T20 World Cup 2022: Bangladesh Shakib Al Hasan Joins Southee As Highest Wicket-Taker In T20Is - Sakshi
Sakshi News home page

T20 WC 2022: షకీబ్‌ అల్‌ హసన్ అరుదైన ఘనత.. ప్రపంచ రికార్డు సమం

Published Thu, Nov 3 2022 8:57 AM | Last Updated on Thu, Nov 3 2022 10:44 AM

Shakib Al Hasan joins Southee as highest wicket taker in T20Is - Sakshi

అంతర్జాతీయ టీ20ల్లో బంగ్లాదేశ్‌ కెప్టెన్‌  షకీబ్‌ అల్‌ హసన్ అరుదైన ఘనత సాధించాడు. టీ20 క్రికెట్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా న్యూజిలాండ్‌ పేసర్‌ సౌథీ(127) పేరిట రికార్డును సమం చేశాడు. టీ20 ప్రపంచకప్‌-2022లో భాగంగా టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో రెండు వికెట్లు పడగొట్టిన షకీబ్‌.. ఈ అరుదైన రికార్డును సమం చేశాడు. ఇప్పటి వరకు 101 ఇన్నింగ్స్‌లలో సౌథీ 127 వికెట్లు పడగొట్టగా.. షకీబ్‌ 106 ఇన్నింగ్స్‌లో ఈ ఘనత సాధించాడు.

ఇక రెండో స్థానంలో ఆఫ్గాన్‌ స్టార్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ 121 వికెట్లతో ఉన్నాడు. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. అఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ పోరులో బంగ్లాదేశ్‌పై  5 పరుగుల తేడాతో (డక్‌వర్త్‌–లూయిస్‌ ప్రకారం) భారత్‌ విజయం సాధించింది. దీంతో సెమీస్‌ అవకాశాలను బంగ్లాదేశ్‌ సంక్లిష్టం చేసుకుంది. ఇక బంగ్లాదేశ్‌ తమ అఖరి మ్యాచ్‌లో నవంబర్‌ 6న పాకిస్తాన్‌తో తలపడనుంది.


చదవండి: T20 WC 2022: ఆస్ట్రేలియా గడ్డపై కోహ్లి సరి కొత్త చరిత్ర.. సచిన్‌ రికార్డు బద్దలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement