స్కాట్లాండ్ సీనియర్ ఆటగాడు కైల్ కోయెట్జర్ గురువారం అంతర్జాతీయ టి20 క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. మూడు వారాల క్రితమే కెప్టెన్ పదవి నుంచి తప్పుకున్న కోయెట్జర్.. తాజాగా టి20లకు గుడ్‌బై చెబుతూ నిర్ణయం తీసుకున్నాడు. ఫ్యామిలీతో మరింత సమయం గడపడంతో పాటు కోచింగ్ కెరీర్‌పై ఎక్కువగా ఫోకస్ పెట్టేందుకే టి20ల నుంచి తప్పుకుంటున్నట్లు పేర్కొన్నాడు. కాగా టి20లకు గుడ్‌బై చెప్పిన కోయెట్జర్ వన్డేలకు మాత్రం అందుబాటులో ఉండనున్నాడు.
2008లో అంతర్జాతీయ టి20ల్లో అరంగేట్రం చేసిన కైల్ కోయెట్జర్ 70 మ్యాచ్‌లాడి 1495 పరుగులు సాధించాడు. స్కాట్లాండ్ తరపున స్టార్ బ్యాటర్‌గా పేరు పొందిన కోయెట్జర్‌కు టి20ల్లో కెరీర్ బెస్ట్ స్కోరు 89 పరుగులు కాగా.. అతని ఖాతాలో ఆరు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక వన్డేల్లో 76 మ్యాచ్‌ల్లో 2,915 పరుగుల సాధించిన కోయెట్జర్ ఖాతాలో 5 సెంచరీలు, 20 అర్థసెంచరీలు ఉన్నాయి. వన్డేల్లో కోయెట్జర్ అత్యధిక స్కోరు 156 పరుగులు. ఇక డిసెంబర్ 2020న కైల్ కోయెట్జర్ ఐసీసీ మెన్స్ అసోసియేట్ క్రికెటర్ ఆఫ్ ది డికేడ్ అవార్డును గెలుచుకున్నాడు.
ఇక కోయెట్జర్ టి20లకు గుడ్‌బై చెప్పిన రోజునే న్యూజిలాండ్‌తో తలపడనున్న జట్టును స్కాట్లాండ్ ప్రకటించింది. రిచీ బెరింగ్‌టన్ నాయకత్వంలో 18 మందితో కూడిన జట్టును టి20లతో పాటు వన్డే మ్యాచ్‌కు ప్రకటించింది. న్యూజిలాండ్‌తో స్కాట్లాండ్.. జూలై 27, 29 తేదీల్లో రెండు టి20లు, జూలై 31న ఒక వన్డే మ్యాచ్ ఆడనుంది. మైకెల్ జోన్స్, ఒలివర్ హారిస్, కరఎయిన వల్లాస్‌లు జట్టులోకి ఎంట్రీ ఇవ్వగా.. కైల్ కొయెట్జర్ న్యూజిలాండ్‌తో ఆడనున్న ఒకే ఒక్క వన్డేకు ఎంపికయ్యాడు.
న్యూజిలాండ్‌తో ఆడనున్న స్కాట్లాండ్ జట్టు: రిచీ బెరింగ్టన్ (కెప్టెన్), మాథ్యూ క్రాస్ (వికెట్ కీపర్), కైల్ కోయెట్జర్ (వన్డేకు మాత్రమే), అలీ ఎవాన్స్, క్రిస్ గ్రీవ్స్, ఆలివర్ హెయిర్స్, మైఖేల్ జోన్స్, మైఖేల్ లీస్క్, కాలమ్ మెక్‌లియోడ్, గావిన్ మెయిన్, క్రిస్ మక్‌బ్రైడ్, యాడ్, నీల్, సఫ్యాన్ షరీఫ్, క్రిస్ సోల్, హంజా తాహిర్, క్రెయిగ్ వాలెస్, మార్క్ వాట్
చదవండి: BCCI Case: గంగూలీ, జై షా పదవుల వ్యవహారం.. అమికస్ క్యూరీగా మణిందర్ సింగ్
Comments
Please login to add a commentAdd a comment