Scotland team
-
T20 WC 2024: నమీబియాను చిత్తు చేసిన స్కాట్లాండ్..
టీ20 వరల్డ్‌కప్-2024లో స్కాట్లాండ్ బోణీ కొట్టింది. ఈ మెగా టోర్నీలో భాగంగా బార్బోడస్ వేదికగా నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో స్కాట్లాండ్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నమీబియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. నమీబియా బ్యాటర్లలో కెప్టెన్ గెర్హార్డ్ ఎరాస్మస్(52) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. గ్రీన్(28), డావిన్(20) పరుగులతో రాణించారు. స్కాట్లాండ్ బౌలర్లలో వీల్ 3 వికెట్లు పడగొట్టగా.. కుర్రీ రెండు, సోలే, గ్రీవ్స్, లీస్క్ తలా వికెట్ సాధించారు.రాణించిన కెప్టెన్, లీస్క్..అనంతరం 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన స్కాట్లాండ్ 18.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. స్కాటీష్ కెప్టెన్ బెర్రింగ్టన్(47) ఆఖరి వరకు క్రీజులో నిలబడి మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు. అతడితో పాటు ఆల్‌రౌండర్ మైఖేల్ లీస్క్(35) పరుగులతో రాణించాడు. ఇక నమీబియా బౌలర్లలో కెప్టెన్ ఎరాస్మస్ రెండు వికెట్లు పడగొట్టగా.. స్కోల్జ్, రుబీన్, లుంగమినీ తలా వికెట్ సాధించారు. ఇక ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన మైఖేల్ లీస్క్‌కు ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు దగ్గింది. -
టీ20 వరల్డ్‌కప్‌కు స్కాట్లాండ్ జట్టు ప్రకటన..
టీ20 వరల్డ్‌కప్-2024కు 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును స్కాట్లాండ్ క్రికెట్ బోర్డు సోమవారం ప్రకటించింది. ఈ జట్టుకు రిచీ బెరింగ్టన్ సారథ్యం వహించనున్నాడు. గత కొంతకాలంగా జట్టుకు దూరంగా ఉంటున్న మైఖేల్ జోన్స్, పేసర్ బ్రాడ్ వీల్ తిరిగి రీఎంట్రీ ఇచ్చారు. ఈ మెగా టోర్నీలో స్కాట్లాండ్ గ్రూప్-బిలో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, ఒమన్, నమీబియాలతో పాటు ఉంది. స్కాట్లాండ్ జట్టు మే 26న ఈ పొట్టి వరల్డ్‌కప్ కోసం కరేబియన్ దీవులకు పయనం కానుంది. స్కాటిష్ జట్టు ట్రినిడాడ్‌లో ఆఫ్ఘనిస్తాన్, ఉగాండాతో రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడనుంది. ఇక ప్రధాన టోర్నీలో స్కాట్లాండ్ తమ తొలి మ్యాచ్‌లో జూన్ 4 ఇంగ్లండ్‌తో తలపడనుంది.స్కాట్లాండ్ టీ20 వరల్డ్‌కప్ జట్టురిచీ బెరింగ్టన్ (కెప్టెన్), మాథ్యూ క్రాస్, బ్రాడ్ క్యూరీ, క్రిస్ గ్రీవ్స్, ఒలి హెయిర్స్, జాక్ జార్విస్, మైఖేల్ జోన్స్, మైఖేల్ లీస్క్, బ్రాండన్ మెక్‌ముల్లెన్, జార్జ్ మున్సే, సఫ్యాన్ షరీఫ్, క్రిస్ సోల్, చార్లీ టియర్, మార్క్ వాట్, బ్రాడ్ వీల్. -
ఐదు వికెట్లు, వీరోచిత శతకం.. వన్డే వరల్డ్‌కప్‌కు నెదర్లాండ్స్ అర్హత
అక్టోబర్‌లో జరగనున్న వన్డే వరల్డ్‌కప్‌కు నెదర్లాండ్స్ అర్హత సాధించింది. స్కాట్లాండ్తో జరిగిన వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ సూపర్ సిక్స్ మ్యాచ్‌లో డచ్ జట్టు నాలుగు వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో(బౌలింగ్‌లో ఐదు వికెట్లు, బ్యాటింగ్‌లో సెంచరీ) మెరిసిన బాస్ డీ లీడే హైలెట్‌గా నిలిచాడు. దీంతో క్వాలిఫయర్-2 హోదాలో నెదర్లాండ్స్ వరల్డ్‌కప్‌కు పదో జట్టుగా అర్హత సాధించింది. ఇక క్వాలిఫయర్-1గా శ్రీలంక ఇప్పటికే వన్డే వరల్డ్‌కప్‌కు అర్హత సాధించగా.. తాజాగా డచ్ జట్టు క్వాలిఫయర్-2 హోదాలో వన్డే వరల్డ్‌కప్‌కు వెళ్లనుంది. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ జరగనుంది. భారత్ గడ్డపై ఈ మెగా సంగ్రామం జరగనుంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. బ్రాండన్ మెక్ముల్లన్ 110 బంతుల్లో 106 పరుగులు సెంచరీ చేయగా.. కెప్టెన్ రిచీ బెరింగ్టన్ 64, థామస్ మెకింటోష్ 38 పరుగులు చేశారు. నెదర్లాండ్స్ బౌలర్లలో బాస్ డీ లీడే ఐదు వికెట్లు తీయగా.. రెయాన్ క్లీన్ రెండు, వాన్‌బీక్ ఒక వికెట్ పడగొట్టాడు. అనంతరం 278 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ 42.5 ఓవర్లలోనే ఆరు వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను అందుకుంది. నెదర్లాండ్స్ మిడిలార్డర్ బ్యాటర్ బాస్ డీ లీడే(92 బంతుల్లో 123 పరుగులు) సంచలన శతకంతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఓపెనర్ విక్రమ్‌జిత్ సింగ్ 40 పరుగులు, ఆఖర్లో సకీబ్ జుల్పికర్ 33 నాటౌట్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. బౌలిగ్లో ఐదు వికెట్లు తీయడంతో పాటు వీరోచిత శతకంతో మెరిసిన బాస్ డీ లీడేను 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు వరించింది. 90 (82) 👉 123 (92) Bas de Leede went berserk in the last 10 balls he faced to seal Netherlands' #CWC23 qualification 💪#SCOvNED pic.twitter.com/gJMrkhm3aU — ICC Cricket World Cup (@cricketworldcup) July 6, 2023 A stunning heist! 😱 Netherlands have booked their #CWC23 tickets 🎫✈#SCOvNED pic.twitter.com/HtdyRvTWo0 — ICC Cricket World Cup (@cricketworldcup) July 6, 2023 చదవండి: #MitchellMarsh: నాలుగేళ్ల తర్వాత రీఎంట్రీ.. వన్డే తరహాలో రెచ్చిపోయి సెంచరీ #MarkWood: యాషెస్ చరిత్రలో రెండో ఫాస్టెస్ట్ బంతి.. ఖవాజాకు మైండ్ బ్లాక్ -
హతవిధి.. జింబాబ్వే కొంపముంచిన స్కాట్లాండ్
జింబాబ్వే జట్టును దురదృష్టం వెంటాడింది.వరల్డ్‌కప్‌కు అర్హత సాధించాలన్న కల చెదిరింది. సొంతగడ్డపై జరుగుతున్న క్రికెట్ వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్‌లో గ్రూప్ దశలో వరుస విజయాలతో చెలరేగింది. సీన్ విలియమ్స్ వరుస సెంచరీలకు తోడుగా సికందర్ రజా ఆల్‌రౌండ్ ప్రదర్శన చేస్తుండడంతో జింబాబ్వే ఈసారి వన్డే వరల్డ్‌కప్‌కు అర్హత సాధిస్తుందని అంతా భావించారు. అయితే సూపర్ సిక్స్ దశకు వచ్చేసరికి చతికిలపడింది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో పరాజయంతో జింబాబ్వే అవమాన భారంతో వరల్డ్‌కప్ అర్హత రేసు నుంచి నిష్క్రమించింది. క్రికెట్ వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ రేసులో భాగంగా మంగళవారం స్కాట్లాండ్తో జరిగిన సూపర్ సిక్స్ ఆరో మ్యాచ్‌లో జింబాబ్వే 31 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. 235 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన జింబాబ్వే 41.1 ఓవర్లలో 203 పరుగులకు ఆలౌట్ అయింది. రియాన్ బర్ల్ 84 బంతుల్లో 83 పరుగులు వీరోచిత పోరాటం వృథాగా మిగిలిపోయింది. మెస్లీ మెద్వెర్ 40, సికందర్ రజా 34 పరుగులు చేశారు. స్కాట్లాండ్ బౌలర్లలో క్రిస్ సోల్ మూడు వికెట్లు తీయగా, బ్రాండన్ మెక్ముల్లన్ రెండు, సఫ్యాన్ షరీఫ్, మార్క్ వాట్, క్రిస్ గ్రీవ్స్ తలా ఒక వికెట్ తీశారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. మైకెల్ లీస్క్ 48, మాథ్యూ క్రాస్ 38, బ్రాండన్ మెక్ముల్లన్ 34, మున్సే 31, మార్క్ వాట్ 21 పరుగులు చేశారు. జింబాబ్వే బౌలర్లలో సీన్ విలియమ్స్ మూడు వికెట్లు తీయగా.. చటారా రెండు, నగరవా ఒక వికెట్ పడగొట్టాడు. సూపర్ సిక్స్‌లో వరుస రెండు ఓటములు జింబాబ్వే కొంపముంచితే.. తొలి మ్యాచ్‌లో ఓడినా వరుసగా రెండు విజయాలతో ప్లస్ రన్‌రేట్‌తో ఉన్న స్కాట్లాండ్ ఖాతాలో ఆరు పాయింట్లు ఉన్నాయి. దీంతో ఆ జట్టుకు వన్డే వరల్డ్‌కప్‌కు అర్హత సాధించే చాన్స్ ఉంది. స్కాట్లాండ్ తమ చివరి మ్యాచ్ నెదర్లాండ్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో స్కాట్లాండ్ గెలిస్తే నేరుగా వరల్డ్‌కప్‌కు అర్హత సాధిస్తుంది. ఒకవేళ ఓడినా స్కాట్లాండ్కు అవకాశం ఉంటుంది. కాకపోతే నెదర్లాండ్స్ చేతిలో భారీ ఓటమి పాలవ్వకుండా జాగ్రత్తపడాలి. స్కాట్లాండ్తో మ్యాచ్‌లో నెదర్లాండ్స్ 30 కంటే ఎక్కువ పరుగులతో గెలవాలి లేదంటే చేజింగ్‌లో ఆరు ఓవర్లు మిగిలి ఉండగానే టార్గెట్‌ను అందుకోవాలి. అప్పుడే నెదర్లాండ్స్ వన్డే వరల్డ్‌కప్‌కు అర్హత సాధిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం డచ్ జట్టు ఖాతాలో నాలుగు పాయింట్లు మాత్రమే ఉన్నాయి. స్కాట్లాండ్ను ఓడించినా ఆ జట్టు ఆరు పాయింట్లకు చేరుకుంటుంది. అప్పుడు నెట్ రన్‌రేట్ కీలకం కానుంది. Final World Cup 2023 spot qualification scenario: Scotland - win and grab their tickets for India. Netherlands - win by 30+ runs or chase the target with 6 overs to spare. pic.twitter.com/R0HzIljTSl — Mufaddal Vohra (@mufaddal_vohra) July 4, 2023 చదవండి: #AlexCarey: 'బెయిర్ స్టో అమాయక చక్రవర్తి.. బ్రాడ్ కపట సూత్రధారి' -
టి20 క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన స్టార్ క్రికెటర్
స్కాట్లాండ్ సీనియర్ ఆటగాడు కైల్ కోయెట్జర్ గురువారం అంతర్జాతీయ టి20 క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. మూడు వారాల క్రితమే కెప్టెన్ పదవి నుంచి తప్పుకున్న కోయెట్జర్.. తాజాగా టి20లకు గుడ్‌బై చెబుతూ నిర్ణయం తీసుకున్నాడు. ఫ్యామిలీతో మరింత సమయం గడపడంతో పాటు కోచింగ్ కెరీర్‌పై ఎక్కువగా ఫోకస్ పెట్టేందుకే టి20ల నుంచి తప్పుకుంటున్నట్లు పేర్కొన్నాడు. కాగా టి20లకు గుడ్‌బై చెప్పిన కోయెట్జర్ వన్డేలకు మాత్రం అందుబాటులో ఉండనున్నాడు. 2008లో అంతర్జాతీయ టి20ల్లో అరంగేట్రం చేసిన కైల్ కోయెట్జర్ 70 మ్యాచ్‌లాడి 1495 పరుగులు సాధించాడు. స్కాట్లాండ్ తరపున స్టార్ బ్యాటర్‌గా పేరు పొందిన కోయెట్జర్కు టి20ల్లో కెరీర్ బెస్ట్ స్కోరు 89 పరుగులు కాగా.. అతని ఖాతాలో ఆరు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక వన్డేల్లో 76 మ్యాచ్‌ల్లో 2,915 పరుగుల సాధించిన కోయెట్జర్ ఖాతాలో 5 సెంచరీలు, 20 అర్థసెంచరీలు ఉన్నాయి. వన్డేల్లో కోయెట్జర్ అత్యధిక స్కోరు 156 పరుగులు. ఇక డిసెంబర్ 2020న కైల్ కోయెట్జర్ ఐసీసీ మెన్స్ అసోసియేట్ క్రికెటర్ ఆఫ్ ది డికేడ్ అవార్డును గెలుచుకున్నాడు. ఇక కోయెట్జర్ టి20లకు గుడ్‌బై చెప్పిన రోజునే న్యూజిలాండ్‌తో తలపడనున్న జట్టును స్కాట్లాండ్ ప్రకటించింది. రిచీ బెరింగ్టన్ నాయకత్వంలో 18 మందితో కూడిన జట్టును టి20లతో పాటు వన్డే మ్యాచ్‌కు ప్రకటించింది. న్యూజిలాండ్‌తో స్కాట్లాండ్.. జూలై 27, 29 తేదీల్లో రెండు టి20లు, జూలై 31న ఒక వన్డే మ్యాచ్ ఆడనుంది. మైకెల్ జోన్స్, ఒలివర్ హారిస్, కరఎయిన వల్లాస్లు జట్టులోకి ఎంట్రీ ఇవ్వగా.. కైల్ కొయెట్జర్ న్యూజిలాండ్‌తో ఆడనున్న ఒకే ఒక్క వన్డేకు ఎంపికయ్యాడు. న్యూజిలాండ్‌తో ఆడనున్న స్కాట్లాండ్ జట్టు: రిచీ బెరింగ్టన్ (కెప్టెన్), మాథ్యూ క్రాస్ (వికెట్ కీపర్), కైల్ కోయెట్జర్ (వన్డేకు మాత్రమే), అలీ ఎవాన్స్, క్రిస్ గ్రీవ్స్, ఆలివర్ హెయిర్స్, మైఖేల్ జోన్స్, మైఖేల్ లీస్క్, కాలమ్ మెక్లియోడ్, గావిన్ మెయిన్, క్రిస్ మక్‌బ్రైడ్, యాడ్, నీల్, సఫ్యాన్ షరీఫ్, క్రిస్ సోల్, హంజా తాహిర్, క్రెయిగ్ వాలెస్, మార్క్ వాట్ చదవండి: BCCI Case: గంగూలీ, జై షా పదవుల వ్యవహారం.. అమికస్ క్యూరీగా మణిందర్ సింగ్ Football Match: తారాస్థాయికి గొడవ.. కొట్టుకున్న ఆటగాళ్లు -
స్కాట్లాండ్ కెప్టెన్‌గా రిచీ బెరింగ్టన్..!
స్కాట్లాండ్ కెప్టెన్‌గా ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ రిచీ బెరింగ్టన్ ఎంపికయ్యాడు. బెరింగ్టన్ను కెప్టెన్‌గా నియమిస్తూ క్రికెట్ స్కాట్లాండ్ సోమవారం ప్రకటన చేసింది. కాగా కొద్ది రోజుల క్రితం కైల్ కోయెట్జర్ స్కాట్లాండ్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. ఇక దక్షిణాఫ్రికాలోని ప్రిటోరియాలో జన్మించిన బెరింగ్టన్.. స్కాట్లాండ్ తరపున తన క్రికెట్ కెరీర్‌ను ప్రారంభించాడు. 2008లో ఐర్లాండ్‌పై అంతర్జాతీయ అరంగేట్రం చేసిన బెరింగ్టన్.. ఇప్పటి వరకు వన్డేలు, టీ20ల్లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన స్కాట్లాండ్ ఆటగాడిగా నిలిచాడు. అదే విధంగా 2015 వన్డే ప్రపంచకప్‌లో స్కాట్లాండ్ జట్టులో బెరింగ్టన్ భాగంగా ఉన్నాడు. ఇప్పటి వరకు 92 వన్డేలు,74 టీ20ల్లో స్కాట్లాండ్కు అతడు ప్రాతినిధ్యం వహించాడు. రెండు ఫార్మాట్లు కలిపి బెరింగ్టన్ 4,189 పరుగులు, 60వికెట్లు సాధించాడు. చదవండి: Ind Vs Eng 5th Test: టీమిండియాతో ఐదో టెస్టు.. జట్టును ప్రకటించిన ఇంగ్లండ్..! -
క్రికెట్లో అత్యంత చెత్త రికార్డు..!
లండన్ : క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డు నమోదైంది. క్రికెట్ అంటే బ్యాట్స్‌మెన్‌కు అనుకూలం అనే వారందరు ఈ మ్యాచ్ గణంకాలను పరిశీలిస్తే ముక్కున వేలేయాల్సిందే! అవును మరి అంతలా విలవిలాడిపోయారు బ్యాట్స్‌మెన్. 11.2 ఓవర్లాడి కేవలం 18 పరుగులకే చాపచుట్టేసారంటే బౌలర్లు ఎంత బెంబేలెత్తించారో అర్థమవుతోంది. షెఫర్డ్ నీమ్ కెంట్ క్రికెట్ లీగ్‌లో భాగంగా.. బెకెన్హామ్ సీసీ, బెక్స్లీ సీసీల మధ్య గత శనివారం జరిగిన మ్యాచ్‌లో ఈ చెత్త రికార్డు నమోదైంది. తొలుత టాస్ గెలిచిన బెకెన్హామ్ సీసీ బ్యాటింగ్‌కు దిగి 18 పరుగులకే కుప్పకూలింది. ఇందులో ఐదుగురు బ్యాట్స్‌మెన్ డకౌట్ కాగా.. ముగ్గురు సింగిల్ మాత్రమే సాధించడం విశేషం. స్కాట్లాండ్ తరఫున 57 అంతర్జాతీయ వన్డేలు ఆడిన కాలమ్ మెక్లియోడ్ బెక్స్లీ తరపున 6 వికెట్లతో చెలరేగాడు. అనంతరం 19 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెక్స్లీ జట్టు 12 నిమిషాల్లో ఛేదించింది. దీంతో 61 నిమిషాల్లోనే మ్యాచ్ ముగిసింది. ఈ దెబ్బకు 152 ఏళ్ల ఈ క్లబ్ చరిత్రలో అత్యంత తక్కువ స్కోరు నమోదు కావడమే కాకుండా లీగ్‌లోనూ ఇదే అత్యల్పం కావడం గమనార్హం. ప్రస్తుతం ఈ మ్యాచ్ విశేషాలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. -
విజయంతో ముగింపు
దక్షిణాఫ్రికాలో భారత మహిళల హాకీ జట్టు పర్యటన స్టెలెన్‌బోష్: దక్షిణాఫ్రికా పర్యటనను భారత మహిళల హాకీ జట్టు విజయంతో ముగించింది. స్కాట్లాండ్ జట్టుతో జరిగిన చివరి మ్యాచ్‌లో భారత్ 3-0 గోల్స్ తేడాతో గెలిచింది. భారత్ తరఫున పూనమ్ రాణి రెండు గోల్స్ చేయగా... వందన కటారియా ఒక గోల్ సాధించింది. ఈ పర్యటనలో జర్మనీ, దక్షిణాఫ్రికా, స్కాట్లాండ్ జట్లతో భారత్ మ్యాచ్‌లు ఆడింది. జర్మనీతో జరిగిన రెండు మ్యాచ్‌ల్లో మాత్రమే భారత్ ఓడిపోయింది. -
భారత్‌కు మరో విజయం
స్టెలెన్‌బోష్ (దక్షిణాఫ్రికా): భారత మహిళల హాకీ జట్టు దక్షిణాఫ్రికా పర్యటనలో తమ జైత్రయాత్రను కొనసాగిస్తోంది. స్కాట్లాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 5-0 గోల్స్ తేడాతో ఓడించింది. భారత్ తరఫున రాణి రెండు గోల్స్ చేయగా... దీపిక, అనురాధ, గుర్జిత్ ఒక్కో గోల్ సాధించారు. -
పెట్టుబడులకు స్కాట్లాండ్ ఆసక్తి
పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లితో స్కాట్లాండ్ బృందం భేటీ రాష్ట్రంలో పారిశ్రామికవిధానంపై ఆరా సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు స్కాట్లాండ్ ఆసక్తి చూపింది. ఈ మేరకు గురువారం స్కాట్లాండ్ ప్రతినిధుల బృందం రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో భేటీ అయింది. ఇక్కడి పారిశ్రామిక విధానాల గురించి తెలుసుకుంది. స్కాట్లాండ్కు చెందిన ఆసియా ఫసిఫిక్ ఫర్ స్కాటిష్ ఎంటర్ప్రైజెస్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ జూలియన్ టేలర్, సౌత్ ఇండియా బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ తియోదర్ ఇమ్మాన్యుయెల్, ఇండియా మేనేజర్ రూమ కుమార్ బుస్సీలు మంత్రితో చర్చించారు. స్కాట్లాండ్, తెలంగాణల మధ్య పారిశ్రామిక, వ్యాపార రంగాల్లో పెట్టుబడులు, కొత్త అవకాశాలను విసృ్తతపరిచే అంశాలపై చర్చించారు. రాష్ట్ర కొత్త పారిశ్రామిక విధానాన్ని మంత్రి వివరించారు. కరచాలనం చేసినంత సులువుగా వ్యాపారం చేసేలా పారిశ్రామిక విధానాలున్నాయని చెప్పారు. రాష్ట్రాన్ని పెట్టుబడుల స్వర్గధామంగా మార్చడానికి అవినీతి, సమస్యలు లేని విధానాన్ని తీసుకొచ్చామన్నారు. ప్రతిష్టాత్మక సంస్థలైన ఐఐటీ, ఐఎస్బీ, ట్రిపుల్ ఐటీ, సీసీఎంబీ వంటి సంస్థలు ఉండటంతో నైపుణ్యం గల మానవ వనరులకు కొదువలేదని చెప్పారు. మెగా ప్రాజెక్టులకు పారిశ్రామిక క్లియరెన్స్‌లను కేవలం 15 రోజుల్లో ఇచ్చేందుకు టీఎస్-ఐపాస్ విధానాన్ని తీసుకొచ్చామన్నారు. జీవశాస్త్రం, ఫార్మా, సంప్రదాయేతర ఇంధన వనరులు, నీటి నిర్వహణ, విద్య, స్మార్ట్ సిటీ అభివృద్ధి వంటి అంశాలపట్ల ఆసక్తిగా ఉన్నామని స్కాట్లాండ్ ప్రతినిధులు తెలిపారు. పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి ఉన్న రంగాల గురించి సమగ్ర నివేదిక ద్వారా తమకు తెలియజేయాలని మంత్రి సూచించారు. త్వరలో మళ్లీ హైదరాబాద్‌లో పర్యటిస్తామని స్కాట్లాండ్ ప్రతినిధులు వెల్లడించారు.