క్రికెట్ వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ పోరులో శ్రీలంక జట్టుకు ఎదురులేకుండా పోయింది. గ్రూప్-బిలో భాగంగా స్కాట్లాండ్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో లంక జట్టు 82 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. నాలుగింటికి నాలుగ విజయాలు సాధించిన లంక 8 పాయింట్లతో గ్రూప్ టాపర్‌గా సూపర్ సిక్స్‌కు చేరుకుంది. ఈ నేపథ్యంలో వన్డే వరల్డ్‌కప్‌కు క్వాలిఫై అయ్యే అవకాశాలను దాదాపు ఖరారు చేసుకుంది.
మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 49.3 ఓవర్లలో 245 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్ పాతుమ్ నిస్సాంక 85 బంతుల్లో 75 పరుగులు చేయగా.. చరిత్ అసలంక 65 బంతుల్లో 63 పరుగులతో రాణించాడు. వీరిద్దరు మినహా మిగతావారిలో చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్‌లు ఆడడంలో విఫలమయ్యారు. స్కాట్లాండ్ బౌలర్లలో క్రిస్ గ్రీవ్స్ నాలుగు వికెట్లు తీయగా.. మార్క్ వాట్ మూడు, క్రిస్ సోల్ రెండు, ఎవన్స్ ఒక వికెట్ తీశాడు.
అనంతరం 246 పరుగుల టార్గెట్‌తో బరిలోకి స్కాట్లాండ్ ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు. క్రిస్ గ్రీవ్స్ ఒక్కడే 56 పరుగులతో ఒంటరి పోరాటం చేయడంతో స్కాట్లాండ్ 29 ఓవర్లలోనే 163 పరుగులకు ఆలౌట్ అయింది. లంక బౌలర్లలో మహీష్ తీక్షణ మూడు వికెట్లతో రాణించగా.. హసరంగా రెండు, కాసున్ రజిత, లాహిరు కుమారా, దాసున్ షనకలు తలా ఒక వికెట్ పడగొట్టారు.
ఇప్పటికే గ్రూప్-బి నుంచి లంకతో పాటు స్కాట్లాండ్, ఒమన్‌లు సూపర్ సిక్స్‌కు క్వాలిఫై అయ్యాయి. అయితే లీగ్‌స్టేజీ సహా సూపర్ సిక్స్‌లో సాధించే పాయింట్ల ఆధారంగా ఒక జట్టు మాత్రమే వరల్డ్‌కప్‌కు క్వాలిఫై అవుతుంది. ఈ విషయంలో లంక గ్రూప్-బి నుంచి ముందు వరుసలో ఉంది.
Sri Lanka bag two crucial points against Scotland going into the Super Six stage of the #CWC23 Qualifier 👏#SLvSCO: https://t.co/FCKWkeNT75 pic.twitter.com/RUq8S7nR7l
— ICC Cricket World Cup (@cricketworldcup) June 27, 2023
Spinning a web 🕸️
— ICC Cricket World Cup (@cricketworldcup) June 27, 2023
For his figures of 3/41, Maheesh Theekshana is the @aramco #POTM from #SLvSCO 🙌 #CWC23 pic.twitter.com/tjbIXmvjsS
Comments
Please login to add a commentAdd a comment