T20 WC 2024: నమీబియాను చిత్తు చేసిన స్కాట్లాండ్‌.. | T20 WC 2024: Scotland beat Namibia by 5 wickets | Sakshi
Sakshi News home page

T20 WC 2024: నమీబియాను చిత్తు చేసిన స్కాట్లాండ్‌..

Published Fri, Jun 7 2024 10:48 AM | Last Updated on Fri, Jun 7 2024 10:58 AM

T20 WC 2024: Scotland beat Namibia by 5 wickets

టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2024లో స్కాట్లాండ్ బోణీ కొట్టింది. ఈ మెగా టోర్నీలో భాగంగా బార్బోడస్‌ వేదికగా నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో స్కాట్లాండ్‌ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన నమీబియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. 

నమీబియా బ్యాటర్లలో కెప్టెన్‌ గెర్హార్డ్ ఎరాస్మస్(52) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. గ్రీన్‌(28), డావిన్‌(20) పరుగులతో రాణించారు. స్కాట్లాండ్‌ బౌలర్లలో వీల్‌ 3 వికెట్లు పడగొట్టగా.. కుర్రీ రెండు, సోలే, గ్రీవ్స్‌, లీస్క్‌ తలా వికెట్‌ సాధించారు.

రాణించిన కెప్టెన్‌, లీస్క్..
అనంతరం 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన స్కాట్లాండ్‌ 18.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. స్కాటీష్‌ కెప్టెన్‌ బెర్రింగ్‌టన్(47) ఆఖరి వరకు క్రీజులో నిలబడి మ్యాచ్‌ను ఫినిష్‌ చేశాడు. అతడితో పాటు ఆల్‌రౌండర్‌ మైఖేల్ లీస్క్‌(35) పరుగులతో రాణించాడు.

 ఇక నమీబియా బౌలర్లలో కెప్టెన్‌ ఎరాస్మస్ రెండు వికెట్లు పడగొట్టగా.. స్కోల్జ్‌, రుబీన్‌, లుంగమినీ తలా వికెట్‌ సాధించారు. ఇక ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టిన మైఖేల్ లీస్క్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ది మ్యాచ్‌ అవార్డు దగ్గింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement