
యూఏఈతో టీ20 సిరీస్‌కు 17 మంది సభ్యులతో కూడిన తమ జట్టును బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు గురువారం ప్రకటించింది. ఈ సిరీస్‌కు రెగ్యూలర్ కెప్టెన్ షకీబ్ ఆల్ హాసన్ దూరం కావడంతో వికెట్ కీపర్ నూరల్ హాసన్ సారధిగా ఎంపికయ్యాడు. కాగా షకీబ్ ఆల్ హాసన్ ప్రస్తుతం కరీబియన్ లీగ్‌లో భాగం కావడంతో ఈ సిరీస్‌కు అందుబాటులో లేడు.
ఇక యవ స్పిన్నర్ రషీద్ హోస్సెన్ తొలి సారిగా బంగ్లా సీనియర్ జట్టుకు ఎంపికయ్యాడు. అదే విధంగా గత కొంత కాలం జట్టుకు దూరంగా ఉన్న సీనియర్ బ్యాటర్ సౌమ్యా సర్కార్ తిరిగి ఈ సిరీస్‌తో జట్టులోకి వచ్చాడు.
ఇక టీ20 ప్రపంచకప్-2022 సన్నాహాకాల్లో భాగంగా బంగ్లా జట్టు రెండు టీ20ల సిరీస్ నిమిత్తం యూఏఈ పర్యటనకు వెళ్లనుంది. సెప్టెంబర్ 25న దుబాయ్ వేదికగా జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. కాగా ఆసియాకప్-2022లో బంగ్లా జట్టు ఘోరంగా విఫలమైంది. లీగ్ దశలోనే బంగ్లాదేశ్ ఇంటిముఖం పట్టింది.
బంగ్లాదేశ్ జట్టు: నూరుల్ హసన్ (కెప్టెన్), సబ్బీర్ రెహ్మాన్, మెహిదీ హసన్ మిరాజ్, అఫీఫ్ హొస్సేన్, మొసద్దెక్ హొస్సేన్, లిట్టన్ దాస్, యాసిర్ అలీ, ముస్తాఫిజుర్ రెహ్మాన్, మహ్మద్ సైఫుద్దీన్, తస్కిన్ అహ్మద్, ఎబాడోత్ హొస్సేన్, నజ్మ్ మహ్ముద్, నజ్ మహ్మద్, హసన్ మహ్ముద్స్ షోరిఫుల్ ఇస్లాం, సౌమ్య సర్కార్, రిషద్ హొస్సేన్
చదవండి: Dinesh Karthik: 'అవమానించాలని కాదు.. అసలు దినేశ్ కార్తిక్ రోల్ ఏంటి?'
Comments
Please login to add a commentAdd a comment