అండర్-19 ఆసియా కప్
షార్జా: ఆసియా కప్ అండర్-19 టోర్నమెంట్‌లో యువ భారత్ శుభారంభం చేసింది. అఖిల్ హేర్వాడ్కర్ (121 బంతుల్లో 101; 10 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీతో కదంతొక్కడంతో భారత్ 189 పరుగుల తేడాతో ఆతిథ్య యూఏఈ జట్టుపై ఘనవిజయం సాధించింది. శనివారం ఇక్కడ జరిగిన టోర్నీ తొలి మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లకు 320 పరుగుల భారీస్కోరు చేసింది.
అంకుశ్ బేన్స్ (77), సంజు శామ్సన్ (65), రికీ భూయ్ (54) అర్ధసెంచరీలు సాధించారు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన యూఏఈ 40.1 ఓవర్లలో 131 పరుగులకే కుప్పకూలింది. చిరాగ్ సురి (26), డాన్ డిసౌజా (25) మినహా ఇంకెవరు చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేకపోయారు. భారత పేసర్ దీపక్ హుడా (4/21), ఆఫ్ స్పిన్నర్ ఆమిర్ ఘని (3/33) ధాటికి యూఏఈ బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు.
యూఏఈపై భారత్ ఘన విజయం
Published Sun, Dec 29 2013 2:30 AM | Last Updated on Sat, Sep 2 2017 2:04 AM
Advertisement
Advertisement