
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్(CWC 2023)లో స్కాట్లాండ్ జట్టు దూకుడు కనబరుస్తోంది. లీగ్‌లో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. శుక్రవారం యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో స్కాట్లాండ్ 111 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. స్కాట్లాండ్ కెప్టెన్ రిచీ బెరింగ్టన్ (136 బంతుల్లో 127 పరుగులు, 9 ఫోర్లు, 3సిక్సర్లు) వీరోచిత సెంచరీతో మెరిశాడు. అతనికి తోడుగా మైకెల్ లీస్క్ 41, మార్క్ వాట్ 31 బంతుల్లో 44 నాటౌట్ మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. దీంతో స్కాట్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది.
అనంతరం 283 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన యూఏఈ స్కాట్లాండ్ బౌలర్ల దాటికి 35.3 ఓవర్లలో 171 పరుగులకే ఆలౌట్ అయింది. కెప్టెన్ ముహ్మద్ వసీమ్ 36 పరుగులు మినహా మిగతావారు పెద్దగా రాణించలేదు. స్కాట్లాండ్ బౌలర్లలో షరీఫ్ నాలుగు వికెట్లు తీయగా.. క్రిస్ సోల్ మూడు వికెట్లు పడగొట్టాడు. ఈ విజయంతో స్కాట్లాండ్ సూపర్ సిక్స్‌కు మరింత చేరువ కాగా.. మరోవైపు హ్యాట్రిక్ ఓటమితో యూఏఈ టోర్నీ నుంచి నిష్క్రమించినట్లే.
చదవండి: #LionelMessi: 'కేజీఎఫ్' బ్యాక్‌గ్రౌండ్.. రోమాలు నిక్కబొడిచేలా..