Karthik Meiyappan
-
వరల్డ్‌కప్‌లో భారీ సిక్సర్.. కండలు చూపించిన బ్యాటర్
టీ20 వరల్డ్‌కప్-2022లో భారీ సిక్సర్ నమోదైంది. శ్రీలంకతో జరిగిన గ్రూప్-ఏ క్వాలిఫయర్ మ్యాచ్‌లో యూఏఈ ఆటగాడు జునైద్ సిద్ధిఖి ఈ ఘనత సాధించాడు. 10వ నంబర్ ఆటగాడిగా బరిలోకి దిగిన అతను.. దుష్మంత చమీరా వేసిన ఇన్నింగ్స్ 16వ ఓవర్ రెండో బంతికి 109 మీటర్ల భారీ సిక్సర్‌ను బాదాడు. స్టంప్స్‌పైకి వచ్చిన బంతిని జునైద్ డీప్ మిడ్ వికెట్ మీదుగా స్టేడియం దాటించాడు. ఈ మాన్స్టర్ సిక్సర్ బాదిన అనంతరం జునైద్ సెలబ్రేట్ చేసుకున్న తీరు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతుంది. జునైద్.. సిక్సర్ కొట్టగానే తన బలం ఇదంటూ కండలు చూపించాడు. pic.twitter.com/teQxUZMWi6 — Sanju Here 🤞👻 (@me_sanjureddy) October 18, 2022 pic.twitter.com/VHnnS9nAO6 — Sanju Here 🤞👻 (@me_sanjureddy) October 18, 2022 ఇదిలా ఉంటే, జునైద్ సిక్సర్ బాదినప్పటికే యూఏఈ ఓటమి దాదాపుగా ఖరారైంది. శ్రీలంక నిర్ధేశించిన 153 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన యూఏఈ ఆరంభం నుంచే క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయి 17.1 ఓవర్లలో 73 పరుగులకే కుప్పకూలింది. లంక బౌలర్లు హసరంగ (3/8), దుష్మంత చమీరా (315), మహీశ్ తీక్షణ (2/15), ప్రమోద్ మధుషన్ (1/14), దసున్ షనక (1/7).. యూఏఈ బ్యాటింగ్ లైనప్‌కు కకావికలం చేశారు. యూఏఈ ఇన్నింగ్స్‌లో కేవలం ముగ్గురు మాత్రమే రెండంకెల స్కోర్ చేయగా.. ఇన్నింగ్స్ మొత్తంలో ఒకే ఒక సిక్సర్ నమోదైంది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన శ్రీలంక ఓపెనర్ పథుమ్ నిస్సంక (60 బంతుల్లో 74; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), ధనంజయ డిసిల్వ (33) రాణించడంతో 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. వీరిద్దరు మినహా లంక ఇన్నింగ్స్‌లో అందరూ విఫలమయ్యారు. యూఏఈ బౌలర్లలో కార్తీక్ మెయప్పన్ (3/19) హ్యాట్రిక్‌తో సత్తా చాటగా.. జహూర్ ఖాన్ 2, అఫ్జల్ ఖాన్, ఆర్యన్ లక్రా తలో వికెట్ పడగొట్టారు. -
లంకపై హ్యాట్రిక్ సాధించిన యూఏఈ ఆటగాడు మన వాడే..!
టీ20 వరల్డ్‌కప్ గ్రూప్-ఏ క్వాలిఫయర్స్‌లో ఇవాళ (అక్టోబర్ 18) జరుగుతున్న మ్యాచ్‌లో హ్యాట్రిక్ సాధించిన యూఏఈ బౌలర్ కార్తీక్ మెయప్పన్‌పై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. 22 ఏళ్ల ఈ యువ రైట్ ఆర్మ్ లెగ్ బ్రేక్ బౌలర్.. లంకతో జరిగిన మ్యాచ్‌లో ఎవరూ ఊహించని విధంగా హ్యాట్రిక్ సాధించి యావత్ క్రికెట్ ప్రపంచ దృష్టిని ఆకర్శించాడు. లంక ఇన్నింగ్స్‌లో 15వ ఓవర్ వేసిన కార్తీక్.. ఆఖరి మూడు బంతులకు రాజపక్స, అసలంక, షనక వికెట్లు తీసి, ప్రస్తుత వరల్డ్‌కప్‌లో హ్యాట్రిక్ సాధించిన తొలి ఆటగాడిగా, టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో ఈ ఘనత సాధించిన 5వ బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. కార్తీక్‌కు ముందు పొట్టి ప్రపంచకప్‌లో బ్రెట్ లీ, కర్టిస్ క్యాంపర్, వనిందు హసరంగ, కగిసో రబాడలు మాత్రమే హ్యాట్రిక్ సాధించారు. కాగా, లంకతో మ్యాచ్‌లో హ్యాట్రిక్ సాధించడంతో స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న కార్తీక్ గురించి నెటిజన్లు ఆరా తీయడం మొదలు పెట్టారు. భారతీయ పేరు కలిగి ఉండటంతో మనవారు ఇంకాస్త ఎక్కువ ఆసక్తి కనబర్చి కార్తీక్ పూర్వపరాలను సేకరించారు. కార్తీక్ పళనియపన్ మెయప్పన్ మన దక్షిణాది చెందిన వాడే అని తెలిసి ఫ్యాన్స్ సంబురపడిపోతున్నారు. కార్తీక్ అక్టోబర్ 8, 2000 సంవత్సరంలో తమిళనాడులోని చెన్నై సగరంలో జన్మించాడు. కార్తీక్ కుటుంబం 2012లో దుబాయ్‌లో సెటిల్ కావడంతో.. అతను తన క్రికెటింగ్ కెరీర్‌ను యూఏఈ జట్టుతో ప్రారంభించాడు. 2019లో యూఏఈ తరఫున వన్డే అరంగేట్రం చేసిన కార్తీక్.. ఇప్పటివరకు 8 వన్డేలు. 12 టీ20లు ఆడి మొత్తం 28 వికెట్లు పడగొట్టాడు. ఇదిలా ఉంటే, శ్రీలంక-యూఏఈ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేయగా.. ఛేదనలో చేతులెత్తేసిన యూఏఈ 10 ఓవర్ల తర్వాత 6 వికెట్లు నష్టానికి 36 పరుగులు మాత్రమే చేసి ఓటమి దశగా సాగుతుంది. View this post on Instagram A post shared by ICC (@icc) var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1971406958.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
యూఏఈ స్పిన్నర్ సంచలనం.. కార్తీక్ మెయప్పన్ సరికొత్త రికార్డు
టీ20 ప్రపంచకప్-2022లో తొలి హాట్రిక్ నమోదైంది. గ్రూప్ ‘ఎ’(క్వాలిఫియర్స్) తొలి రౌండ్లో భాగంగా శ్రీలంకతో మ్యాచ్‌లో యూఏఈ స్పిన్నర్ కార్తీక్ మెయ్యప్పన్ హ్యాట్రక్ వికెట్లు పడగొట్టాడు. శ్రీలంక ఇన్నింగ్స్ 15 ఓవర్ వేసిన మెయ్యప్పన్.. నాలుగో బంతికి రాజపాక్సను ఔట్ చేయగా.. ఆ తరువాతి రెండు బంతులకు వరుసగా అసలంక, షనకను పెవిలియన్‌కు పంపాడు. తద్వారా ఈ ఏడాది మెగా ఈవెంట్లో హ్యట్రిక్ వికెట్లు పడగొట్టిన తొలి బౌలర్‌గా మెయ్యప్పన్ నిలిచాడు. ఇక ఓవరాల్‌గా టీ20 ప్రపంచకప్ చరిత్రలో హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టిన ఐదో బౌలర్‌గా మెయ్యప్పన్ రికార్డులకెక్కాడు. ఈ మ్యాచ్‌లో మెయ్యప్పన్ తన నాలుగు ఓవర్ల కోటాలో 19 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు సాధించాడు. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసింది. లంక బ్యాటర్లలో ఓపెనర్ నిస్సాంక(74) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. View this post on Instagram A post shared by ICC (@icc) var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4911494512.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } });add this quiz to t20 wc articles చదవండి: BCCI- Key Decisions: గంగూలీకి గుడ్‌బై! జై షా కొనసాగింపు.. బీసీసీఐ కీలక నిర్ణయాలివే!