ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు జోస్ బట్లర్ భీకర ఫామ్‌లో ఉన్నాడు. ఐపీఎల్‌లో అదరగొట్టిన బట్లర్ అదే జోరును నెదర్లాండ్స్‌తో జరిగిన వన్డే సిరీస్‌లోనూ కొనసాగించాడు. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను ఇంగ్లండ్ 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో బట్లర్ 248 పరుగులు సాధించాడు. అతడు ఇన్నింగ్స్‌లో ఇక భారీ సెంచరీ కూడా ఉంది. తొలి వన్డేలో కేవలం 70 బంతుల్లోనే 162 పరుగులు సాధించి విధ్వంసం సృష్టించాడు.
ఇక ఈ వన్డే సిరీస్‌లో బట్లర్ ఏకంగా 19 సిక్స్‌లు బాదాడు. ఈ క్రమంలో వన్డే క్రికెట్‌లో జోస్ బట్లర్ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఒక వన్డే సిరీస్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన తొలి వికెట్ కీపర్‌గా జోస్ బట్లర్ రికార్డులకెక్కాడు. అంతకుమందు ఈ ఘనత భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని పేరిట ఉండేది. 2005లో శ్రీలంకతో జరగిన వన్డే సిరీస్‌లో ధోని 17 సిక్సర్లు బాదాడు. ఇక ఈ రికార్డు సాధించిన జాబితాలో దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ మూడో స్థానంలో ఉన్నాడు.
చదవండి: India Vs Ireland T20I Series Details: ఐర్లాండ్‌తో భారత్ టీ 20 సిరీస్.. ఇరు జట్లు, షెడ్యూల్.. పూర్తి వివరాలు!
Thank you 🙏🏼 @TheBarmyArmy for creating an unbelievable atmosphere across the 3 matches ❤️#SeeYouSoon #NEDvENG https://t.co/Z05OJ6Q3Ux
— Cricket🏏Netherlands (@KNCBcricket) June 22, 2022
Thank you @KNCBcricket. Thank you @TheBarmyArmy. Thank you Amsterdam pic.twitter.com/L8tvoPx2ec
— TheCricketMen (@thecricketmen) June 22, 2022
Comments
Please login to add a commentAdd a comment