టీ20 ప్రపంచకప్-2022 క్వాలిఫియర్స్(గ్రూప్-ఎ)లో భాగంగా యూఏఈతో జరిగిన కీలక మ్యాచ్‌లో 7 పరుగుల తేడాతో నమీబియా పరాజయం పాలైంది. తద్వారా టీ20 ప్రపంచకప్-2022 నుంచి నమీబియా ఇంటిముఖం పట్టింది. ఈ మ్యాచ్‌లో నమీబియా ఓటమి పాలవ్వడంతో.. గ్రూప్-ఎ నుంచి నెదర్లాండ్స్ సూపర్-12లో అడుగుపెట్టింది. కాగా నమీబియా ఆల్‌రౌండర్ డేవిడ్ వీస్ అఖరి వరకు పోరాటం చేసినప్పటికీ జట్టును గెలిపించలేకపోయాడు.
149 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నమీబియా 13 ఓవర్లు ముగిసే సరికి 67 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన వీస్(36 బంతుల్లో 55 పరుగులు) అద్భుతమైన ఇన్నింగ్స్‌తో నమీబియా గెలుపు ఆశలను పెంచాడు. అయితే అఖరి ఓవర్‌లో నమీబియా విజయానికి 14 పరుగులు అవసరమైన క్రమంలో వీస్ ఔటయ్యాడు. దీంతో మ్యాచ్ యూఏఈ వైపు మలుపు తిరిగింది.
అఖరి ఓవర్‌లో నమీబియా కేవలం 7 పరుగులు మాత్రమే చేసి టోర్నీ నుంచి నిష్క్రమించింది. యూఏఈ బౌలర్లలో హమిద్, జహూర్ ఖాన్ చెరో రెండు వికెట్లు సాధించగా.. వసీం, జునైద్ సిద్ధిక్, మెయ్యప్పన్ తలా వికెట్ సాధించారు. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 148 పరుగులు చేసింది. యూఏఈ బ్యాటర్లలో మహ్మద్ వసీం(50), రిజ్వాన్(43) పరుగులతో రాణించారు.
చదవండి: Predicted Playing XI: పాక్‌తో తొలి మ్యాచ్.. తుది జట్టు ఇదే! పంత్, అశ్విన్, హుడాకు నో ఛాన్స్!
Comments
Please login to add a commentAdd a comment