టీ20 ప్రపంచకప్-2022లో తొలి హాట్రిక్ నమోదైంది. గ్రూప్ ‘ఎ’(క్వాలిఫియర్స్) తొలి రౌండ్‌లో భాగంగా శ్రీలంకతో మ్యాచ్‌లో యూఏఈ స్పిన్నర్ కార్తీక్ మెయ్యప్పన్ హ్యాట్రక్ వికెట్లు పడగొట్టాడు. శ్రీలంక ఇన్నింగ్స్ 15 ఓవర్ వేసిన మెయ్యప్పన్.. నాలుగో బంతికి రాజపాక్సను ఔట్ చేయగా.. ఆ తరువాతి రెండు బంతులకు వరుసగా అసలంక, షనకను పెవిలియన్‌కు పంపాడు.
తద్వారా ఈ ఏడాది మెగా ఈవెంట్‌లో హ్యట్రిక్ వికెట్లు పడగొట్టిన తొలి బౌలర్‌గా మెయ్యప్పన్ నిలిచాడు. ఇక ఓవరాల్‌గా టీ20 ప్రపంచకప్ చరిత్రలో హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టిన ఐదో బౌలర్‌గా మెయ్యప్పన్ రికార్డులకెక్కాడు.
ఈ మ్యాచ్‌లో మెయ్యప్పన్ తన నాలుగు ఓవర్ల కోటాలో 19 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు సాధించాడు. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసింది. లంక బ్యాటర్లలో ఓపెనర్ నిస్సాంక(74) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
add this quiz to t20 wc articles
చదవండి: BCCI- Key Decisions: గంగూలీకి గుడ్‌బై! జై షా కొనసాగింపు.. బీసీసీఐ కీలక నిర్ణయాలివే!
Comments
Please login to add a commentAdd a comment