స్కాట్లాండ్ కెప్టెన్‌గా ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ రిచీ బెరింగ్టన్ ఎంపికయ్యాడు. బెరింగ్టన్‌ను కెప్టెన్‌గా నియమిస్తూ క్రికెట్ స్కాట్లాండ్ సోమవారం ప్రకటన చేసింది. కాగా కొద్ది రోజుల క్రితం కైల్ కోయెట్జర్ స్కాట్లాండ్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. ఇక దక్షిణాఫ్రికాలోని ప్రిటోరియాలో జన్మించిన బెరింగ్టన్.. స్కాట్లాండ్ తరపున తన క్రికెట్ కెరీర్‌ను ప్రారంభించాడు.
2008లో ఐర్లాండ్‌పై అంతర్జాతీయ అరంగేట్రం చేసిన బెరింగ్టన్.. ఇప్పటి వరకు వన్డేలు, టీ20ల్లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన స్కాట్లాండ్ ఆటగాడిగా నిలిచాడు. అదే విధంగా 2015 వన్డే ప్రపంచకప్‌లో స్కాట్లాండ్ జట్టులో బెరింగ్టన్ భాగంగా ఉన్నాడు. ఇప్పటి వరకు 92 వన్డేలు,74 టీ20ల్లో స్కాట్లాండ్‌కు అతడు ప్రాతినిధ్యం వహించాడు. రెండు ఫార్మాట్‌లు కలిపి బెరింగ్టన్ 4,189 పరుగులు, 60వికెట్లు సాధించాడు.
చదవండి: Ind Vs Eng 5th Test: టీమిండియాతో ఐదో టెస్టు.. జట్టును ప్రకటించిన ఇంగ్లండ్..!
Comments
Please login to add a commentAdd a comment