UAE team
-
నమీబియాకు షాకిచ్చిన యూఏఈ.. సూపర్-12కు నెదర్లాండ్స్
టీ20 ప్రపంచకప్-2022 క్వాలిఫియర్స్(గ్రూప్-ఎ)లో భాగంగా యూఏఈతో జరిగిన కీలక మ్యాచ్‌లో 7 పరుగుల తేడాతో నమీబియా పరాజయం పాలైంది. తద్వారా టీ20 ప్రపంచకప్-2022 నుంచి నమీబియా ఇంటిముఖం పట్టింది. ఈ మ్యాచ్‌లో నమీబియా ఓటమి పాలవ్వడంతో.. గ్రూప్-ఎ నుంచి నెదర్లాండ్స్ సూపర్-12లో అడుగుపెట్టింది. కాగా నమీబియా ఆల్‌రౌండర్ డేవిడ్ వీస్ అఖరి వరకు పోరాటం చేసినప్పటికీ జట్టును గెలిపించలేకపోయాడు. 149 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నమీబియా 13 ఓవర్లు ముగిసే సరికి 67 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన వీస్(36 బంతుల్లో 55 పరుగులు) అద్భుతమైన ఇన్నింగ్స్‌తో నమీబియా గెలుపు ఆశలను పెంచాడు. అయితే అఖరి ఓవర్లో నమీబియా విజయానికి 14 పరుగులు అవసరమైన క్రమంలో వీస్ ఔటయ్యాడు. దీంతో మ్యాచ్ యూఏఈ వైపు మలుపు తిరిగింది. అఖరి ఓవర్లో నమీబియా కేవలం 7 పరుగులు మాత్రమే చేసి టోర్నీ నుంచి నిష్క్రమించింది. యూఏఈ బౌలర్లలో హమిద్, జహూర్ ఖాన్ చెరో రెండు వికెట్లు సాధించగా.. వసీం, జునైద్ సిద్ధిక్, మెయ్యప్పన్ తలా వికెట్ సాధించారు. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 148 పరుగులు చేసింది. యూఏఈ బ్యాటర్లలో మహ్మద్ వసీం(50), రిజ్వాన్(43) పరుగులతో రాణించారు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1971406958.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); View this post on Instagram A post shared by ICC (@icc) చదవండి: Predicted Playing XI: పాక్‌తో తొలి మ్యాచ్.. తుది జట్టు ఇదే! పంత్, అశ్విన్, హుడాకు నో ఛాన్స్! -
అయ్యో నిసాంక! పాపం కిందపడిపోయాడు.. షూ కూడా! హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే!
ICC Mens T20 World Cup 2022 - Sri Lanka vs United Arab Emirates: యూఏఈతో మ్యాచ్‌లో అదరగొట్టే ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు శ్రీలంక ఓపెనర్ పాతుమ్ నిసాంక. ఓవైపు వరుసగా వికెట్లు పడుతున్నా పట్టుదలగా నిలబడి 60 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌ల సాయంతో 74 పరుగులు సాధించాడు. తద్వారా లంక జట్టు గౌరవప్రదమైన స్కోరు చేయడంలో తన వంతు సాయం చేసి గెలుపులో కీలక పాత్ర పోషించాడు. కాసేపు బెంబేలెత్తించాడు! టీ20 ప్రపంచకప్-2022 క్వాలిఫైయర్స్‌లో భాగంగా జీలాంగ్ వేదికగా యూఏఈతో తమ రెండో మ్యాచ్ ఆడింది దసున్ షనక బృందం. తొలి మ్యాచ్‌లో నమీబియా చేతిలో కంగుతిన్న ఈ ఆసియాకప్-2022 విజేతను యూఏఈ కూడా కాస్త భయపెట్టింది. ముఖ్యంగా చెన్నైకి చెందిన యూఏఈ స్పిన్నర్ కార్తీక్ మెయప్పన్ ఒకే ఓవర్లో వరుసగా మూడు వికెట్లు పడగొట్టి లంక బ్యాటర్లకు వణుకుపుట్టించాడు. అయితే, పాతుమ్ నిసాంక మాత్రం అవకాశం దొరికినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును ముందుకు నడిపాడు. పాపం కిందపడిపోయాడు బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడాడు. ఇక ఈ మ్యాచ్ సందర్భంగా 18వ ఓవర్లో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. జాహూర్ ఖాన్ వేసిన బంతిని షాట్ ఆడే క్రమంలో నిసాంక బ్యాలెన్స్ కోల్పోయి కిందపడిపోయాడు. అతడి షూ కూడా ఊడిపోయింది. అయితే, బంతి బౌండరీ దాటడంతో నాలుగు పరుగులు వచ్చాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లంక ఘన విజయం ఇక మ్యాచ్ విషయానికొస్తే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ పాతుమ్ నిసాంక అద్భుత ఇన్నింగ్స్ కారణంగా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి శ్రీలంక 152 పరుగులు చేయగలిగింది. లక్ష్య ఛేదనకు దిగిన యూఏఈని లంక బౌలర్లు ముప్పుతిప్పలు పెట్టారు. దుష్మంత చమీర 3, వనిందు హసరంగ 3 వికెట్లు పడగొట్టగా.. ప్రమోద్ మదుషాన్ ఒకటి, మహీశ్ తీక్షణ రెండు, దసున్ షనక ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. దీంతో 17.1 ఓవర్లలోనే 73 పరుగులు చేసి యూఏఈ ఆలౌట్ అయింది. ఇక శ్రీలంక తమ తదుపరి మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌తో గురువారం తలపడనుంది. View this post on Instagram A post shared by ICC (@icc) -
యూఏఈ స్పిన్నర్ సంచలనం.. కార్తీక్ మెయప్పన్ సరికొత్త రికార్డు
టీ20 ప్రపంచకప్-2022లో తొలి హాట్రిక్ నమోదైంది. గ్రూప్ ‘ఎ’(క్వాలిఫియర్స్) తొలి రౌండ్లో భాగంగా శ్రీలంకతో మ్యాచ్‌లో యూఏఈ స్పిన్నర్ కార్తీక్ మెయ్యప్పన్ హ్యాట్రక్ వికెట్లు పడగొట్టాడు. శ్రీలంక ఇన్నింగ్స్ 15 ఓవర్ వేసిన మెయ్యప్పన్.. నాలుగో బంతికి రాజపాక్సను ఔట్ చేయగా.. ఆ తరువాతి రెండు బంతులకు వరుసగా అసలంక, షనకను పెవిలియన్‌కు పంపాడు. తద్వారా ఈ ఏడాది మెగా ఈవెంట్లో హ్యట్రిక్ వికెట్లు పడగొట్టిన తొలి బౌలర్‌గా మెయ్యప్పన్ నిలిచాడు. ఇక ఓవరాల్‌గా టీ20 ప్రపంచకప్ చరిత్రలో హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టిన ఐదో బౌలర్‌గా మెయ్యప్పన్ రికార్డులకెక్కాడు. ఈ మ్యాచ్‌లో మెయ్యప్పన్ తన నాలుగు ఓవర్ల కోటాలో 19 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు సాధించాడు. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసింది. లంక బ్యాటర్లలో ఓపెనర్ నిస్సాంక(74) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. View this post on Instagram A post shared by ICC (@icc) var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4911494512.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } });add this quiz to t20 wc articles చదవండి: BCCI- Key Decisions: గంగూలీకి గుడ్‌బై! జై షా కొనసాగింపు.. బీసీసీఐ కీలక నిర్ణయాలివే! -
73 పరుగులకే కుప్పకూలిన యూఏఈ.. శ్రీలంక ఘన విజయం
ICC Mens T20 World Cup 2022- Sri Lanka vs United Arab Emirates, 6th Match, Group A: శ్రీలంక వర్సెస్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ క్వాలిఫైయర్ మ్యాచ్ 73 పరుగులకే కుప్పకూలిన యూఏఈ.. శ్రీలంక ఘన విజయం టీ20 ప్రపంచకప్-2022లో శ్రీలంక తొలి విజయాన్ని నమోదు చేసింది. గ్రూప్ ‘ఎ’(క్వాలిఫియర్స్) తొలి రౌండ్లో భాగంగా యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో 79 పరుగుల తేడాతో శ్రీలంక విజయ భేరి మోగించింది. 153 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యూఏఈ.. 17.1 ఓవర్లలోనే కేవలం 73 పరుగులకే కుప్పకూలింది. శ్రీలంక బౌలర్లలో చమీరా, హాసరంగా చెరో మూడు వికెట్లతో యూఏఈను దెబ్బ తీయగా.. తీక్షణ రెండు, షనక, మధుషాన్ తలా వికెట్ సాధించారు. ఇక యూఏఈ బ్యాటర్లలో ఆఫ్జల్ ఖాన్(19) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. ఓపెనర్ పాథుమ్ నిసాంక 60 బంతుల్లో 74 పరుగులతో లంక ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. యూఏఈ బౌలర్లలో కార్తిక్ మెయప్పన్ హ్యాట్రిక్ నమోదు చేసి సంచలనం సృష్టించాడు. 4 ఓవర్లలో 19 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. జహూర్ ఖాన్ రెండు, అయాన్ అఫ్జల్ ఖాన్ ఒకటి, ఆర్యన్ లక్రా ఒక వికెట్ తీశారు. 36 పరుగులకే 6 వికెట్లు.. ఓటమి దిశగా యూఏఈ 36 పరుగులకే యూఏఈ 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. 9 పరుగులు చేసిన ఆరవింద్.. హాసరంగా బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. యూఏఈ విజయానికి 54 బంతుల్లో 114 పరుగులు కావాలి. నాలుగో వికెట్ కోల్పోయిన యూఏఈ 21 పరుగుల వద్ద యూఏఈ నాలుగో వికెట్ కోల్పోయింది. 14 పరుగులు చేసిన సూరి.. మధుషాన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. 19 పరుగులకే మూడు వికెట్లు.. కష్టాల్లో యూఏఈ 153 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యూఏఈ 19 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. లంక పేసర్ చమీరా మూడు వికెట్లు పడగొట్టి యూఏఈను ఆదిలోనే కోలుకోలేని దెబ్బ కొట్టాడు. తొలి వికెట్ కోల్పోయిన యూఏఈ 153 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యూఏఈ తొలి వికెట్ కోల్పోయింది. 2 పరుగులు చేసిన వసీం.. చమీరా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. యూఏఈతో క్వాలిఫైయర్ మ్యాచ్‌లో శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. ఓపెనర్ పాథుమ్ నిసాంక 60 బంతుల్లో 74 పరుగులతో లంక ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కుశాల్ మెండిస్(18), ధనుజంయ డి సిల్వా(33) తప్ప మిగతా వాళ్లంత సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. యూఏఈ బౌలర్లలో కార్తిక్ మెయప్పన్ హ్యాట్రిక్ నమోదు చేసి సంచలనం సృష్టించాడు. 4 ఓవర్లలో 19 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. జహూర్ ఖాన్ రెండు, అయాన్ అఫ్జల్ ఖాన్ ఒకటి, ఆర్యన్ లక్రా ఒక వికెట్ తీశారు. మరో వికెట్ కోల్పోయిన లంక లంకకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. 15వ ఓవర్లో వరుసగా మూడు వికెట్లు కోల్పోయిన దసున్ షనక బృందం.. ఆ మరుసటి ఓవర్లో మరో వికెట్ నష్టపోయింది. 16వ ఓవర్లో అఫ్ఝల్ ఖాన్ బౌలింగ్‌లో నాలుగో బంతికి హసరంగ.. బాసిల్ హమీద్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. స్కోరు: 121-6. చమిక కరుణరత్నె, పాథుమ్ నిసాంక క్రీజులో ఉన్నారు. ఒకే ఓవర్లో మూడు వికెట్లు యూఏఈ బౌలర్ మెయప్పన్ శ్రీలంకను కోలుకోలేని దెబ్బకొట్టాడు. 15వ ఓవర్ నాలుగో బంతికి రాజపక్సను పెవిలియన్‌కు పంపిన అతడు.. ఆ మరుసటి రెండు బంతుల్లో అసలంక, దసున్ షనకలను బౌల్డ్ చేశాడు. దీంతో ఒకే ఓవర్లో శ్రీలంక మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. మెయప్పన్ హ్యాట్రిక్ తీసిన సంతోషంలో సంబరాలు చేసుకున్నాడు. 15 ఓవర్లు ముగిసే సరికి లంక స్కోరు: 117-5 14 ఓవర్లు ముగిసే సరికి లంక స్కోరెంతంటే యూఏఈ జరుగుతున్న క్వాలిఫైయర్ మ్యాచ్‌లో శ్రీలంక 14 ఓవర్లు ముగిసే సరికి 114/2 రెండు వికెట్లు నష్టపోయి 114 పరుగులు చేసింది. పాథుమ్ నిసాంక, భనుక రాజపక్స క్రీజులో ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన శ్రీలంక 12వ ఓవర్ మొదటి బంతికే శ్రీలంక రెండో వికెట్ కోల్పోయింది. అఫ్జల్ ఖాన్ బౌలింగ్‌లో ధనుంజయ (33పరుగులు) రనౌట్‌గా వెనుదిరిగాడు. 10 ఓవర్లకు శ్రీలంక స్కోర్: 84/1 10 ఓవర్లు ముగిసే సరికి శ్రీలంక వికెట్ కోల్పోయి 84 పరుగులు చేసింది. క్రీజులో నిస్సాంక(38), ధనుంజయ డి సిల్వా(27) పరుగులతో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన శ్రీలంక 42 పరుగుల వద్ద శ్రీలంక తొలి వికెట్ కోల్పోయింది. 18 పరుగులు చేసిన కుశాల్ మెండిస్.. లక్రా బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. 5 ఓవర్లకు శ్రీలంక స్కోర్: 57/1 2 ఓవర్లకు శ్రీలంక స్కోర్: 19/0 2 ఓవర్లు ముగిసే సరికి శ్రీలంక వికెట్ నష్టపోకుండా 19 పరుగులు చేసింది. క్రీజులో కుశాల్ మెండిస్(13), నిస్సాంక(5) పరుగులతో ఉన్నారు. టీ20 ప్రపంచకప్-2022 క్వాలిఫియర్స్(గ్రూప్-ఎ)లో యూఏఈ, శ్రీలంక జట్లు చావోరేవో తేల్చుకోవడానికి శ్రీలంక సిద్దమయ్యాయి. గీలాంగ్ వేదికగా జరుగుతోన్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన యూఏఈ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. కాగా ఈ మ్యాచ్‌కు శ్రీలంక ఆటగాడు గుణతిలక గాయం కారణంగా దూరమయ్యాడు. అతడి స్థానంలో అసలంక తుది జట్టులోకి వచ్చాడు. కాగా ఇరు జట్లు కూడా తమ తొలి మ్యాచ్‌లో ఓటమి చెందాయి. ఈ క్రమంలో సూపర్-12 అర్హత సాధించాలంటే ఇరు జట్లకు ఈ మ్యాచ్ చాలా కీలకం. తుది జట్లు: శ్రీలంక: పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్(వికెట్ కీపర్), ధనంజయ డి సిల్వా, భానుక రాజపక్సే, చరిత్ అసలంక, దసున్ షనక(సి), వనిందు హసరంగా, చమిక కరుణరత్నే, దుష్మంత చమీర, ప్రమోద్ మదుషన్, మహేశ్ తీక్షణ యూఏఈ: చిరాగ్ సూరి, ముహమ్మద్ వసీం, కాషిఫ్ దౌద్, వృత్త్యా అరవింద్(వికెట్ కీపర్), ఆర్యన్ లక్రా, బాసిల్ హమీద్, చుండంగపోయిల్ రిజ్వాన్(కెప్టెన్), అయాన్ అఫ్జల్ ఖాన్, కార్తీక్ మెయ్యప్పన్, జునైద్ సిద్దిక్, జహూర్ ఖాన్ చదవండి: T20 WC NED Vs NAM: ఉత్కంఠ పోరులో నెదర్లాండ్స్ విజయం.. సూపర్-12కు అర్హత! -
యూఏఈతో టీ20 సిరీస్.. జట్టును ప్రకటించిన బంగ్లాదేశ్! కెప్టెన్ దూరం!
యూఏఈతో టీ20 సిరీస్‌కు 17 మంది సభ్యులతో కూడిన తమ జట్టును బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు గురువారం ప్రకటించింది. ఈ సిరీస్‌కు రెగ్యూలర్ కెప్టెన్ షకీబ్ ఆల్ హాసన్ దూరం కావడంతో వికెట్ కీపర్ నూరల్ హాసన్ సారధిగా ఎంపికయ్యాడు. కాగా షకీబ్ ఆల్ హాసన్ ప్రస్తుతం కరీబియన్ లీగ్‌లో భాగం కావడంతో ఈ సిరీస్‌కు అందుబాటులో లేడు. ఇక యవ స్పిన్నర్ రషీద్ హోస్సెన్ తొలి సారిగా బంగ్లా సీనియర్ జట్టుకు ఎంపికయ్యాడు. అదే విధంగా గత కొంత కాలం జట్టుకు దూరంగా ఉన్న సీనియర్ బ్యాటర్ సౌమ్యా సర్కార్ తిరిగి ఈ సిరీస్‌తో జట్టులోకి వచ్చాడు. ఇక టీ20 ప్రపంచకప్-2022 సన్నాహాకాల్లో భాగంగా బంగ్లా జట్టు రెండు టీ20ల సిరీస్ నిమిత్తం యూఏఈ పర్యటనకు వెళ్లనుంది. సెప్టెంబర్ 25న దుబాయ్ వేదికగా జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. కాగా ఆసియాకప్-2022లో బంగ్లా జట్టు ఘోరంగా విఫలమైంది. లీగ్ దశలోనే బంగ్లాదేశ్ ఇంటిముఖం పట్టింది. బంగ్లాదేశ్ జట్టు: నూరుల్ హసన్ (కెప్టెన్), సబ్బీర్ రెహ్మాన్, మెహిదీ హసన్ మిరాజ్, అఫీఫ్ హొస్సేన్, మొసద్దెక్ హొస్సేన్, లిట్టన్ దాస్, యాసిర్ అలీ, ముస్తాఫిజుర్ రెహ్మాన్, మహ్మద్ సైఫుద్దీన్, తస్కిన్ అహ్మద్, ఎబాడోత్ హొస్సేన్, నజ్మ్ మహ్ముద్, నజ్ మహ్మద్, హసన్ మహ్ముద్స్ షోరిఫుల్ ఇస్లాం, సౌమ్య సర్కార్, రిషద్ హొస్సేన్ చదవండి: Dinesh Karthik: 'అవమానించాలని కాదు.. అసలు దినేశ్ కార్తిక్ రోల్ ఏంటి?' -
యూఏఈ టీ20 లీగ్‌లో అజం ఖాన్.. తొలి పాక్ ఆటగాడిగా!
యూఏఈ టీ20 లీగ్ తొలి సీజన్ కోసం డెసర్ట్ వైపర్స్ ప్రాంఛైజీ పాకిస్తాన్ ఆటగాడు అజం ఖాన్‌తో ఓప్పందం కుదుర్చుకుంది. తద్వారా యూఏఈ టీ20 లీగ్ అడుగుపెట్టిన తొలి పాక్ ఆటగాడిగా అజం ఖాన్ నిలిచాడు. కాగా టోర్నీ కోసం డెసర్ట్ వైపర్స్ తమ విదేశీ ఆటగాళ్ల జాబితాను శనివారం ప్రకటించింది. శ్రీలంక స్పిన్నర్ వానిందు హసరంగా, న్యూజిలాండ్ ఓపెనర్ కొలిన్ మున్రో వంటి స్టార్ ఆటగాళ్లను డెసర్ట్ వైపర్స్ తమ జట్టులోకి చేర్చుకుంది. డెసర్ట్ వైపర్స్ హెడ్ కోచ్‌గా జేమ్స్ ఫోస్టర్ మరో వైపు ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు టామ్ మూడీ తమ జట్టు క్రికెట్ డైరెక్టర్‌గా డెసర్ట్ వైపర్స్ నియమించింది. అదే విధంగా ఇంగ్లండ్ మాజీ వికెట్ కీపర్ జేమ్స్ ఫోస్టర్ తమ జట్టు ప్రధాన కోచ్‌గా డెసర్ట్ వైపర్స్ ఎంపిక చేసింది. కాగా డెసర్ట్ వైపర్స్ ప్రాంఛైజీని లాన్సర్ క్యాపిటల్ సంస్థ కొనుగోలు చేసింది. ఇక ఈ లీగ్ వచ్చే ఏడాది జనవరి 6 నుంచి ఫిబ్రవరి 12 వరరకు జరగనుంది. ఈ టోర్నీలో మొత్తం ఆరు జట్లు పాల్గొనున్నాయి. వాటిలో ఐదు జట్లును ఐపీఎల్ ప్రాంఛైజీలే దక్కించుకోవడం గమనార్హం. ఇక ఇప్పటికే దుబాయ్ క్యాపిటల్స్,ముంబై ఎమిరేట్స్,షార్జా వారియర్స్ తాము ఒప్పందం కుదుర్చుకున్న జాబితాను విడుదల చేశాయి. చదవండి: Asia Cup 2022: కెప్టెన్‌గా షనక.. ఆసియాకప్‌కు జట్టును ప్రకటించిన శ్రీలంక -
ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మరో నాలుగు దేశాలు
దుబాయ్ : అంతర్జాతీయ వన్డే ర్యాంకింగ్స్ జాబితాలోకి మరో నాలుగు జట్లు వచ్చి చేరాయి. పురుషుల వన్డే జట్టు ర్యాంకింగ్స్‌లో ఇప్పటి వరకు 12 జట్లు ఉన్న విషయం తెలిసిందే. తాజాగా నేపాల్, నెదర్లాండ్స్, స్కాట్లాండ్, యూఏఈ జట్లను పాయింట్ల పట్టికలో చేర్చినట్లు ఐసీసీ శుక్రవారం తెలిపింది. రేటింగ్ పాయింట్లను లెక్కించే ముందు కొత్త జట్లు ఆడిన అన్ని ద్వైపాక్షిక సిరీస్‌ల ఫలితాలను పరిగణనలోకి తీసుకున్నట్లు ఐసీసీ ఒక ప్రకటనలో పేర్కొంది. వన్డే హోదా సాధించిన వాటిలో స్కాట్లాండ్ (28 పాయింట్లు) 13వ ర్యాంక్.. యూఏఈ(18పాయింట్లు) 14వ ర్యాంక్ సాధించింది. నేపాల్, నెదర్లాండ్స్ జట్లు చెరో నాలుగు మ్యాచ్‌లు ఆడిన తరువాత పాయింట్ల పట్టికలో పూర్తిస్థాయి ర్యాంకులను పొందనున్నాయి. ఈ నాలుగు జట్లు వన్డే రేటింగ్ కలిగిన జట్లతో ఆడిన ప్రతి మ్యాచ్‌కు పాయింట్స్ కేటాయించారు. మే1,2015 నుంచి ఏప్రిల్ 30, 2017 వరుకు జరిగిన మ్యాచ్ 50 శాతం వెయిటేజ్ ఇవ్వగా.. మే 1,2017 అనంతరం జరిగిన మ్యాచ్‌లకు 100 శాతం వెయిటేజ్ ఇచ్చారు. ఈ జట్లతో ఇప్పటికే తొలి 12 స్థానాల్లో ఉన్న జట్ల ర్యాంకుల్లో ఎలాంటి మార్పు ఉండదని ఐసీసీ పేర్కొంది. గతేడాది నెదర్లాండ్స్ వన్డే హోదాను సాధించగా.. ప్రపంచకప్ క్వాలిఫయర్స్‌లో సూపర్ సిక్స్‌కు అర్హత సాధించిన స్కాట్లాండ్, యూఏఈలు తమ అంతర్జాతీయ వన్డే హోదాను కాపాడుకోగలిగాయి. క్వాలిఫయర్స్‌లో నేపాల్, పపువా న్యూగినియాపై గెలిచి అంతర్జాతీయ వన్డే జట్టు హోదాను సొంతం చేసుకుంది. -
నెదర్లాండ్స్ విజయం
ఓపెనర్ స్టీఫెన్ మైబర్గ్ (36 బంతుల్లో 55; 7 ఫోర్లు; 2 సిక్స్) అర్ధ సెంచరీతో ఆకట్టుకోవడంతో టి20 ప్రపంచకప్ అర్హత మ్యాచ్‌లో నెదర్లాండ్స్ జట్టు బోణీ చేసింది. యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)తో జరిగిన గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో నెదర్లాండ్స్ ఆరు వికెట్ల తేడాతో నెగ్గింది. ముందుగా యూఏఈ 19.5 ఓవర్లలో 151 పరుగులకు ఆలౌట్ అయ్యింది. షైమన్ అన్వర్ (19 బంతుల్లో 32; 4 ఫోర్లు; 1 సిక్స్), ఖుర్రమ్ ఖాన్ (25 బంతుల్లో 31; 4 ఫోర్లు) టాప్ స్కోరర్లుగా నిలిచారు. 12 పరుగులకే రెండు వికెట్లు కోల్పోగా స్వప్నిల్ (28 బంతుల్లో 23; 2 ఫోర్లు)తో కలిసి ఖుర్రమ్ మూడో వికెట్‌కు 67 పరుగులు జోడించాడు. జమీల్‌కు మూడు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత నెదర్లాండ్స్ 18.5 ఓవర్లలో నాలుగు వికెట్లకు 152 పరుగులు చేసి నెగ్గింది. టామ్ కూపర్ (26 బంతుల్లో 34 నాటౌట్; 4 ఫోర్లు; 1 సిక్స్) చివరికంటా నిలిచి జట్టు విజయాన్ని ఖాయం చేశాడు. కమ్రాన్ షెహజాద్‌కు రెండు వికెట్లు దక్కాయి. కూపర్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ లభించింది -
యూఏఈపై భారత్ ఘన విజయం
అండర్-19 ఆసియా కప్ షార్జా: ఆసియా కప్ అండర్-19 టోర్నమెంట్లో యువ భారత్ శుభారంభం చేసింది. అఖిల్ హేర్వాడ్కర్ (121 బంతుల్లో 101; 10 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీతో కదంతొక్కడంతో భారత్ 189 పరుగుల తేడాతో ఆతిథ్య యూఏఈ జట్టుపై ఘనవిజయం సాధించింది. శనివారం ఇక్కడ జరిగిన టోర్నీ తొలి మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లకు 320 పరుగుల భారీస్కోరు చేసింది. అంకుశ్ బేన్స్ (77), సంజు శామ్సన్ (65), రికీ భూయ్ (54) అర్ధసెంచరీలు సాధించారు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన యూఏఈ 40.1 ఓవర్లలో 131 పరుగులకే కుప్పకూలింది. చిరాగ్ సురి (26), డాన్ డిసౌజా (25) మినహా ఇంకెవరు చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేకపోయారు. భారత పేసర్ దీపక్ హుడా (4/21), ఆఫ్ స్పిన్నర్ ఆమిర్ ఘని (3/33) ధాటికి యూఏఈ బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు.