షాహిద్ ఆఫ్రిది వ్యాఖ్యలకు రోజర్ బిన్నీ కౌంటర్
ICC Mens T20 World Cup 2022: టీమిండియాను ఉద్దేశించి నిరాధార ఆరోపణలు చేసిన పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిదికి భారత క్రికెట్ నియంత్రణ మండలి అధ్యక్షుడు రోజర్ బిన్నీ గట్టి కౌంటర్ ఇచ్చాడు. ఇలాంటి వ్యాఖ్యలు సరికావని.. ఇష్టారీతిన మాట్లాడితే సహించబోమన్నాడు. క్రికెట్ ప్రపంచంలో భారత్ పవర్‌హౌజ్ లాంటిదైనప్పటికీ తాము ప్రత్యేక ప్రయోజనాలేమీ పొందడం లేదని స్పష్టం చేశాడు.
అక్కసు వెళ్లగక్కిన ఆఫ్రిది
టీ20 ప్రపంచకప్-2022 సూపర్-12లో భాగంగా టీమిండియా- బంగ్లాదేశ్ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వాన ఆగిన తర్వాత మళ్లీ ఆట కొనసాగించారు అంపైర్లు. ఈ మ్యాచ్‌లో డక్‌వర్త్ లూయీస్ పద్ధతి ప్రకారం భారత్ ఐదు పరుగుల తేడాతో గెలిచింది. ఈ నేపథ్యంలో ఆఫ్రిది మాట్లాడుతూ.. ఫీల్డ్ తడిగా ఉన్నా మ్యాచ్ ఎలా కొనసాగిస్తారని, భారత్‌ను సెమీస్ చేర్చాలనే ఉద్దేశంతోనే ఐసీసీ ఇలా వ్యవహరిస్తోందంటూ ఆరోపణలు చేశాడు.
అంతేగాకుండా ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్‌కు అంపైర్లుగా వ్యవహరించిన వారినే.. ఇండియా- బంగ్లా మ్యాచ్‌కు కూడా అసైన్ చేశారని.. ఇవన్నీ చూస్తుంటే ఐసీసీ భారత్‌కు మేలు చేకూర్చే విధంగా వ్యవహరిస్తోందంటూ అక్కసు వెళ్లగక్కాడు.
అలా ఎలా మాట్లాడతారు?
ఆఫ్రిది వ్యాఖ్యలపై బీసీసీఐ బాస్ రోజర్ బిన్నీ స్పందించాడు. ‘‘ఇలా మాట్లాడటం సరికాదు. ఐసీసీ మాకు ఏ రకంగానూ అనుకూలంగా వ్యవహరించడం లేదు. ప్రతి జట్టు పట్ల వాళ్ల వైఖరి ఒకేలా ఉంటుంది. ఏ ప్రాతిపదికన మీరు అలా మాట్లాడతారు? మిగతా జట్ల కంటే మాకు అదనంగా లభించిన ప్రయోజనాలు ఏమిటి? క్రికెట్ ప్రపంచంలో ఇండియా అతిపెద్ద పవర్ హౌజ్. కానీ మాకు కూడా మిగతా జట్లలాంటి ట్రీట్‌మెంటే లభిస్తుంది’’ అని ఈ పాక్ మాజీ క్రికెటర్ వ్యాఖ్యలను ఖండించాడు.
చదవండి: Ind Vs Zim: భారత్‌తో మ్యాచ్.. అంచనాలు తలకిందులు చేసే ఛాన్స్ ఎలా వదులుకుంటాం: జింబాబ్వే కెప్టెన్
Virat Kohli- Anushka Sharma Love Story: అప్పుడప్పుడు నటించేవాడు కూడా.. ‘బ్యాడ్ జోక్’తో మాట కలిపి! ఇప్పుడేమో ఇలా
Comments
Please login to add a commentAdd a comment