Richie Berrington
-
శ్రీలంకకు ధీటుగా హ్యాట్రిక్ విజయాలు సాధించిన స్కాట్లాండ్
వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ 2023లో గ్రూప్-బిలో శ్రీలంకకు ధీటుగా చిన్న జట్టు స్కాట్లాండ్ వరుస విజయాలు సాధిస్తుంది. ఇవాళ (జూన్ 25) ఒమన్‌పై విజయం సాధించడంతో ఆ జట్టు శ్రీలంక తరహాలో హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసింది. తద్వారా గ్రూప్-బి నుంచి శ్రీలంక తర్వాత సూపర్ సిక్స్‌కు చేరుకున్న రెండో జట్టుగా నిలిచింది. ఇవాళే జరిగిన మరో మ్యాచ్‌లో శ్రీలంక చేతిలో ఓటమి చవిచూసిన ఐర్లాండ్ టోర్నీ నుంచి నిష్క్రమించగా.. స్కాట్లాండ్ చేతిలో ఓడినా ఒమన్ ఈ గ్రూప్ నుంచి మూడో జట్టుగా సూపర్ సిక్స్‌కు అర్హత సాధించింది. గ్రూప్-బిలో మరో జట్టైన యూఏఈ 3 మ్యాచ్‌ల్లో 3 పరాజయాలతో ఇదివరకే టోర్నీ నుంచి నిష్క్రమించింది. మరోవైపు గ్రూప్-ఏ నుంచి జింబాబ్వే, నెదర్లాండ్స్, వెస్టిండీస్ జట్లు సూపర్ సిక్స్ దశకు చేరగా.. నేపాల్, యూఎస్ఏ టోర్నీ నుంచి నిష్క్రమించాయి. మ్యాచ్ విషయానికొస్తే.. ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో స్కాట్లాండ్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఇరగదీసింది. ఫలితంగా 76 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్.. నిర్ణీత ఓవర్లలో 320 పరుగులు చేసి ఆలౌటైంది. బ్రాండన్ మెక్‌ముల్లెన్ (136) సూపర్ సెంచరీతో ఇరగదీయగా.. కెప్టెన్ రిచీ బెర్రింగ్టన్ (60) అర్ధసెంచరీతో రాణించాడు. ఒమన్ బౌలర్లలో బిలాల్ ఖాన్ 5 వికెట్లు పడగొట్టగా.. ఫయాజ్ బట్ 2, జే ఒడేడ్రా ఓ వికెట్ పడగొట్టారు. 321 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఒమన్.. ఏ దశలోనూ విజయం సాధించేట్టు కనపడలేదు. ఆ జట్టు తొలి 6 వికెట్లు క్రమ అంతరాల్లో పోగొట్టుకుంది. అయితే వికెట్ కీపర్ నసీం ఖుషీ (63) ఒమన్‌ను ఆదుకునే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆఖర్లో స్కాట్లాండ్ బౌలర్ క్రిస్ గ్రీవ్స్ చెలరేగి 5 వికెట్లు పడగొట్టడంతో ఒమన్ కథ ముగిసింది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 244 పరుగులు మాత్రమే చేయగలిగింది. -
కెప్టెన్ వీరోచిత శతకం.. జోరు మీదున్న స్కాట్లాండ్
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్(CWC 2023)లో స్కాట్లాండ్ జట్టు దూకుడు కనబరుస్తోంది. లీగ్‌లో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. శుక్రవారం యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో స్కాట్లాండ్ 111 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. స్కాట్లాండ్ కెప్టెన్ రిచీ బెరింగ్టన్ (136 బంతుల్లో 127 పరుగులు, 9 ఫోర్లు, 3సిక్సర్లు) వీరోచిత సెంచరీతో మెరిశాడు. అతనికి తోడుగా మైకెల్ లీస్క్ 41, మార్క్ వాట్ 31 బంతుల్లో 44 నాటౌట్ మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. దీంతో స్కాట్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది. అనంతరం 283 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన యూఏఈ స్కాట్లాండ్ బౌలర్ల దాటికి 35.3 ఓవర్లలో 171 పరుగులకే ఆలౌట్ అయింది. కెప్టెన్ ముహ్మద్ వసీమ్ 36 పరుగులు మినహా మిగతావారు పెద్దగా రాణించలేదు. స్కాట్లాండ్ బౌలర్లలో షరీఫ్ నాలుగు వికెట్లు తీయగా.. క్రిస్ సోల్ మూడు వికెట్లు పడగొట్టాడు. ఈ విజయంతో స్కాట్లాండ్ సూపర్ సిక్స్‌కు మరింత చేరువ కాగా.. మరోవైపు హ్యాట్రిక్ ఓటమితో యూఏఈ టోర్నీ నుంచి నిష్క్రమించినట్లే. చదవండి: #LionelMessi: 'కేజీఎఫ్' బ్యాక్‌గ్రౌండ్.. రోమాలు నిక్కబొడిచేలా.. -
స్కాట్లాండ్ కెప్టెన్‌గా రిచీ బెరింగ్టన్..!
స్కాట్లాండ్ కెప్టెన్‌గా ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ రిచీ బెరింగ్టన్ ఎంపికయ్యాడు. బెరింగ్టన్ను కెప్టెన్‌గా నియమిస్తూ క్రికెట్ స్కాట్లాండ్ సోమవారం ప్రకటన చేసింది. కాగా కొద్ది రోజుల క్రితం కైల్ కోయెట్జర్ స్కాట్లాండ్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. ఇక దక్షిణాఫ్రికాలోని ప్రిటోరియాలో జన్మించిన బెరింగ్టన్.. స్కాట్లాండ్ తరపున తన క్రికెట్ కెరీర్‌ను ప్రారంభించాడు. 2008లో ఐర్లాండ్‌పై అంతర్జాతీయ అరంగేట్రం చేసిన బెరింగ్టన్.. ఇప్పటి వరకు వన్డేలు, టీ20ల్లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన స్కాట్లాండ్ ఆటగాడిగా నిలిచాడు. అదే విధంగా 2015 వన్డే ప్రపంచకప్‌లో స్కాట్లాండ్ జట్టులో బెరింగ్టన్ భాగంగా ఉన్నాడు. ఇప్పటి వరకు 92 వన్డేలు,74 టీ20ల్లో స్కాట్లాండ్కు అతడు ప్రాతినిధ్యం వహించాడు. రెండు ఫార్మాట్లు కలిపి బెరింగ్టన్ 4,189 పరుగులు, 60వికెట్లు సాధించాడు. చదవండి: Ind Vs Eng 5th Test: టీమిండియాతో ఐదో టెస్టు.. జట్టును ప్రకటించిన ఇంగ్లండ్..!