఒక జట్టు చేసిన అత్యధిక స్కోరు 175 (దక్షిణాఫ్రికా) మాత్రమే. పాపం జింబాబ్వే... సిల్హెట్: చిగుంబురా (21 బంతుల్లో 53 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీతో రాణించడంతో గ్రూప్ ‘బి’ మరో మ్యాచ్‌లో జింబాబ్వే 5 వికెట్లతో యూఏఈపై నెగ్గింది. ముందుగా యూఏఈ 20 ఓవర్లలో 9 వికెట్లకు 116 పరుగులు చేసింది. స్వప్నిల్ పాటిల్ (30) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం జింబాబ్వే 13.4 ఓవర్లలో 5 వికెట్లకు 118 పరుగులు చేసింది. ఈ గెలుపుతో జింబాబ్వే సూపర్-10పై ఆశలు పెంచుకుంది. తర్వాతి మ్యాచ్ అనంతరం నెదర్లాండ్స్, జింబాబ్వే, ఐర్లాండ్ నాలుగేసి పాయింట్లతో సమంగా నిలిచాయి. అయితే మెరుగైన రన్‌రేట్‌తో జింబాబ్వే (+0.957), ఐర్లాండ్ (-0.701)లను వెనక్కినెట్టిన నెదర్లాండ్స్ (+1.109) సూపర్-10కు అర్హత సాధించింది.