T20 WC BAN vs NED: నెదర్లాండ్స్‌పై బంగ్లాదేశ్‌ ఘన విజయం | T20 World Cup 2022 Super 12: BAN vs NED Updates Highlights | Sakshi
Sakshi News home page

T20 WC BAN vs NED: నెదర్లాండ్స్‌పై బంగ్లాదేశ్‌ ఘన విజయం

Published Mon, Oct 24 2022 9:13 AM | Last Updated on Tue, Oct 25 2022 6:25 PM

T20 World Cup 2022 Super 12: BAN vs NED Updates Highlights - Sakshi

ICC Mens T20 World Cup 2022- Bangladesh vs Netherlands- Updates:

సూపర్‌-12లో భాగంగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 9 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ ఘన విజయం సాధించింది. 145 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్‌ 135 పరుగులకే ఆలౌటౌంది. బంగ్లా బౌలర్‌ టాస్కిన్‌ అహ్మద్‌ నాలుగు వికెట్లతో డచ్‌ పతానన్ని శాసించగా.. హసన్‌ మహ్మద్‌ రెండు, షకీబ్‌, సర్కార్‌ తలా ఒక్క వికెట్‌ సాధించారు.

డచ్‌ బ్యాటర్లలో కోలిన్ అకెర్మాన్ 62 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఇక తొలుత బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసింది. బంగ్లా బ్యాటర్లలో అఫిఫ్‌ హొసేన్‌ 38, షాంటో 25 పరుగులతో రాణించారు. నెదర్లాండ్స్‌ బౌలర్లలో వాన్ మీకెరెన్, బాస్ డి లీడ్ చెరో రెండు వికెట్లు సాధించారు.

ఐదో వికెట్‌ కోల్పోయిన నెదర్లాండ్స్‌
59 పరుగుల వద్ద నెదర్లాండ్స్‌ ఐదో వికెట్‌ కోల్పోయింది. 16 పరుగులు చేసిన ఎడ్వర్డ్స్.. షకీబ్‌ ఆల్‌ హసన్‌ బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డయ్యాడు
15 పరుగులకే నాలుగు వికెట్లు
145 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్‌ 15 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. 

తొలి ఓవర్‌లోనే రెండు వికెట్లు.. 
145 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్‌ తొలి ఓవర్‌లోనే రెండు వికెట్లు కోల్పోయింది. టాస్కిన్‌ ఆహ్మద్‌.. వరుసగా వి సింగ్‌,బాస్ డి లీడ్‌ను పెవిలియన్‌కు పంపాడు.

రాణించిన నెదర్లాండ్స్‌ బౌలర్లు.. టార్గెట్‌ 145 పరుగులు
టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసింది. బంగ్లా బ్యాటర్లలో అఫిఫ్‌ హొసేన్‌ 38 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. నెదర్లాండ్స్‌ బౌలర్లలో వాన్ మీకెరెన్, బాస్ డి లీడ్ చెరో రెండు వికెట్లు సాధించారు.

19 ఓవర్లకు బంగ్లాదేశ్‌ స్కోర్‌: 139/8
వరుస క్రమంలో బంగ్లాదేశ్‌ రెండు వికెట్లను కోల్పోయింది. 19 ఓవర్లకు బంగ్లాదేశ్‌ స్కోర్‌: 139/8

ఆరో వికెట్‌ కోల్పోయిన బంగ్లాదేశ్‌
121 పరుగులు వద్ద బంగ్లాదేశ్‌ ఆరో వికెట్‌ కోల్పోయింది. 13 పరుగులు చేసిన నూరల్‌ హసన్‌.. బాస్ డి లీడ్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు.

16 ఓవర్లకు బంగ్లాదేశ్‌ స్కోర్‌: 110/5
16 ఓవర్లు ముగిసే సరికి బంగ్లాదేశ్‌ 5 వికెట్లు కోల్పోయి 110 పరుగులు చేసింది. అఫిఫ్‌ హొసేన్‌, నూరుల్‌ హసన్‌ ప్రస్తుతం క్రీజులో ఉన్నారు.

5 వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్‌
నెదర్లాండ్స్‌ బౌలర్ల ధాటికి బంగ్లాదేశ్‌ బ్యాటర్లు నిలవలేకపోతున్నారు. 11వ ఓవర్‌ ముగిసే సరికి 76 పరుగులకే 5 వికెట్లు బంగ్లా కష్టాల్లో పడిపోయింది. అఫిఫ్‌ హొసేన్‌, నూరుల్‌ హసన్‌ ప్రస్తుతం క్రీజులో ఉన్నారు.

రెండో వికెట్‌ కోల్పోయిన బంగ్లాదేశ్‌
47 పరుగులు వద్ద బంగ్లాదేశ్‌ రెండో వికెట్ కోల్పోయింది. 25 పరుగులు చేసిన హొస్సేన్ శాంటో.. ప్రింగిల్‌ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు.

తొలి వికెట్‌ కోల్పోయిన బంగ్లాదేశ్‌
43 పరుగుల వద్ద బంగ్లాదేశ్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. 14 పరుగులు చేసిన సర్కార్‌..  పాల్ వాన్ మీకెరెన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

4 ఓవర్లకు బంగ్లాదేశ్‌ స్కోర్‌: 35/0
4 ఓవర్లు ముగిసే సరికి బంగ్లాదేశ్‌ వికెట్‌ నష్టపోకుండా 33 పరుగులు చేసింది. క్రీజులో  నజ్ముల్ హొస్సేన్ శాంటో(15), సౌమ్య సర్కార్(13) పరుగులతో ఉన్నారు.

టీ20 ప్రపంచకప్‌ సూపర్‌-12(గ్రూప్‌-2)లో భాగంగా హోబర్ట్ వేదికగా నెదర్లాండ్స్‌, బంగ్లాదేశ్‌ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన నెదర్లాండ్స్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది.

తుది జట్లు:
నెదర్లాండ్స్: మాక్స్ ఓడౌడ్, విక్రమ్‌జిత్ సింగ్, బాస్ డి లీడ్, కోలిన్ అకెర్‌మాన్, టామ్ కూపర్, స్కాట్ ఎడ్వర్డ్స్(కెప్టెన్‌/వికెట్‌ కీపర్‌), టిమ్ ప్రింగిల్, లోగాన్ వాన్ బీక్, షరీజ్ అహ్మద్, ఫ్రెడ్ క్లాసెన్, పాల్ వాన్ మీకెరెన్

బంగ్లాదేశ్‌: నజ్ముల్ హొస్సేన్ శాంటో, సౌమ్య సర్కార్, లిట్టన్ దాస్, షకీబ్ అల్ హసన్(కెప్టెన్‌), అఫీఫ్ హొస్సేన్, యాసిర్ అలీ, నూరుల్ హసన్(వికెట్‌ కీపర్‌), మొసద్దెక్ హొస్సేన్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహమాన్, హసన్ మహమూద్
చదవండి: T20 World Cup 2022: సచిన్‌ రికార్డు బద్దలు కొట్టిన కోహ్లి.. తొలి ఆటగాడిగా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement